LATEST UPDATES

19, మే 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు

This is a simple translate button.

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
అడ్మిషన్ రిజిస్టర్ లో కులం, పుట్టిన తేదీ, తల్లి తండ్రులు పేర్లు మార్చవచ్చా?

జవాబు:
తల్లి తండ్రులు కోరిక మేరకు మార్చవచ్చు. ఐతే సంబంధిత ధ్రువపత్రాలు, నోటరీ అఫిడవిట్ దగ్గర పెట్టుకోవాలి.remarks కాలంలో కారణం రాయాలి.

ప్రశ్న:
ఒక టీచర్ 7 ఇయర్స్ కూడా ఉద్యోగం చేయకుండా అనారోగ్యంతో మరణించిన, నామినీ కి పెన్షన్ ఎంత వస్తుంది?

జవాబు:
అతని చివరి బేసిక్ పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

ప్రశ్న:
ఒక పెన్షనర్ మరల వివాహం చేసుకున్నాడు.మరల ఒక కుమారుడు జన్మించారు. ఇతను కుటుంబ పెన్షన్ తీసుకొనుటకు అర్హుడేనా?

జవాబు:
జీఓ.236 ; ఆర్ధిక ; తేదీ:28.5.1994 ప్రకారం అర్హులే.

ప్రశ్న:
ఒక పెన్షనర్ రెండు పెన్షన్ లు తీసుకుంటూ ఉంటే అందులో ఒక DA ని వదులుకోవాలా?

జవాబు:
జీఓ.35 ; ఆర్థికశాఖ; తేదీ:9.8.74 ప్రకారం రెండు పెన్షన్ లు తీసుకోనువారికి ఆ రెండు పెన్షన్ లపై DA లలో ఏది ఎక్కువో ఆ DA ని ఉంచుకోవచ్చు. తక్కువ DA ని వదులుకోవలసి ఉంటుంది.

ప్రశ్న:
పోస్టులు సృష్టించు అధికారం కలెక్టర్ గారికి ఉంటుందా?

జవాబు:
జీఓ.427 ; GAD ; తేదీ:1.7.91 ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి 5 పోస్టులు సృష్టించు అధికారం ఉంటుంది.

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
నేను B.Ed లో 3rd methodology గా  maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా?

జవాబు:
మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టులు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.

ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా?

జవాబు:
జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.

ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా?

జవాబు:
జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.

ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను. ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను. ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా?

జవాబు:
అర్హత లేదు. 20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి