LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Jenda Panduga (జెండా పండుగ) - 2nd Class Telugu

      ఆ రోజు ఆగష్టు 15. జెండా పండుగ రోజు. పిల్లలు, టీచర్లు పొద్దున్నే బడికి వచ్చారు. అందరూ కలిసి ఊరిలోకి ఊరేగింపుగా వెళ్ళారు. నినాదాలు చేస్తూ వాడవాడలు తిరిగారు. గ్రామపంచాయితీ ఆఫీసు దగ్గర ఆగారు. అక్కడ గ్రామ సర్పంచి గంగారాం జాతీయ జెండాను ఎగరవేశారు. అక్బరు, రాబర్టు, సుల్తానా, రమ్య, శ్రీరాం జాతీయగీతం పాడారు. ఆ తర్వాత అంతా కలిసి మళ్ళీ బడికి వచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు, పంచాయితీ సభ్యులు, సర్పంచి కూడా వచ్చారు.       సంయుక్త టీచరు జెండా ఎగరవేశారు. జాతీయగీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. దేశభక్తి గేయాలు పాడారు. పోటీలలో గెలిచినవారికి బహుమతులు ఇచ్చారు. పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచారు. ఆనందంగా గంతులు వేస్తూ పిల్లలు ఇళ్లకు వెళ్లారు.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి