సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా?
జవాబు:
ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.
ప్రశ్న:
పిల్లల ఫీజు రీ-అంబర్సుమెంట్ ఎప్పుడైనా డ్రా చేయవచ్చా?
జవాబు:
మూడు సంవత్సరాలు లోపు బిల్ పెట్టి డ్రా చేసుకోవాలి.ఇద్దరు పిల్లలు కి చెరో 2500 ఇస్తారు.
ప్రశ్న:
నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?
జవాబు:
24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.
ప్రశ్న:
నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా?
జవాబు:
FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.
ప్రశ్న:
ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?
జవాబు:
మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి