🌴కష్టాల గుట్టలు 🌴
1. కరోనా దెబ్బ
బడుగు బతుకుల మీద
పిడుగు దెబ్బ
ఉన్న ఉపాధి ఊడి
చేద్దామంటే పని లేక
చేతిలో కాని లేక
వ్యవస్థ అవస్థ గా మారడంతో
చేసేది లేక ఉసురు పోసిన
ఊరి వైపు కదులుతుండ్రు
2. చంకలో చంటి పిల్ల
నెత్తి మీద మూట ముల్లె
సూర్యుడు నిప్పుల
వర్షం కురిపిస్తుంటే
ధరణి నూనే కాగిన
గంగాళంలా కాలుతుంటే
పాదాలకు పాదరక్షకాలు లేక
కొందామంటే కొత్తలు లేక
కాలిన బొబ్బలతో
పాదాలు అరిగే దాక
గమ్యం ముద్దాడే దాక
మారథాన్ ను సాగిస్తుండ్రు
స్వేద సముద్రంలో ఈదుతూ
అనుకోకుండా మార్గ మధ్యలోనే
యముడి ఒడిలో ఒరుగుతుండ్రు
3. వాళ్లకు ఢాంబికాలు,
దందాలు తెలియదు
మాటల మధుర గుళికలు తెలుసు
కడుపులో కల్మషాలు తెలియదు
కాయకష్టం తెలుసు
జేబులకు చిల్లులు పెట్టడం తెలియదు
పెదవిపై చిరునవ్వు తెలుసు.
4.ఏడు దశాబ్దాల కాలంలో ఏలికలు
పేదరికంపై ఎత్తిన కత్తి మొండిదైంది
ఉపాధిపై గురి పెట్టిన
బాణం ఉత్తదయింది
బడుగుల రాత మారట్లేదు
కష్టాల గుట్టలు కరగట్లేదు
ఓట్లేసుకున్నోళ్ళు ఒడ్డెక్కుతుండ్రు
ఓట్లేసినోళ్ళు గడ్లెకలుస్తుండ్రు
ఓటు ఆయుధం తియ్యాలి
బడుగులను మరిచినోళ్ళకు
వాత పెట్టాలి.
------------------------------‐---
✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.
వలస కార్మికుల వ్యధలను అభివ్యక్తించిన మీకు హృదయపూర్వక శుభాభినందనలు సర్!
రిప్లయితొలగించండి💐💐💐💐💐💐