🌴కరోనా గ్రహణం🌴
భూగోళ గ్రహానికి కరోనా గ్రహణం పట్టింది
ప్రపంచమంతా మూతికి బట్ట కట్టు కొని
హస్త రేఖలు అరిగేలా శానిటైజర్ ను రుద్దుకుంటూ భయం నీడన బతుకుతుంది
అగుపించని శత్రువు కరోనాపై ఆయుధం లేని యుద్ధం చేస్తూ
అలసిపోయిన గుండెలను అక్కున
చేర్చుకోవడానికి బండెడు బలగమున్నా
సముద్రమంత ఆస్తి ఉన్నా
అనుమానపు అడ్డుగోడలు ఎక్కువై
మానవత్వం మంటల్లో మాడిపోతుంది
ఆపదను ఆసరా చేసుకుని
జలగల్లా పీక్కు తింటున్న
కనికరంలేని “ కార్పోరేట్ ” జేబులకు
చిల్లులు పెట్టి రాక్షస ఖేలి ఆడుతుంది
కరోనా చివరి మజిలీ కూడా
చిరాకు పెడుతుంది.
కాలీ కాలనీ శవాలు
పీక్కు తింటున్న శునకాలు
పల్లెలు ,పట్టణాలు విషాద సరాగాలు
ఆలపిస్తున్నాయి
మందో మాకో వచ్చేదాకా ఇంకా కొన్నాళ్లు
ఈ కన్నీళ్లు తప్పవు
అందాకా తాబేలులా తలను ఇంట్లోకి
ముడుచుకుని ఉందాం
కరోనా నుండి మనల్ని మనం కాపాడుకుందాం
----‐-----------‐--------------------------
✍✍✍తాటిపాముల రమేష్ (టీచర్ )
శివనగర్, వరంగల్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి