సైనికుడు
అన్ని రంగముల కన్న
సైనిక రంగమె మిన్న
సైనికులే లేని అవని
కాంతి తప్పిన జనని_1
దేశానికి రక్ష సైనికులు
వారికివ్వాలి రక్షణ పాలకులు
మనకు ధైర్యాన్నిచ్చేది వారే
వారికిసాటి మరెవ్వరూ లేరే_2
సరిహద్దు రక్షణ సైనికులే
నిశీధిలోతారాజువ్వలు సైనికులే
వారే నింగిలోని సూర్యచంద్రులు
పుడమిపై జనించిన పుణ్యపురుషులు_3
భూమాత పుత్రుడు సైనికుడు
యుద్ధరంగంలో వీర కిశోరుడు
భారతావనికి వెలుగు దివ్వెవు
జనులందరికి నీవే రక్షకుడవు-4
చేనుకు కంచె రక్ష
దేశానికి సైనికులే రక్ష
మన సుఖనిద్ర ఫలం
ఎందరో సైనికుల త్యాగఫలం-5
చిప్ప ఓదయ్య
తెలుగు పండిట్
MPUPS బొమ్మిరెడ్డిపల్లి
మండలం ధర్మారం
జిల్లా పెద్దపల్లి 7382322134
తెలంగాణ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి