LATEST UPDATES

27, జూన్ 2018, బుధవారం

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

This is a simple translate button.

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

మిత్రమా.... గాయం ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లుగా ఉన్నది ఇప్పటి పరిస్థితి... మీరు చెప్పిన కొన్ని విషయాలతో నేను కూడా ఏకీభవిస్తాను... కాని దానికి పరిష్కారం ఇది మాత్రం కాదు అని  నా అభిప్రాయం... వెబ్ కౌన్సిల్ వలన దొంగ సర్టిఫికెట్లు తగ్గాయా? SSC సబ్జెక్ట్ పాయింట్లలో తప్పులు జరగలేదా? అర్హత లేకున్నా ఇప్పటికి D కేటగిరి పేరుతో అధిక పాయింట్లు పొందిన వారు లేరా? వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏది ఆగిపోయింది... సరి అయిన విధి విధానాలు రూపొందించకుండా తప్పులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో అవకాశవాదులు తప్పులు చేస్తూనే ఉన్నారు... మీరన్నట్లుగా సాంకేతికతను అందరూ స్వాగతించాల్సిందే... కాని దాని వలన పని సులభతరం కావాలి  కష్టతరం కాకూడదు... సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పుడు పని వేగవంతంగా పూర్తి అయ్యేలా ఉండాలి కానీ మరింత ఆలస్యం చేసేదిగా ఉండకూడదు... మీరు చెప్పినట్లు రాత్రి పగలు కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాలనే ఆలోచన ఎవరికి లేదు, దాని వలన అందరం ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళమే కానీ ఇప్పుడు అంత కన్నా అధ్వాన్నంగా పరిస్థితి తయారయ్యేలా ఉన్నది. ఈ రోజు నేను మన కరీంనగర్ లో అందరి కన్నా మిన్నగా బిల్స్ చేస్తారని పేరు ఉన్న ఒక ఉపాధ్యాయ సోదరుని దగ్గర SA గణితం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళాను... 100 కన్నా తక్కువ ఆప్షన్స్ అయితేనే ఇస్తాను. 100 ఇవ్వడానికి గంట సమయం పడుతుంది.. అంత కన్నా ఎక్కువ అయితే నా వల్ల కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు... నేను తీసుకు వెళ్లిన వ్యక్తిది 550 పైన ర్యాంకు.. పైగా లాంగ్ స్టాండింగ్.. ఉండేది కరీంనగర్ లో... కాబట్టి  కనీసం 400 వరకైనా ఆప్షన్స్ ఇచ్చి మిగతావి బల్క్ గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాము... తాను తొలుత చేయను అన్నప్పటికి నా మాట కాదనలేక పని మొదలుపెట్టి 215 ఆప్షన్స్ ఇవ్వగానే పవర్ పోయింది...అయిన వరకు సేవ్ చేద్దాము అంటే కంపల్సరీ కాబట్టి అన్ని ఆప్షన్స్ ఇస్తే తప్ప సేవ్ తీసుకోవడం లేదు... తొందర తొందరగా ఇంకో 25 ఆప్షన్స్ ఇచ్చామో లేదో కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది... దాదాపు 2.30 గంటల సమయం కష్టపడితే పని పూర్తి కాలేదు... ఇక తన వల్ల కాదు బయట చేసుకోండి సార్ అని చెప్పడంతో ఇంటికి వచ్చాము... ఈ సాఫ్ట్ వేర్ మిడి మిడి పరిజ్ఞానముతో రూపొందించినట్లు ఉన్నది తప్ప ఉపయోగకరంగా లేదు... ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ కిందికి మీదికి జరుపుకునే సదుపాయం ఉంటది కానీ ఇందులో కనీసం ఆ సదుపాయం కూడా లేదు..  ఒకసారి ఏదైనా మధ్యలో తప్పుగా ఇచినట్లైతే దానిని తొలగించడం తప్ప దాని స్థానంలో సరైంది ఇవ్వడానికి అవకాశం లేదు.. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి... నిన్న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సిలింగ్ లో spouce కేటగిరీ లో ఒకరికి కేవలం 7 మండలాలు ఆప్షన్స్ గా వచ్చాయి ఒకవేళ అవి దొరక్కపోతే పరిస్థితి ఏంటి... అలాగే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే spouce వాళ్ళు అదే మండలం లేదా దగ్గరి మండలంలో పోస్టింగ్ పొందే వాళ్ళు... ఇప్పుడు అలా కాకుండా అందరూ కరీంనగర్ వచ్చి చేరితే మిగతా ఉపాద్యాయుల పరిస్థితి ఏంటి... ఇప్పటికే spouce కేటగిరీ తీసివేయాలి అని వస్తున్న డిమాండ్ కి మరింత బలం చేకూర్చినట్లు కాదా... అన్ని విధాలా అనుకులమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించి ముందుగా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఫలితాల ఆధారంగా ఆచరణలో ప్రవేశ పెట్టాల్సింది... కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఒక సాఫ్ట్ వేర్ రూపొందించి అది మన ముఖాన పారేసి అడిగిన కొద్దీ రోజుకో మార్పు చేసుకుంటూ పోతుంటే ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది... ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కాలంలో ఒక్క సాఫ్ట్ వేర్ ను సమర్థవంతంగా రూపొందించకుండా ఉపాధ్యాయులను తప్పు పడితే ఎలా... చివరిగా ఒక ప్రశ్న... నా ర్యాంకు 1006... నేను ఉండేది కరీంనగర్ లో... కనీసం ఎన్ని మండలాల్లో ఎన్ని స్థానాలు చూపిస్తే నాకు కచ్చితంగా ప్లేస్ వస్తుందో చెప్పగలరా... సాఫ్ట్ వేర్ రూపిందించిన వారే 1007 ఇస్తే గ్యారంటీ అంటున్నారు... అలాంటప్పుడు నేను 1007 ఇవ్వాలి అంటే కనీసం 10 గంటలు నెట్ సెంటర్లో ఉండి ఆప్షన్స్ ఇవ్వాలి... మరి నా ఒక్కడికే అంత సమయం పడితే అందరివి ఎప్పుడు పూర్తి అవుతాయి... ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కోసమో లేక మరో దాని కోసమో కాదు...నాకు ఎదురైన పరిస్థితి తీవ్రతను మీకు తెలియ పరచాలని ఉద్దేశంతోనే.... మరొక్క సారి మీరు వెబ్ కౌన్సిలింగ్ విషయమై పునరాలోచన చేయాలని ఎల్లుండి ప్రారంభం కాబోయే SGT ల పరిస్థితిని అంచనా వేయాలని మా సూచన...

---సామాన్య ఉపాద్యాయుడు......
(సాంకేతిక పరిజ్ఞానం లేని ఉపాద్యాయులందరు ఇబ్బంది పడుతున్నారు--ఇది నిజం)

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి