🚩కార్మికుడా ఓ కార్మికుడా🚩
................................
బ్రతుకు దెరువు కోసము
ఊరూరు తిరుగుతావు
కాయ కష్టము చేసి
నాలుగు పైసలు సంపాదించి
పూట పూటను గడుపుతావు
~కార్మికుడా ఓ కార్మికుడా ..
పిల్ల పాపలను చంకనేసుకొని
పొట్ట కూటి కోసం వలస వెళ్ళితివి
ప్యాక్టరీలు పరిశ్రములు నడిపించి
రైతన్నకు తోడైతరి
దేశాభిరుద్దిలో భాగమైతిరి
~ కార్మికుడా ఓ కార్మికుడా ..
విత్తు విత్తేది పంటకోసేది
లోడు ఎత్తేది లోడు దించేది
రోడ్లు వేసేది బిల్డింగ్ కట్టేది
రాళ్లు కొట్టేది శిల్పం చెక్కేది
ఇనుమును కరిగించేది ఆయుధం తయారు చేసేది
ఐన నీవు పేదవాడివి
~కార్మికుడా ఓ కార్మికుడా ..
పని మనిషివి తోటమాలివి
జీతగాడివి గుమస్తవి
పారిశుద్దివి కాపలాదారుడివి
రోజు కూలివి సహాయకారివి
ఇంటి నుండి గెంటివేసిరి
~కార్మికుడా ఓ కార్మికుడా..
ఉండటానికి ఇల్లు లేదు
తింటానికి తిండిలేదు
త్రాగటానికి నీళ్లు లేవు
కట్టుకోవటానికి బట్ట లేదు
కాళ్లకు చెప్పులు లేవు
నిద్రవస్తే బండరాయినీకు పరుపు
~కార్మికుడా ఓ కార్మికుడా ..
యజమానులు పెత్తందార్లు
కాంట్రాక్టర్లు కమిషన్లదార్లు
MLA లు MP లు
మంత్రులు , ముఖ్యమంత్రులు ,
ప్రధానమంత్రి ,రాష్ట్రపతి
మీదెగ్గరకు రాకపాయ
మీ గోస వినరాయా చూడరాయ
~కార్మికుడా ఓ కార్మికుడా ...
నీ నడకకు నీ కన్నీటికి
నీ దాహంకు నీ ఆకలికి
నీ కష్టాలకు నీ హింసకు
నీ చావుకు కారకులెవరు
కారకులెవరు కారకులెవరు
~కార్మికుడా ఓ కార్మికుడా ..
నీలో ఉన్నది ఆయుధం
ఆ ఆయుధమే ఓటు
నీ ఓటే నీ జీవితాన్ని మారుస్తుంది మారుస్తుంది
మారుస్తుంది మారుస్తుంది
~ కార్మికుడా ఓ కార్మికుడా ..
✊️✊️✊️✊️✊️✊️✊️
రచయిత.....
షేక్ రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి