నేను ఒక్కడినే
శత్రువులు ఎందరో
ఏ రాయి
తలకు తగిలినా
ప్రాణం పోదా
తనువును
తగిలితే
గాయం కాదా
అన్ని రాళ్ళ
దెబ్బలకు
నా తనువు
నిలుస్తుందా
నా కేమన్నఅయితే
భార్యకి దిక్కెవరు
బుడి బుడి అడుగులు
వేసే కొడుకుకి
అండ ఎవ్వరు
పాకటం ఇప్పుడే
నేర్చుకుంటున్న
పాపకు తోడెవ్వరు
జీవితమంతా
కష్టాలు
అనుభవించి
శేషజీవితాన్ని
నాతొ ఆనందంగా
గడపాలనుకున్న
తల్లి తండ్రులకు
దిక్కెవ్వరు
నేను పంపే
డబ్బులతో
చదువుకొనే
తమ్ముడికేది
ఆసరా
ఇలాంటి
ఆలోచనలు ఏవీ
నా మదిలో రావు
నా దేశ
సమగ్రత
నా తల్లి
భరతమాత
రక్షణకోసం
నా ప్రాణం
అన్న నా
ప్రతిజ్ఞే గుర్తుంటుంది
ప్రతిక్షణం
నా కుటుంబానికి
లక్షలమంది
తోటి సిపాయిలు
కోట్లమంది
భారతీయ సోదరులు
రక్ష
మళ్ళీ మళ్ళీ
జన్మిస్తా
మళ్ళీ మళ్ళీ
ఇలా మరణించటం
భరతమాత
సేవగా భావిస్తా
జై హింద్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి