- 10వ, వేతన సవరణ సంఘం సిఫారుసులు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 25 ఉర్థిక, తేది. 18.03.2015
- ఆర్ పి యస్-2015, రివైజ్ డ్ డి.ఎ. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 26, ఆర్థిక, తేది. 18.03.2015
- ఆర్ పి యస్-2015 రివైజ్ డ్ హెచ్ ఆర్ ఎ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 27, ఆర్థిక, తేది 18.03.2015
- ఆర్ పి యస్-2015 రివైజ్ డ్ సి సి ఎ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, ఆర్థిక, తేది 18.03.2015
- వేతన స్థిరీకరణ కొరకు ప్రొసిజరల్ ఇన్ స్ట్రక్షన్స్ మరియు ఆడిట్ ఆఫ్ క్లయిమ్స్ ప్రభుత్వ మెమో నెం. 68/1/హెచ్ఆర్ఎమ్-IV/214 ఆర్థిక తేది 04.04.2015
- మినిమమ్ పెన్షన్ మరియు కన్సాలిడేటేడ్ బేసిక్ పెన్షెన్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 33, తేది. 07.04.2014
- హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 37, ఆర్థిక తేది. 10.04.2015
- ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 38, ఆర్థిక తేది. 15.04.2015
- మోటారు కారు, మోటారు సైకిల్, మ్యారేజి, కంప్యూటర్, ఫెస్టివల్ మరియు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ప్రభుత్వ సంఖ్య 39, తేది 15.04.2015
- టిఎసుజిఎల్ఐ కంపల్సరీ ప్రీమియం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 49, తేది 27.04.2015
- రివైజ్డ్ స్పషల్ పే ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 56, ఆర్థిక శాఖ తేది 02.05.2015
- రివైజ్డ్ టి.ఎ. మరియు డి.ఎ. రేట్స్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 60, తేది02.05.2015
- రివైజ్డ్ ఎల్.టి.సి. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76, తేది 13.06.2015
- పిక్స్ డ్ టి.ఎ. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 73, తేది. 04.05.2015
- పిల్లల ట్యూషన్ ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 27, తేది 04.05.2015
- గ్రాట్యూటీ హెచ్చింపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 99, తేది 21.07.2015
- అదనపు పెన్షన్, మెడికల్ అలవెన్స్, కుటుంబ పెన్షన్ పొందడానికి ఆదాయ పరిమితులకు సంబంధించి ప్రభుత్వ సంఖ్య 100. తేది 21.07.2015
- అంగవైకల్యం కల్గిన వారి కన్వేయన్స్ హెచ్చింపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 103, తేది 24.07.2015
LATEST UPDATES
23, జనవరి 2016, శనివారం
Related Posts: PRC-2015
22, జనవరి 2016, శుక్రవారం
ఆదాయపు పన్ను గణన - ఆర్థిక సంవత్సరం (2015-16)
కేంద్ర ప్రభుత్వ ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 192ను అనుసరించి ప్రతి ఉద్యోగి తన వేతన, ఆదాయాలను బట్టి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం 12 నెలల వేతనము, ఇతర ఆదాయాల మొత్తంపై పన్నును మదింపు చేయాలి.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం 2015 ప్రకారం ఆదాయపు పన్ను శ్లాబ్ లలో ఎలాంటి మార్పులేదు. కాని నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగినది.
2. డిఎ(DA)
3. హెచ్.ఆర్. ఎ. (HRA)
4. CCA
5. IR
6. అడిషనల్ & యఫ్.డి. ఇంక్రిమెంట్లు
7. వేతన బకాయిలు
8. సరెండర్ సెలవు
9. బోనస్
10. సెలవు వేతనము
11. ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్
12. పెన్షన్
13. సబ్ సిస్టెన్స్ అలవెన్స్
14. మెడికల్ అలవెన్స్ మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.
2. L.T.C.
3. మెడికల్ రీఎంబర్స్ మెంట్
4. టూర్/ట్రాన్స్ ఫర్ T.A. & D.A.
5. ఎడ్యుకేషన్ అలవెన్స్
6. కన్వేయన్స్ అలవెన్స్
బి) వాస్తవంగా చెల్లించిన ఇంటి అద్దె - 10% వేతనము (Pay + DA)
సి) 40% వేతనము (పట్టణాలు, గ్రామాలు), 50% వేతనము (మెట్రోనగరాలు)
పై మూడింటిలో ఏది తక్కువగా ఉంటే అది మినహాయించబడుతుంది.
నోట్:-
1. ఇంటి అద్దె అలవెన్స్ నెలకు రూ. 3,000 కన్నా ఎక్కువ పొందుతున్న వారు దానికి మినహాయింపు పొందాలంటే విధిగా ‘‘ఇంటి అద్దె రసీదు’’ డిడిఓ కు సమర్పించాలి.
2. స్వంత ఇంటిలో నివసించు వారికి హెచ్. ఆర్. ఎ. వర్తించదు.
1. వృత్తి పన్ను సెక్షన్ 16(iii): ఉద్యోగి సంవత్సరంలో చెల్లించిన పన్ను ఆదాయం నుండి పూర్తిగా మినహాయించబడును.
2. స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితి గరిష్టంగా 2013-14 సం.కి ముందు తీసుకున్నవారికి రూ. 1,50,000ల వరకు, 2013-14 తర్వాత లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 వరకు మినహాయిస్తారు.
i) LIC
ii) GPF/PF
iii) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
iv) PLI
v) GIS
vi) CPS
vii) APGLI
viii)PPF
ix) SBI Life
x) ఇంటి రుణాలపై చెల్లించు అసలు
xi) ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు
xii) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్స్
xiii) పోస్టాఫీస్ లేదా ఏదైనా షెడ్యూల్ బ్యాంక్ లో 5 సం.లకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు
నోట్:- 80సి, 80సిసిసి, 80సిసిడిల క్రింద తగ్గింపులు మొత్తం రూ. 1,50,000ల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
VI. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 25,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 30,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
3) ఉద్యోగి, భార్య/భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్అప్ నిమిత్తం రూ. 5000 వరకు పైన పేర్కొన్న గరిష్ఠ పరిమితికి లోబడి పన్ను నుండి మినహాయింపబడుతుంది.
ii) ప్రధానమంత్రి కరవు సహాయనిధి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారకనిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, దేవాలయం, మసీదు, చర్చీల వంటి మత సంస్థలకు ఇచ్చిన విరాళములలో 50% తగ్గించబడును.
నోట్:- 80డి, 80డిడి, 80డిడిబి సెక్షన్ ల క్రింద జమచూపే మినహాయింపులను డ్రాయింగ్ అధికారులు అనుమతించగూడదు. ఇవి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ యొక్క అసెసింగ్ అధికారులు ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ను జూలైలో సమర్పించేటప్పుడు మాత్రమే అనుమతించి అధికముగా చెల్లించిన మొత్తమును రీఫండ్ చేస్తారు. 80 జి సెక్షన్ క్రింద పిఎమ్ రిలీఫ్, సిఎమ్ రిలీఫ్ ఫండ్ వంటి చందాలు తప్ప ఏ ఇతర చందాలను డిడిఓ అనుమతించరాదు.
ఉద్యోగి మొత్తం ఆదాయం నుండి హెచ్ ఆర్ ఎ మరియు పైన పేర్కొనబడిన మినహాయింపులు/తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పై క్రింది రేట్ల ప్రకారం పన్ను లెక్కించబడును.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం 2015 ప్రకారం ఆదాయపు పన్ను శ్లాబ్ లలో ఎలాంటి మార్పులేదు. కాని నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగినది.
I. ఆదాయంగా పరిగణింపబడే అంశాలు:
1. పే(pay)2. డిఎ(DA)
3. హెచ్.ఆర్. ఎ. (HRA)
4. CCA
5. IR
6. అడిషనల్ & యఫ్.డి. ఇంక్రిమెంట్లు
7. వేతన బకాయిలు
8. సరెండర్ సెలవు
9. బోనస్
10. సెలవు వేతనము
11. ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్
12. పెన్షన్
13. సబ్ సిస్టెన్స్ అలవెన్స్
14. మెడికల్ అలవెన్స్ మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.
II. ఆదాయంగా పరిగణింపబడని అంశాలు:
1. పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యూటి, కమ్యూటేషన్, GIS, GPF, APGLI, లీవ్ ఎన్ క్యాష్ మెంట్.2. L.T.C.
3. మెడికల్ రీఎంబర్స్ మెంట్
4. టూర్/ట్రాన్స్ ఫర్ T.A. & D.A.
5. ఎడ్యుకేషన్ అలవెన్స్
6. కన్వేయన్స్ అలవెన్స్
III. HRA మినహాయింపు (సెక్షన్ 10):
ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్స్బి) వాస్తవంగా చెల్లించిన ఇంటి అద్దె - 10% వేతనము (Pay + DA)
సి) 40% వేతనము (పట్టణాలు, గ్రామాలు), 50% వేతనము (మెట్రోనగరాలు)
పై మూడింటిలో ఏది తక్కువగా ఉంటే అది మినహాయించబడుతుంది.
నోట్:-
1. ఇంటి అద్దె అలవెన్స్ నెలకు రూ. 3,000 కన్నా ఎక్కువ పొందుతున్న వారు దానికి మినహాయింపు పొందాలంటే విధిగా ‘‘ఇంటి అద్దె రసీదు’’ డిడిఓ కు సమర్పించాలి.
2. స్వంత ఇంటిలో నివసించు వారికి హెచ్. ఆర్. ఎ. వర్తించదు.
IV. తగ్గింపులు(Deductions):
ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్ ఆర్ఎ మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.1. వృత్తి పన్ను సెక్షన్ 16(iii): ఉద్యోగి సంవత్సరంలో చెల్లించిన పన్ను ఆదాయం నుండి పూర్తిగా మినహాయించబడును.
2. స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితి గరిష్టంగా 2013-14 సం.కి ముందు తీసుకున్నవారికి రూ. 1,50,000ల వరకు, 2013-14 తర్వాత లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 వరకు మినహాయిస్తారు.
V. చాప్టర్ VI - A క్రింద తగ్గింపులు:
సెక్షన్ 80 సి ప్రకారం ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.i) LIC
ii) GPF/PF
iii) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
iv) PLI
v) GIS
vi) CPS
vii) APGLI
viii)PPF
ix) SBI Life
x) ఇంటి రుణాలపై చెల్లించు అసలు
xi) ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు
xii) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్స్
xiii) పోస్టాఫీస్ లేదా ఏదైనా షెడ్యూల్ బ్యాంక్ లో 5 సం.లకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు
నోట్:- 80సి, 80సిసిసి, 80సిసిడిల క్రింద తగ్గింపులు మొత్తం రూ. 1,50,000ల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
VI. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 25,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 30,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
3) ఉద్యోగి, భార్య/భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్అప్ నిమిత్తం రూ. 5000 వరకు పైన పేర్కొన్న గరిష్ఠ పరిమితికి లోబడి పన్ను నుండి మినహాయింపబడుతుంది.
VIII) వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్ 80డిడి):
మానసిక, శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ మరియు నిర్వహణకై చేసిన ఖర్చులు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ. 75,000 గరిష్ఠ పరిమితితో 2) 80% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ. 1,25,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపబడుతాయి.VIII) వైద్య చికిత్సకై ఖర్చులు (సెషన్ 80 డిడిబి):
ఉద్యోగి స్వంత విషయంలో గాని, ఆధారపడిన కుటుంబీకులకుగాని కేన్సర్, Talassemia, Haemophilla, Nuerological diseases, Aids మరియు Chronic Renal Failure వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుచున్నవారు, వారిపై ఆధారపడిన భార్య/భర్త, పిల్లలు, తల్లి/తండ్రి వైద్యఖర్చుల నిమిత్తం రూ. 40,000/-, 60 సం.లు పైబడితే రూ. 60,000 వరకు, 80 సం.లు పై బడితే రూ 80,000 వరకు మినహాయింపు కలదు.IX) విరాళములు (80 జి):
i) ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి, ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయబాలలనిధి, యూనివర్సటీలు, అర్హత ఉన్న విద్యాసంస్థలకు ఇచ్చిన విరాళాలు మొత్తం ఆదాయం నుండి 100% తగ్గించబడును.ii) ప్రధానమంత్రి కరవు సహాయనిధి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారకనిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, దేవాలయం, మసీదు, చర్చీల వంటి మత సంస్థలకు ఇచ్చిన విరాళములలో 50% తగ్గించబడును.
నోట్:- 80డి, 80డిడి, 80డిడిబి సెక్షన్ ల క్రింద జమచూపే మినహాయింపులను డ్రాయింగ్ అధికారులు అనుమతించగూడదు. ఇవి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ యొక్క అసెసింగ్ అధికారులు ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ను జూలైలో సమర్పించేటప్పుడు మాత్రమే అనుమతించి అధికముగా చెల్లించిన మొత్తమును రీఫండ్ చేస్తారు. 80 జి సెక్షన్ క్రింద పిఎమ్ రిలీఫ్, సిఎమ్ రిలీఫ్ ఫండ్ వంటి చందాలు తప్ప ఏ ఇతర చందాలను డిడిఓ అనుమతించరాదు.
X) ఎడ్యుకేషన్ లోను (సెక్షన్ 80 ఇ):
ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువుల కోసం ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని 8 ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు పూర్తిగా తగ్గించబడును.XI) వికలాంగుడైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80 యు):
వైద్యాధికారి ధ్రువ పత్రం ఆధారంగా 40% కంటె ఎక్కువ వైకల్యం గల వారికి రూ. 75,000 వరకు, 80% కంటె ఎక్కువ వైకల్యం ఉన్న గరిష్ఠంగా 1,25,000 వరకు మినహాయింపు కలదు.ఉద్యోగి మొత్తం ఆదాయం నుండి హెచ్ ఆర్ ఎ మరియు పైన పేర్కొనబడిన మినహాయింపులు/తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పై క్రింది రేట్ల ప్రకారం పన్ను లెక్కించబడును.
| క్ర.సం. | ఆదాయం | 80 సం.పై బడిన వెరీ సీనియర్ సిటిజన్ | 60 సం.పై బడిన వెరీ సీనియర్ సిటిజన్ | ఇతరులు |
|---|---|---|---|---|
| 1 | 2,50,000 వరకు | -Nil- | -Nil- | -Nil- |
| 2 | 2,50,001 - 3,00,000 | -Nil- | -Nil- | 10% |
| 3 | 3,00,001 - 5,00,000 | -Nil- | 10% | 10% |
| 4 | 5,00,001 - 10,00,000 | 20% | 20% | 20% |
| 5 | 10,00,001 పైబడిన ఆదాయం | 30% | 30% | 30% |
- 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రూ. 2,000లు గరిష్ఠ పరిమితితో పన్నులో రిబేటు ఇస్తారు.
- ఒక కోటి రూపాయల కంటె ఎక్కువ ఆదాయం గల వారికి ఆదాయపు పన్నుపై అదనంగా 12% సర్ చార్జి విధించబడును.
- ఆదాయపన్నుపై 3% విద్యాసెస్సు విధించబడును.
- స్వచ్ఛభారత్ కోశ్ లేదా గంగా ప్రక్షాళన్ నిధులకు ఇచ్చే విరాళాలను ఆదాయపు పన్ను నుండి ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడమైనది. (సెక్షన్ 10 (23) సి)
- సెక్షన్ 80-సి క్రింద కొత్తగా ఈ సంవత్సరం నుండి సుకన్య సంవృద్ధి పథకంలో రూ. 1,50,000 గరిష్ఠ పరిమితికి లోబడి పొదుపు చేసుకునే అవకాశం కల్పించబడినది.
- సెక్షన్ 80 సిసిడి (1బి) ప్రకారం కొత్తగా జాతీయ పెన్షన్ పథకంకు వేతనాలలో అదనంగా రూ. 50,000/-ల వరకు మినహాయింపు ఇవ్వనైనది.
---------అధ్యాపక జ్వాల
Related Posts: Income Tax
26, సెప్టెంబర్ 2015, శనివారం
Important Formulae in Mathematics
Message from whatsapp
" It is for d first time, one of best uses, of 'WhatsApp' in its history, to circulate some important formulae in Mathematics"..!!
(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα
1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α
» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α
» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
Important
These r all d formulae of Maths for classes
9th,10th,11th,12th
These r all d formulae of Maths for classes
9th,10th,11th,12th
Kindly share d same with all parents n students, teachers as much as u can do...
Related Posts: Maths
4, ఏప్రిల్ 2015, శనివారం
How to Create a New Blog @ Blogger.com
How to Create a New Blog like www.naabadi.org, www.teachersbadi.in, www.apteachers.in
మొదట మనం http://blogger.com ని open చేయాలి. చిత్రం-1 లో చూపిన విధంగా Sign In window వస్తుంది. అందులో మీకు ఇదివరకు ఉన్న జీమెయిల్ ఐడి, పాస్ వర్డ్ ఇచ్చి Sign In పై క్లక్ చేయాలి.
మొదట మనం http://blogger.com ని open చేయాలి. చిత్రం-1 లో చూపిన విధంగా Sign In window వస్తుంది. అందులో మీకు ఇదివరకు ఉన్న జీమెయిల్ ఐడి, పాస్ వర్డ్ ఇచ్చి Sign In పై క్లక్ చేయాలి.
చిత్రం-2 లో చూపిన విధంగా పేజీ వస్తుంది. అందులో New Blog బటన్ పై క్లిక్ చేయాలి. అపుడు మరియొక పేజీ వస్తుంది.
చిత్రం-3 లో చూపిన విధంగా పేజీ వస్తుంది. అందులో title ఇవ్వాలి.
తరువాత వెబ్ address ముఖ్యమైనది. మనం ఇచ్చే address ని వెంటనే check చేస్తుంది. ఇదివరకే వాడుకున్నారా లేదా చెబుతుంది. available ఉన్నట్లైతే blog address చూపుతుంది.
ఉదాహరణకు naabadipcnu అని ఇచ్చాననుకోండి. అపుడు blog address http://naabadipcnu.blogspot.com అవుతుంది.
తరువాత template ని select చేయాలి. template ని తరువాత కూడా మార్చకొనే అవకాశం ఉంది.
Create Blogపై క్లిక్ చేయాలి.
కొంత సమయం తరువాత బ్లాగ్ Create అయినట్లు conformation Message వస్తుంది.
Related Posts: Website
How to Create Google site with Gmail ID in simple steps
How to create Google site - step by step description
మనం ఇదివరకు బ్లాగర్ బ్లాగ్ ఎలా create చేయాలో నేర్చుకున్నాము. కాని బ్లాగర్ లో PDF, excel, docs లాంటి files upload చేయడం కుదరదు. కావున మనకు ఈ Googles site , files upload చేయడానికి ఉపయోగపడుతుంది.
మనం ఇదివరకు బ్లాగర్ బ్లాగ్ ఎలా create చేయాలో నేర్చుకున్నాము. కాని బ్లాగర్ లో PDF, excel, docs లాంటి files upload చేయడం కుదరదు. కావున మనకు ఈ Googles site , files upload చేయడానికి ఉపయోగపడుతుంది.
నేను mobile నుండి Googlesite https://sites.google.com/site/pogusnuthika/ or www.snuthika.tk
లోకి upload చేసాను చూడండి. దీని సైజ్ 100MB ఉంటుంది. మరికొన్ని కూడా అదే
అకౌంట్లో Google sites అవసరాన్ని బట్టి create చేసుకొనవచ్చును.
అసలు విషయానికి వస్తే మొదట https://sites.google.com పేజీ open చేయాలి. చిత్తం-1 లో మాదిరి sign in screen వస్తుంది. అందులో Gmail Id , password ఇచ్చి Sign In పై Click చేయాలి.
తరువాత చిత్రం-2 లో మాదిరి పేజీ వస్తుంది. అందులో CREATE బటన్ పై click చేయాలి.
తరువాత మరియొక పేజీ వస్తుంది. అందులో చిత్తం-3.1 చూపినట్లు మనకు కావలసిన templete ను ఎన్నుకోవాలి. Preview కూడా చూడవచ్చు.
తరువాత ముఖ్యమైనది వెబ్ నేమ్ ఇవ్వాలి ఉదాహరణకు naabadipcnu అని ఇచ్చాననుకోండి అపుడు వెబ్ అడ్రస్ https://sites.google.com/site/naabadicnu/ అవుతుంది. కింది బాక్స్ లో కనిపిస్తుంది.
చిత్రం-3.2 లో మాదిరి theme select చేసుకోవాలి. ఆ తరువాత site description ఇవ్వాలి. ఆ తరువాత అక్కడ కనిపించే కోడ్ ను బాక్స్ లో ఎంటర్ చేయాలి.
చివరగా top పైన CREATE బటన్ click చేయాలి. Google site create అవుతుంది.
ధన్యవాదములు.........
Related Posts: Website
How to Create twitter widget to show our tweets on website
Download HTML file for more twitter username in one page CLICK HERE
Note :- If you want to see the script, open this file in the Notepad
Related Posts: Twitter
How to Unprotect MS-Excel workbook/sheets with OpenOffice 3.4.1 Software
ముందుగా http://www.openoffice.org/download/index.html పేజీ నుండి Apache Openoffice 3.4.1 software download చేసి install చేసుకోవాలి.
కావలసిన
EXCEL ఫైల్ మీద Right Click చేసి Open with option ద్వారా
OpenOffice.Calcలో ప్రోగ్రామ్ ను Open చేయాలి. దానికి సంబంధించిన చిత్రం
కిందినివ్వబడినది.
ప్రతి
Sheet open చేసి Menu లో Tools select చేసి, Protect Document click
చేస్తే, Sheet , Document options ని uncheck చేయాలి. (టిక్ తీసివేయాలి).
ప్రతి Sheet ని open చేసి uncheck చేయాలి. దానికి సంబంధించిన చిత్రం..
తరువాత
file ను save చేయడానికి ట్రైస్తే, పటంలో చూపిన విధంగా window వస్తుంది.
అందులో keep current format పై click చేసి save చేయాలి. ఇపుడ MS-EXCEL లో
open చేయాలి. ఇపుడు Edit చేయవచ్చు. కానిచో excel, close చేసి Openoffice
calc లో open చేసి edit చేయవచ్చు. చిత్రం - 3
Related Posts: Excel
Telugu Guninthalatho Game
Related Posts: Game
How to download Youtube videos without any software in PC
Youtube
dowonloader || Free downloader for Youtube videos || Extension in
Firefox browser for dowload Youtube download || Youtube download without
any software
only for Firefox Browser (తెలుగులో)
మొదట Firfox browser ని open చేయాలి.
STEP 1 : Top left లో orange colour లో Firfox అనే button ని click చేయాలి. ఒక menu open అవుతుంది.
STEP 2 : ఆ menu లో Add-ons పై click చేయాలి.
only for Firefox Browser (తెలుగులో)
మొదట Firfox browser ని open చేయాలి.
STEP 1 : Top left లో orange colour లో Firfox అనే button ని click చేయాలి. ఒక menu open అవుతుంది.
STEP 2 : ఆ menu లో Add-ons పై click చేయాలి.
Related Posts: YouTube
New DA Calculation for CPS Employees
Method
- First, We enter New DA
- Second, We enter Old DA
- Next, We enter No of months
- Then, Click on Calculation Button
- If we wish to Print, Click on Print Button
Related Posts: CPS,DA
DA DIFFERENCE CALCULATOR FOR ALL BASICS for GPF Employees
It's for only GPF Employees. How to calculate new DA from this table ? Process
- First enter New DA in New DA % column.
- After that enter Old DA in Old DA % column.
- Next row, Enter No of months credited into GPF, Enter the Number of months.
- Enter No of months credited Net Amount into our Bank A/c
- Finanlly click on Calculation button.
- If you want print out the result, click on print button.
Related Posts: DA,GPF
Ham Honge Kamyaab (हम होंगे कामयाब) 8th Class Hindi
होंगे कामयाब, होंगे कामयाब
हम होंगे कामयाब, एक दिन
हो, हो! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन ||
होगी शांति चारों ओर, होगी शांति चारों ओर,
होगी शांति चारों ओर एक दिन||
हो! हो! मन में है विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन||
हम चलेंगे साथ-साथ, डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
हम चलेंगे साथ-साथ एक दिन||
नहीं डर किसी का आज, नहीं डर किसी का आज,
नहीं डर किसी का आज, एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
नहीं डर किसी का आज, एक दिन||
हम होंगे कामयाब, एक दिन
हो, हो! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन ||
होगी शांति चारों ओर, होगी शांति चारों ओर,
होगी शांति चारों ओर एक दिन||
हो! हो! मन में है विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन||
हम चलेंगे साथ-साथ, डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
हम चलेंगे साथ-साथ एक दिन||
नहीं डर किसी का आज, नहीं डर किसी का आज,
नहीं डर किसी का आज, एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
नहीं डर किसी का आज, एक दिन||
Related Posts: 8th Class,Hindi,Text Book
10th Class TELUGU Paper-II - March 2015 - Telangana
New Syllabus(2014-15)
02T
TELUGU, Paper - II
(First Language)
Time: 2.45 hours] [Maximum Marks : 40
-----------------------------------------------------------------------------------
సూచనలు:
- మొదటి 15ని.లు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2 గం. 30 ని.ల సమయంలో జవాబులు రాయండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రంలోనే రాయండి.
(అ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 5x1=5
జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేయుంది? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో ‘‘నేను మహాసముద్రాలను అవలీలగా దాటగనని’’ ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు?
2. ప్రేరణ వలన ఏమి బయట పడుతుంది?
3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు?
4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి?
5. పై పేరాకు తగిన శీర్షక సూచించండి.
(ఆ) కింది పేరా చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి. 5x1=5
గోదావరి
నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీనంగర్ జిల్లాల్లోని గిరిజనులు వారి
ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. ‘‘చిన్నయ్య
పెద్దయ్య చిలుకల భీమయ్య’’ అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య
అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని
పూజిస్తారు, అని స్పష్టమవుతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలువడానికి
కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన
అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య
దైవమయ్యాడు.
ప్రశ్నలు:
6.
7.
8.
9.
10
(ఇ) కింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం సొంత మాటల్లో రాయండి. 1x5=5
11. బీదల కన్నవస్త్రములు ..........................
......................వివేక ధనంబిది నమ్ము చిత్తమా!
(ఈ) కింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. 5x1=5
తల నుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !
12. పాముకు విషం ........................ లో ఉంటుంది.
13. వృశ్చికమనగా ..........................
14. శరీరమంత విషం ......................... కి ఉంటుంది.
15. పై పద్య మకుటం .......................
16. పై పద్యాన్ని రచించిన కవి ...................
II. సృజనాత్మకత - వ్యక్తీకరణ: సృజనాత్మకత (10 మార్కులు)
(అ) కింది వానిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి. 2x5=10
17. ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పతనాన్ని గూర్చి వ్యాసం రాయండి.
18. ‘‘మాణిక్య వీణ’’ వచన కవితలో మీకు నచ్చిన అంశాలను వివరిస్తూ మిత్రునికి/మిత్రురాలికి లేఖ రాయండి.
19. చరిత్ర నిర్మాణంలో స్త్రీల పాత్రను వివిరిస్తూ కరపత్రం తయారు చేయండి.
III. భాషాంశాలు (వ్యాకరణం) (10 మార్కులు)
20. ‘మృదుమధురం’ పదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. (1మార్కు)
21. ‘విద్య చేత అధికుడు’ విగ్రహ వాక్యాన్ని సమాస పదంగా మార్చి సమాసం పేరు రాయండి. (1మార్కు)
22. ‘ముత్యపు చిప్ప’ పదాన్ని విడదీసి, సంధిపేరు రాయండి. (1మార్కు)
23. ‘సరభస+ఉత్సాహం’ కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి. (1మార్కు)
24. ‘యూయూస్సూత్రము తోవ త్రుంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ’
పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి. (2మార్కులు)
25.
‘‘తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలి వచ్చిన పేద రైతులూ
ఇనప్పెట్టెలాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులు’’
పై కవితలోని అర్థాలంకారాన్ని గుర్తించండి. (1మార్కు)
26. అర్థంతరన్యాసాలంకార లక్షణాల్ని తెల్పండి. (1మార్కు)
27. గోపి హైదరాబాద్ వెళ్ళాడు.
సీ హైద్రాబాద్ వెళ్ళింది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చి రాయండి. (1మార్కు)
28. ‘‘ధన లోభము సర్వాపదలకు మూలము’’ ఈ వాక్యాన్ని ఆధునికి వ్యవహార భాషలోకి మార్చి రాయండి. (1మార్కు)
----------End--------
Related Posts: Question Paper,SSC,Telugu
10th Class TELUGU Paper-1 - March-2015 - Telangnan
01T
Telugu, Paper-I
(First Language)
Time : 20:45 hoours] [Maximum Marks: 40
---------------------------------------------------------------------------------
సూచనలు:- మెదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2.30 గం.ల సమయంలో జవాబులు రాయండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రంలోనే రాయండి.
(అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. 4x3=12
1. ప్రకృతి ఒడిని పాఠశాలగా మార్చుకొన్న మీరు మీ కళాభిరుచిని ఎలా పెంపొందించుకుంటారు?
2. ‘‘బాలికల చదువు - తరతరాలకు వెలుగు’’ అన్న నానుడిపై మీ అభిప్రాయం తెల్పండి.
3. ‘పి.వి. నరసింహారావు గారు - గొప్ప సాహితీవేత్త’ అని ఎట్లా చెప్పగలరు?
4. ‘‘ఆకలి దప్పికలు కోపానికి కారణాలు’’ అని ఎట్లా సమర్థిస్తావు?
(ఆ) కింది వాటిలో ప్రతి భాగం నుండి తప్పని సరిగా ఒక ప్రశ్నకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. 3x6=18
5. ‘‘వీధి బాలలు, అనాథ పిల్లలు’’ - లేకుండా ఉండాలంటే మీరేం చేస్తారు? వివరించండి.
(లేదా)
5. ‘‘మంచి వాళ్ళ స్నేహం కంటే లోకంలో గొప్పది ఏదీ లేదు’’ - దీనిని విశ్లేషిస్తూ అభిప్రాయాలను రాయండి.
6. ‘నగరంలోని మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు ఉంటాయి’ - అనే కవి మాటల్లోని అంతరార్థాన్ని వివరించండి.
(లేదా)
6. శివాజీ, సోన్ దేవుని మధ్య జరిగిన సంభాషణ ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు’’ సమర్థించండి.
7. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
(లేదా)
7. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధం తెలపండి.
II. భాషాంశాలు (పదజాలం) (10మార్కులు)
(అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి. 2x1=2
8. శ్రద్ధాసక్తులు
9. ప్రయాణ సౌకర్యం
(ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి. 4x(1/2)=2
10. సీత, గీతలు జాతరలో సూడిగములు కొన్నారు.
(A) బొమ్మలు
(B) గజ్జెలు
(C) బట్టలు
(D) గాజులు
11. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలే ఉద్యమం చేశారు.
(A) పోరాటం
(B) ప్రయత్నం
(C) ఊరేగింపు
(D) దీక్ష
12. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏమరుపాటుగా ఉండరాదు.
(A) సంతృప్తిగా
(B) అసంతృప్తిగా
(C) అజాగ్రత్తగా
(D) అహంకారంగా
13. మబ్బులు ఇనుణ్ణి కప్పేసాయి.
(A) మెరుపులను
(B) చుక్కలను
(C) చంద్రుణ్ణి
(D) సూర్యుణ్ణి
(ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి 4x(1/2)=2
14. గాంధీజీ నూలు వస్త్రం ధరించేవాడు.
(A) పుట్టము - పులుగు
(B) పుట్టము - పట్టము
(C) పుట్టము - చేలము
(D) పుట్టము - విలువ
15. కప్ప భూమిపైన, నీటిలోన నివాసం ఉంటుంది.
(A) దర్దరం - దుర్దినం
(B) దర్దురం - మండూకం
(C) దర్దురం - మహతి
(D) దర్దురం - దర్భలు
16. అనలం అరణ్యాన్ని దహించి వేసింది.
(A) అగ్ని - వేడి
(B) అగ్ని - అడవి
(C) అగ్ని - కాన
(D) అగ్ని - మంట
17. మిన్ను విరిగి మీద పడ్డట్లు.
(A) ఆకాశం - చంద్రుడు
(B) ఆకాశం - మబ్బు
(C) ఆకాశం - గగనం
(D) ఆకాశం - సూర్యుడు
(ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు-వికృతులు, వికృతులకు-ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.
4x(1/2)=2
18. ధర్మం నాలుగు పాదాల నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.
(A) దయ
(B) దమ్మం
(C) దానం
(D) దాక్షిణ్యం
19. అయ్యా ! మాకు సెలవులు ఇప్పించండి.
(A) తండ్రీ
(B) నాన్నా
(C) తాతా
(D) ఆర్యా
20. కుల మతాలకు మనుషుల మధ్య కుడ్యం కాకూడదు.
(A) గోడ
(B) ఇల్లు
(C) భవనం
(D) తలుపు
21. పులిని చూసే నేను చిత్తరువు వేశాను.
(A) చిత్రం
(B) బొమ్మ
(C) పటం
(D) సినిమా
(ఉ) కింది వాక్యాల్లో గీత గీసి పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి. 2x(1/2)=1
22. కాలంతో పాటే మనమూ మారాలి.
(A) సమయం - సందర్భం
(B) సమయం - చావు
(C) సమయం - సహకారం
(D) సమయం - చలనం
23. ఆకాశం ఘోష పెడుతుంది.
(A) ఉరుము - నక్షత్రం
(B) ఉరుము - మెరుపు
(C) ఉరుము - మేఘం
(D) ఉరుము - ఆవుల మంద
(ఊ) కింది వ్యుత్పత్త్యర్థాలకు సరియైన పదాన్ని గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.
24. వనము నందు పుట్టినది.
(A) చేప
(B) కప్ప
(C) వనజం
(D) తాబేలు
25. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు.
(A) నారదుడు
(B) బ్రహ్మ
(C) విష్ణు
(D) ఈశ్వరుడు
-----------End-------------
Related Posts: Question Paper,SSC,Telugu
Dharithappina Balu (దారితప్పిన ‘బాలు’) 3rd Class Telugu
ఒక అడవిలో ‘బాలు’ అనే ఎలుగుబంటి పిల్ల ఉండేది. అది ఒక రోజున దాని
స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడడం
మొదలుపెట్టింది. బాలు ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని వాళ్ళ దగ్గరనుంచి చాలా
దూరం వచ్చేసింది. తన స్నేహితులు ఎంతసేపటికి రాకపోయేసరికి బండ వెనక దాగిఉన్న
బాలు ఇవతలికి వచ్చింది. స్నేహితులను పిలిచింది. ఎవరూ పలకలేదు. అలా
స్నేహితులను వెదుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది.
రోడ్డుమీద కార్లు, మోటరు సైకిళ్ళు, బస్సులు రయ్ ....... రయ్ మని
పోతున్నాయి. రోడ్డుపైన ఆగి ఉన్న బస్సు ఒకటి బాలుకు కనిపించింది. బాలు
ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. దానికి ఆశ్చర్యంగా ఉంది. బాలు మెల్లగా బస్సు
దగ్గరకు వచ్చింది. బస్సును అంత దగ్గరగా ఎప్పుడూ చూడని బాలుకు అంతా వింతగా
అనిపించింది. బస్సులోకి చూద్దామని బస్సు కిటికీ ఊచలు పట్టుకొని లోపలికి
తొంగిచూసింది. లోపల చాలా మంది మనుషులు కూర్చుని ఉన్నారు. పిల్లలున్నారు.
పెద్దవాళ్ళున్నారు. బస్సుముందరినుంచి డుర్..... డుర్..... అని శబ్దం
వస్తోంది. అక్కడ చక్రం ముందు ఒకతను కూర్చొని కనిపించాడు. అతని ముందున్న
అద్దంలోనుంచి ముందు రోడ్డంతా పొడవుగా కనిపిస్తోంది. అతను తల తిప్పి బాలును
చూశాడు. అంతే -- ఒక్క ఉదుటున బస్సులోనుంచి బయటకు దూకాడు.
బాలు బస్సులోపలికి వెళ్ళంది. బస్సులోని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ
బస్సు వెనక సీట్లలోకి పారిపోయారు. పెద్దవాళ్ళు భయంతో అరవడం మొదలెట్టారు.
చిన్నపిల్లలు ఈ చిన్ని బాలువైపు ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. బాలుకు
వీళ్ళంతా తనను చూసి అలా ఎందుకు భయపడుతున్నారో అర్థంకాలేదు. వీళ్ళ అరుపులకు
బాలుకు కూడా భయంవేసింది. బాలు మెల్లగా బస్సు దిగి దానికింది దాక్కుంది.
బస్సుకిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. పొగవాసన వేసింది.
బాలు అక్కడ ఉండలేక పోయింది. ఇంతలో బస్సులోవాళ్ళంతా బస్సు దిగి దూరంగా
పోయారు. కొందరు దూరంనుంచే బస్సుకిందకు వంగి చూస్తున్నారు. బాలు మళ్ళీ బస్సు
ఎక్కింది. బస్సులో చక్రం ఉన్నచోటికి వెళ్ళి కూర్చుంది. అక్కడనుంచి దానికి
ముందు రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. చక్రంమీద చేతులు వేసి అటూ
ఇటూ కదిపింది. అలా చేయడం బాలుకు చాలా సరదగా అనిపించింది. ఇంతలో ఎదురుగా ఒక
బస్సు రావడం చూసింది. అందులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. బాలు వెనక్కి
తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనకంతా ఖాళీగా కనిపించింది.
‘‘అరే! ఆ బస్సులో అంతమంది ఉంటే తన బస్సులో వాళ్ళంతా ఎందుకు కిందికి దిగి
వెళ్ళిపోయారబ్బా!’’ అని ఆలోచిస్తూ కూర్చుంది.
ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్ లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా
పోతున్న వాహనాలన్నీ అగిపోయాయి. వాహనాల్లో వాళ్ళంతా ఈ బస్సుకేసి
చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి అలిసిపోయిందేమో నిద్ర
ముంచుకొచ్చేసింది. నిద్ర ఆపుకోలేక బాలు ఆ చక్రం మీదే అలాగే నిద్రపోయింది.
తరవాత ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్పండి.
Related Posts: 3rd Class,Telugu,Text Book
Baala Bheemudu (బాల భీముడు) 3rd Class Telugu
ఒకనాడు కుంతీదేవి తన కొడుకును భుజంమీదికి ఎత్తుకొని పూలతోటలోకి వెళ్ళింది.
నడుస్తూ ఉంటే కాలి కొక రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతుల పట్టు
తప్పింది. పిల్లవాడు కింద పడ్డాడు. ‘‘అయ్యో!’’ అని కుంతీదేవి బిగ్గరగా
అరిచింది. రాజమందిరంలోని వాళ్ళందరూ పరుగెత్తుతూ వచ్చారు. ‘‘అయ్యో ... నా
చిట్టితండ్రి కేమయిందో!’’ అంటూ కుంతీదేవి కంగారుపడుతూంది. బాలుణ్ణి
కుంతీదేవి దుఃఖంతో ఆత్రుతగా ఎత్తుకుంది. కుంతీదేవి చేతుల్లోనుంచి మరోసారి
జారి ఆ బాలుడు అక్కడే ఉన్న పెద్ద బండపైన పడ్డాడు. ఆశ్చర్యం! ఆ బాలుడికి
ఏమి కాలేదు. బాలుడు పడ్డ బండ మాత్రం పగిలి ముక్కలైంది. బాలుడు మాత్రం
హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి కుంతీదేవి ఆ
బాలుణ్ణి ఎంతో మురిపెంతో ముద్ధాడింది. ఆబాలుడే మన బాలభీముడు.
‘‘బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా!’’ అంటూ
చుట్టుపక్కలవాళ్ళు ముక్కున వేలు వేసుకున్నారు. పెద్దవాడైతే కొండల్నే
పిండిచేసే ఘనుడౌతాడని పొగిడారు. తండ్రి పాండారాజుకు ఈ విషయం తెలిసింది.
బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు.
పాండురాజుకు గల ఐదుగురు కుమారులలో భీముడు రెండోవాడు. భీముని అన్న
ధర్మరాజు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు భీముని తమ్ముళ్ళు. ఈ ఐదుగురినీ
పంచపాండవులంటారు. పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి
రాజు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు. వీరినే కౌరవులు అంటారు. కౌరవులలో
పెద్దవాడు దుర్యోధనుడు.
బాల్యంలో కౌరవులు, పాండవులు కలిసి చదువుకునేవారు. ఆడుకునేవారు. భీముడు
ఆటల్లో కౌరవులందరినీ ఓడించేవాడు. ఆటల్లో బాగా అలిసిపోయి ఆకలి ఆకలి అంటూ
మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. ఇంట్లో ఉన్న పదార్థాలను భీముడు కడుపునిండా
తినేవాడు. మళ్ళీ చదువుకు, ఆటలకు పోయేవాడు.
ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు కోసుకుంటున్నారు. అదే చెట్టు
ఎక్కుతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీముడికి కోపం వచ్చింది.
చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టుమీద ఉన్న కౌరవబాలలు పండ్లలాగా
కిందరాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద
తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. భీముడు వారందరినీ చితకబాదాడు. రోషంతో
కౌరవులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భీముడిపైన ద్వేషం పెంచుకున్నారు.
ఎలాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు
భీమునిమీద చాలా కోపం పెంచుకున్నాడు.
ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడం దుర్యోధనుడు చూశాడు. దురాలోచనతో అతనికి
విషాహారం తినిపించాడు. భీముడు స్పృహ కోల్పోయాడు. కౌరవులు అందరూ తాళ్ళతో
భీముణ్ణి బంధించారు. ఎత్తుకెళ్ళి నదిలో పడవేయాలనుకున్నారు. కానీ అందరూ
కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ వెళ్ళారు.
నదిలోకి తోశారు. నదిలోని విషసర్పాలు భీముణ్ణి కాటు వేశాయి. ఆ విషంవల్లకూడా
అతనికెటువంటి అపాయం కలగలేదు. కొంతసేపటికి భీముడికి తెలివి వచ్చింది. కట్లు
తెంపుకొని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాడు.
ఒకరోజు గురువు ద్రోణాచార్యులవారు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టారు.
అందులో దుర్యోధనుడికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లోకూడా
భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. తల్లి,
‘‘నాయనా! నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు,’’ అని హితవు
చెప్పింది. ‘‘అలాగేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్ళను
శిక్షిస్తాను, మంచి వాళ్ళను రక్షిస్తాను’’ అన్నాడు భీముడు.
Related Posts: 3rd Class,Telugu,Text Book
Maa Aatalu (మా ఆటలు) 3rd Class Telugu
భలె భలె భలె భలె బాలలమండి
భలేగ ఆటలు ఆడెదమండి
చెట్లు చేమలు ఎక్కేస్తాం
కోతికొమ్మచ్చులు ఆడేస్తాం
చెమ్మా చెక్కా, చిర్రాగోనె
చెడుగుడు ఆటలు ఆడేస్తాం!
బొంగరాలు భలే తిప్పేస్తాం
బొమ్మరిళ్ళనే కట్టేస్తాం
పరుగుపందెం, పచ్చీసాట
పతంగులను మేం ఎగరేస్తాం!
బంతీ బ్యాటూ పట్టేస్తాం
సిక్సర్లు, ఫోర్లు కొట్టేస్తాం
రాజు - రాణి, దొంగ - పోలీస్,
దాగుడుమూతలు ఆడేస్తాం!
అష్టాచెమ్మా ఆడేస్తాం
బస్సు, రైలు నడిపేస్తాం
కళ్ళగంతలు, కప్పగంతులు
ఒప్పులకుప్ప ఆడేస్తాం!
దూకుళ్లాటలో దూకేస్తాం
కుంటుళ్ళాటలో ముందొస్తాం
దస్తీలాట, కస్తీలాట
దిగుడుపుల్ల ఆడేస్తాం!
గోళీలతో గురిపెట్టేస్తాం
బొమ్మబొరుసు వేసేస్తాం
తాకుళ్ళాట, తొక్కుడబిళ్ళ
ముక్కుగిల్లుడు ఆడేస్తాం!
ఊడల ఊయల లూగేస్తాం
ఊహల్లో మేం విహరిస్తాం
గవ్వలాటలు, గుజ్జనగూళ్ళు
వామనగుంటలు ఆడేస్తాం!
కత్తిపడవలు చేసేస్తాం
వాగులు వంకలు విహరిస్తాం
వేలిముద్రలతో చిత్రాలూ
మట్టితో బొమ్మలు చేసేస్తాం!
సమతా మమతలు పంచేస్తాం
సమభావంతో మెలిగేస్తాం
నేస్తాలతో మేం సర్దుకుపోతూ
చెలిమిని చక్కగ చేసేస్తాం!
అభినందిస్తే ఆనందిస్తాం
ప్రేమను పంచితే స్వాగతిస్తాం
స్వేచ్ఛను మాకు మీరిస్తే
చంద్రమండలమే చుట్టొస్తాం!
Related Posts: 3rd Class,Telugu,Text Book
Emavuthundo... (ఏమవుతుందో...) 3rd Class Telugu
బాలల్లారా వినరండి.
ఏమవుతుందో చెప్పండి.
సూర్యుడు ఉదయించకుండా
వెలుగు, వేడి ఇవ్వకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
విత్తులు మొలకెత్తకుండా
భూమిలోనే దాగిఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
పంటలేవి పండకుండా
పుడమితల్లి అడ్డుకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
నీరు మనకు అందకుండా
నదులే ప్రవహించకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
ఇరుగుపొరుగు లేకుండా
తోడు ఎవరు లేకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
రచన: నాళం కృష్ణారావు
మూలం: గోరుముద్దలు
Related Posts: 3rd Class,Telugu,Text Book
Tholakari Chirujallulu (తొలకరి చిరుజల్లులు) 3rd Class Telugu
కిలకిలమను పిల్లలం
తొలకరి చిరుజల్లులం
అల్లరితో ఎల్లరినీ
అలరించే పిల్లలం...
తెలుగుతల్లి తోటలోని
వెలుగులీను పువ్వులం
జగమంతా పరిమళాలు
ఎగజిమ్మే పువ్వులం...
భారతి చిరుపెదవులపై
పరవశించు నవ్వులం
విశ్వమెల్ల వెన్నెలను
వెదజల్లే నవ్వులం..
భరతమాత హారంలో
మెరియుచున్న రవ్వలం
ధగద్ధగలు నలుదిశలా
ఎగజిమ్మే రవ్వలం..
రత్నగర్భ పదములపై
రవళించే మువ్వలం
విశ్వానికి నర్తనగతిని
వివరించే మువ్వలం
పాలపుంతలందు వేగ
పరుగులెత్తు గువ్వలం
మంచితనం మనసులలో
పంచిపెట్టు గువ్వలం
భారతమ్మ బొమ్మరిండ్ల
పాలుపెరుగు బువ్వలం
ఆనందము చేకూర్చే
అమృతంపు బువ్వలం...
రచన : జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి
మూలం : మల్లెల మందారాలు, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ
Related Posts: 3rd Class,Telugu,Text Book
Sahakaram (సహకారం) - 3rd Class Telugu
అందమైన కుందేలు
ఆటలాడుకుందామని
ఒంటరిగా రాతినెక్కి
గంతులేయబోయింది
ఎగిరి జారి పడిపోయే
కాలేమో విరిగిపోయే
లబలబమని మొత్తుకుంది
కదలలేక ఏడ్చింది
పిచ్చుకమ్మ చూసింది
పిల్లికెళ్లి చెప్పింది
పిల్లిమామ పరిగెత్తి
కొంగమ్మకు చెప్పింది
అందరు పరుగెత్తుకొచ్చి
కుందేలును లేవదీసి
తన ఇంటికి చేర్చిరి
వైద్యుని పిలిపించిరి
డాక్టరు ఎద్దన్న వచ్చి
సిస్టరు చిలుకమ్మ వచ్చి
గాయాలను కడిగేసి
పసరు మందు వేసిరి
కర్రముక్క కట్లు కట్టి
కాలిచుట్టు బట్ట చుట్టి
కంగారుపడకనిరి
కదలకుండ ఉండమనిరి
కోడిపిల్ల, కొంగపిల్ల
కాకిపిల్ల, కొంటెకోతి
పలకరించ వచ్చాయి
పండ్లు తెచ్చి ఇచ్చాయి
కొంటెకోతి ముందుకొచ్చి
కాలు పట్టి లాగిచూసి
కలవరమే వద్దంటూ
కబుర్లన్నో చెప్పబోయె
పరామర్శ ఏమోగాని
ప్రాణాలే పోయాయని
గిలగిలమని కొట్టుకొని
వలవల కుందేలు ఏడ్చె
ఇరుగు పొరుగు, నేస్తాలను
బంధువులను చూసి చెప్పె
మీరందరు లేకపోతె
నా గతి ఏమగునో కదా !
పులిరాజో, వనరాజో
నన్ను చేయు ఫలహారం
మీ సాయంవల్ల నేను
బతికి బట్ట కట్టాను
ఎప్పటికీ మరువనమ్మ
మీ అందరి మమకారం
కష్టసుఖములయందు
కావాలి సహకారం
Related Posts: 3rd Class,Telugu,Text Book
Laddu Badha (లడ్డూ బాధ) 3rd class Telugu
ఉన్నట్లుండి బెల్లంలడ్డుకు
ఉడుకుబోత్తనం వచ్చేసింది.
రెక్కలు కట్టుక విధాత దగ్గర
కొక్క పరుగులో వచ్చిపడింది.
ఎగా దిగా ఆశ్చర్యంతో
చూచెను దేవుడు బెల్లంలడ్డును
విశేషమేమని అడిగేలోగా
విసురుగా ఏకరుపెట్టెను లడ్డు
బెల్లం లడ్డు:
మూలన జేరిన ముసలమ్మలకీ
దంతాలూడిన తాతయ్యలకీ
ముసిముసి నవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ
ఇతరుల జోలీ శౌంఠీ ఎరుగక
కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే
వచ్చే పోయే ప్రతివాళ్ళూ నను
నోట్లో వేసుక పోవడమేనా?
మానవులెవ్వరు మర్యాదెరుగరు
మునుముందుగ నా అనుమతి కోరరు
గోళ్లని గిల్లీ పళ్లను కొరికీ
నే నగుపిస్తే నిలువు దొపిడీ!
ఈగలు, చీమలు, దోమలు, నుసమలు
యాక్కురారీ పెను బొద్దెంకలు
సకల కీటకములు యథాశక్తి నను
సతాయించుకొని తింటూ ఉంటవి.
బుద్ధీ, జ్ఞానం లేని కీటముల
పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం
జ్ఞానం కలిగిన మానవజాతికి
సైత మిదెక్కడి పొయ్యేకాలం?
బుగ్గలలోపల మగ్గుచునుందును
నోటిరోటిలో నుగ్గగుచునుందును
ఎవ్వరికెన్నడు నెగ్గదలంపని
నను వేధించుట సబబంటావా?
సమస్త వస్తు ప్రపంచకంబును
పరికల్పించిన బ్రహ్మదేవుడా!
నా ఆక్రోశము నాలకింపవా?
ఈ అన్యాయము నాపజాలవా?
బ్రహ్మదేవుడు:
‘‘పసిడి ఛాయలో మిసమిసలాడే
పేరు వినగనే నోరూరించే
ఏడుపు నవ్వుతా ఇట్టే మార్చే
పిల్లలు మెచ్చే బెల్లంలడ్డూ!
ఎల్లరు మెచ్చే బెల్లంలడ్డూ
వెళ్ళవె త్వరగా ఇక్కడినుంచి
వెళ్ళకపోతే నిన్ను నోటిలో
వేసుకొనాలనిపించును, నాకే.’’
ఉడుకుబోత్తనం వచ్చేసింది.
రెక్కలు కట్టుక విధాత దగ్గర
కొక్క పరుగులో వచ్చిపడింది.
ఎగా దిగా ఆశ్చర్యంతో
చూచెను దేవుడు బెల్లంలడ్డును
విశేషమేమని అడిగేలోగా
విసురుగా ఏకరుపెట్టెను లడ్డు
బెల్లం లడ్డు:
మూలన జేరిన ముసలమ్మలకీ
దంతాలూడిన తాతయ్యలకీ
ముసిముసి నవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ
ఇతరుల జోలీ శౌంఠీ ఎరుగక
కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే
వచ్చే పోయే ప్రతివాళ్ళూ నను
నోట్లో వేసుక పోవడమేనా?
మానవులెవ్వరు మర్యాదెరుగరు
మునుముందుగ నా అనుమతి కోరరు
గోళ్లని గిల్లీ పళ్లను కొరికీ
నే నగుపిస్తే నిలువు దొపిడీ!
ఈగలు, చీమలు, దోమలు, నుసమలు
యాక్కురారీ పెను బొద్దెంకలు
సకల కీటకములు యథాశక్తి నను
సతాయించుకొని తింటూ ఉంటవి.
బుద్ధీ, జ్ఞానం లేని కీటముల
పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం
జ్ఞానం కలిగిన మానవజాతికి
సైత మిదెక్కడి పొయ్యేకాలం?
బుగ్గలలోపల మగ్గుచునుందును
నోటిరోటిలో నుగ్గగుచునుందును
ఎవ్వరికెన్నడు నెగ్గదలంపని
నను వేధించుట సబబంటావా?
సమస్త వస్తు ప్రపంచకంబును
పరికల్పించిన బ్రహ్మదేవుడా!
నా ఆక్రోశము నాలకింపవా?
ఈ అన్యాయము నాపజాలవా?
బ్రహ్మదేవుడు:
‘‘పసిడి ఛాయలో మిసమిసలాడే
పేరు వినగనే నోరూరించే
ఏడుపు నవ్వుతా ఇట్టే మార్చే
పిల్లలు మెచ్చే బెల్లంలడ్డూ!
ఎల్లరు మెచ్చే బెల్లంలడ్డూ
వెళ్ళవె త్వరగా ఇక్కడినుంచి
వెళ్ళకపోతే నిన్ను నోటిలో
వేసుకొనాలనిపించును, నాకే.’’
Related Posts: 3rd Class,Telugu,Text Book
Jenda Panduga (జెండా పండుగ) - 2nd Class Telugu
ఆ రోజు ఆగష్టు 15. జెండా పండుగ రోజు. పిల్లలు, టీచర్లు పొద్దున్నే బడికి వచ్చారు. అందరూ కలిసి ఊరిలోకి ఊరేగింపుగా వెళ్ళారు. నినాదాలు చేస్తూ వాడవాడలు తిరిగారు. గ్రామపంచాయితీ ఆఫీసు దగ్గర ఆగారు. అక్కడ గ్రామ సర్పంచి గంగారాం జాతీయ జెండాను ఎగరవేశారు. అక్బరు, రాబర్టు, సుల్తానా, రమ్య, శ్రీరాం జాతీయగీతం పాడారు. ఆ తర్వాత అంతా కలిసి మళ్ళీ బడికి వచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు, పంచాయితీ సభ్యులు, సర్పంచి కూడా వచ్చారు.
సంయుక్త టీచరు జెండా ఎగరవేశారు. జాతీయగీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. దేశభక్తి గేయాలు పాడారు. పోటీలలో గెలిచినవారికి బహుమతులు ఇచ్చారు. పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచారు. ఆనందంగా గంతులు వేస్తూ పిల్లలు ఇళ్లకు వెళ్లారు.
Related Posts: 2nd Class,Telugu,Text Book
Rathaiah - Jaggaiah (రత్తయ్య - జగ్గయ్య ) - 2nd Class Telugu
అనగనగా ఒక ఊరు.
ఆ ఊరిలో రత్తయ్య అనే రైతు ఉండేవాడు.
ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు.
వాడి పేరు జగ్గయ్య. ఒట్టి అమాయకుడు. రత్తయ్య ముసలివాయినాడు. జబ్బుచేసింది. దగ్గి దగ్గి అలసిపోయేవాడు. డాక్టరు వచ్చాడు. మందులు ఇచ్చాడు. మందుసీసా మీద ‘‘బాగా ఊపి తాగండి’’ అని ఉంది.
జగ్గయ్య దానిని చదివాడు. మందు తాగించాడు. కానీ రత్తయ్యకు దగ్గు తగ్గలేదు. మళ్ళీ డాక్టరు వచ్చాడు. మందు తాగించావా అని అడిగాడు. ‘‘ఓ... నాన్నను బాగా ఊపి మందు తాగించాను’’ అన్నాడు జగ్గయ్య. జగ్గయ్య తెలివి తక్కువతనానికి డాక్టరు నవ్వుకున్నాడు. నాన్నను కాదు, సీసాను బాగా ఊపి మందు తాగించాలని చెప్పాడు. జగ్గయ్య తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు.
Related Posts: 2nd Class,Telugu,Text Book
Bhairavudu (భైరవుడు) - 2nd Class Telugu
అనగనగా ఒక రాజు. ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. తనను ఢీకొనేవాడెవడూ లేడనుకునేవాడు. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఎలుగుబంటితో భీకరంగా పోరాడాడు. పోరులో అతని కంఠానికి బలమైన గాయమయింది.
తన గాయం నయంచేసిన వారికి బహుమతి ఇస్తానని రాజు దండోరా వేయించాడు.
ఆ దండోరాను భైరవుడు అనే యువకుడు విన్నాడు. రాజును కాపాడాలనుకొని బయలుదేరాడు. కొండకోనలు తిరిగాడు. శిఖామణి అనే మునిని కలిశాడు. ఆయన ‘సుగంధ మూలిక’ ఒకటి ఇచ్చాడు. దానిని తీసుకొని రాజును చేరాడు. గాయం నయంచేశాడు.
సుధాముడు సంతోషించాడు. భైరవుడికి బహుమతిని ఇచ్చాడు.
Related Posts: 2nd Class,Telugu,Text Book
Ruthuvulu (ఋతువులు) 3rd Class Telugu
వసంత ఋతువు వచ్చింది
వసుధకు అందం తెచ్చింది
పచ్చపచ్చని చిగుళ్ళతో
పరవశాన్ని కలిగించింది.
గ్రీష్మఋతువు వచ్చింది
ఎండలు మెండుగ తెచ్చింది
మండే సూర్యుని జ్వాలలతో
మలమల జగతిని మాడ్చింది.
వర్ష ఋతువు వచ్చింది
వానలు వరదలు తెచ్చింది
ఊటల నీటిని నింపింది
ఉర్వికి ఊరటనిచ్చింది.
శరదృతువు వచ్చింది
చల్లని వెన్నెల నిచ్చింది
కార్తికదీపం వెలిగింది
పుడమిన కాంతులు నింపింది.
హేమంత ఋతువు వచ్చింది
హిమబిందువులను తెచ్చింది
ముత్యపు ముగ్గులు పరిచింది
ముద్దూ మురిపెము పంచింది.
శిశిరఋతువు వచ్చింది
చెట్ల ఆకులను రాల్చింది
వనమున మోడుల నింపింది
వసంతలక్ష్మిని పిలిచింది
Related Posts: 3rd Class,Telugu,Text Book
Kothi Gounu (కోతి గౌను) 2nd Class Telugu
కోతి పుట్టిన రోజంట
ఢాం ఢాం ఢాం
కొత్త గౌను వేసెనంట
ఢాం ఢాం ఢాం
తలను చక్కగ దువ్వెనంట
ఢాం ఢాం ఢాం
పౌడరు తెల్లగ పూసెనంట
ఢాం ఢాం ఢాం
సైకిలెక్కి టౌనుకు వెళ్ళె
ఢాం ఢాం ఢాం
దారిలోన పైసలు దొరికె
ఢాం ఢాం ఢాం
పైసలు తెచ్చి సైదులుకిచ్చె
ఢాం ఢాం ఢాం
సైదులు ఇచ్చె రైలుబొమ్మ
ఢాం ఢాం ఢాం
సైకిలు పైన రయ్యిన వచ్చె
ఢాం ఢాం ఢాం
రైలుబొమ్మతో ఆడెనంట
ఢాం ఢాం ఢాం
Related Posts: 2nd Class,Telugu,Text Book
Deepavali (దీపావళి) 2nd class Telugu
దీపావళి వచ్చెరా
సందడినే తెచ్చెరా
పిల్లలు భలే మెచ్చెరా
పెద్దలకిది నచ్చెరా
సీత ప్రమిద తెచ్చెరా
దీపం వెలిగించెరా
దీపాలను చూడరా
వెలుగులనే నింపెరా
చిలిపి శీను వచ్చెరా
చిచ్చుబుడ్డి కాల్చెరా
టపాకాయ చూడరా
ఢాం ఢాం అని పేలెరా
చంటిపాప చేతితో
కాకరొత్తి పట్టెరా
చురచుమని వెలిగెరా
అమ్మ వచ్చి అందరికీ
అడ్డూ మిఠాయి పంచెరా
Related Posts: 2nd Class,Telugu,Text Book
Sandhade Sandhadi (సందడే సందడి ) 2n class Telugu
వంకాయ పెండ్లి కుదిరింది
కూరగాయల సందడి చూడండి
ఆనపకాయ రంగులు వేసింది
మునగకాయ ముగ్గులు పెట్టింది
పాలకూర పందిరి వేసింది
అరటికాయ అన్నం పెట్టింది
బంగాళదుంప బజ్జీలు చేసింది
తమలపాకు తాంబూలమిచ్చింది
జామకాయ జడలు వేసింది
పనసపండు పూలు పెట్టింది
బత్తాయి బట్టలు తెచ్చింది
బెండకాయ బ్యాండు కొట్టింది
టమాటా తాళి కట్టింది
ఉల్లిపాయ ఊరేగించింది
నన్నూ పిలిచారని
గుమ్మడికాయ గంతులు వేసింది
కూరగాయల సందడి చూడండి
ఆనపకాయ రంగులు వేసింది
మునగకాయ ముగ్గులు పెట్టింది
పాలకూర పందిరి వేసింది
అరటికాయ అన్నం పెట్టింది
బంగాళదుంప బజ్జీలు చేసింది
తమలపాకు తాంబూలమిచ్చింది
జామకాయ జడలు వేసింది
పనసపండు పూలు పెట్టింది
బత్తాయి బట్టలు తెచ్చింది
బెండకాయ బ్యాండు కొట్టింది
టమాటా తాళి కట్టింది
ఉల్లిపాయ ఊరేగించింది
నన్నూ పిలిచారని
గుమ్మడికాయ గంతులు వేసింది
Related Posts: 2nd Class,Telugu






















