శ్రీరామ భక్తాగ్రేసరా రామదూత హనుమా!!
మా ప్రార్థనలను ప్రీతితో స్వీకరించుమా!
మా మొరలను ముదముతో ఆలకింపుమా!
అంజనీపుత్ర అమేయ గుణసంపన్న హనుమా!!
మాకు సద్భుద్ధి సతతం ప్రసాదింపుమా!
మాకు సన్మార్గం సత్వరమే చూపుమా!
వాయునందనా మహాబలశాలీ హనుమా!!
మా ఆరోగ్యాలను సదా రక్షింపుమా!
మా భయక్రోధాలను నిత్యం నివారింపుమా!
సుగ్రీవమిత్ర వినయవిధేయ హనుమా!!
మా శోకకారకాలను శీఘ్రముగా నివారించుమా!
మా మనోవ్యాకులతను మమతతో మట్టుబెట్టుమా!
భక్త సులభానుగ్రహ భక్తశ్రేష్ఠ హనుమా!!
మాకు సద్గుణాలను సదా సిద్దింపజేయుమా!
మాకు లక్ష్యసాధనా మార్గమ్మును హితముతో బోధింపుమా!
లక్ష్మణ ప్రాణరక్షకా లంకపురి దహన హనుమా!!
మా విజయాతిశయములను మమతతో త్రుంచుమా!
మాకు వినయ విధేయతలను విస్తృతంగా అందింపుమా!
రుద్రాంశ సంభూత భవిష్యత్తు బ్రహ్మా హనుమా!!
నీదు కీర్తనములే మా సకల సంకట హరణం హరణం!!
నీదు నామమే అనవరతము మాకు శరణం శరణం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
(వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా)
17/05/2020, 13:20, ఆదివారం.
నమస్కారం సార్! మీ రచనలు పోస్ట్ చేయగానే చధువుచున్నాను.ఇంగ్లీష్ ఉపాద్యాయులు ఐన మీరు తెలుగు లొ కుడా బాగా రచనలు చేయడం గొప్ప విషయం.అమ్మ గురించి రచన ఎప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా రాసిన రచన చాలా బాగున్నాయ్ సార్.కృతజ్ఞతలు తో నాగరాజు అమెరికన్ ఇండియా ఫౌండేషన్
రిప్లయితొలగించండిsir chala bagundi jai Sri Ram
రిప్లయితొలగించండి