* ఓ మనిషీ తెలుసుకో *
--------------------------
కులము లేనివాడు గుణవంతుడౌతాడు
మతము లేనివాడు మానవతావాదౌతాడు
ప్రాంతాలు లేనివాడు పరోపకారుడౌతాడు
ఇవన్నీ ఉన్నోడు దేశ ద్రోహుడౌతున్నాడు!
ఓ మనిషీ తెలుసుకో !
తెలుసుకొని మసలుకో!!
భగవత్ గీత చదివినవాడు
మార్గం చూపుతానంటాడు,
బైబిల్ చదివినవాడు
శాంతి పరుస్తానంటాడు,
ఖురాన్ చదివినవాడు
ఆకలి తీరుస్తానంటాడు.
ఏమీ చదవనివాడు
దేశభక్తుడనంటాడు.
ఓ మనిషీ తెలుసుకో !
తెలుసుకొని మసలుకో !!
చదువు చెప్పే గురువుకు
కులమతాలు లేవయ్యా !
దేశాన్ని కాపాడేవాడికి
కులమతాలు లేవయ్యా!
పంట పండించే రైతుకు
కులమతాలు లేవయ్యా !
యంత్రాలు తయారుచేసే వారికీ
కులమతాలు లేవయ్యా
దేశాన్ని పాలించే పాలకులు
కుల మతాలు అంటా రేమిటయ్యా ?
ఓ మనిషీ తెలుసుకో !
తెలుసుకొని మసలుకో!
పాలకులు వాడే వస్తువులేమో పరదేశీవీ..
తినే తిండి మాత్రం స్వదేశీది...
విదేశాలు వెళ్ళితే కులమతాలపై హితబోధలు..
స్వదేశంలో మాత్రం కుతంత్రాల కులమతాల కాష్టాలు..
ఓ మనిషీ తెలుసుకో!!
తెలుసుకొని మసలుకో !!
రచయిత :- షేక్ రంజాన్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి