సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన, ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?
జవాబు:
జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.
2. ప్రశ్న:
నేను ఒక CPS ఉద్యోగిని. ఏ సందర్భంలో 50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు ?
జవాబు:
మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది. (eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.
3. ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?
జవాబు:
వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు. 1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.
4. ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థలకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?
జవాబు:
కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
5. ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా?
జవాబు:
FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.
6. ప్రశ్న:
OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా?
జవాబు:
మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.
7. ప్రశ్న:
TSGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా?
జవాబు:
జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించే వారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.
8. ప్రశ్న:
మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి?
జవాబు:
హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.
9. ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?
జవాబు:
క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.
10. ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి?
జవాబు:
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు (కోడ్--37) రాయాలి. అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.
11. ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:
FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి అనుమతితో జమ చేయవలసి ఉంటుంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి