LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

నేటి కథ - కేశవ! నారాయణ! మాధవ!

This is a simple translate button.

* నేటి కథ *

కేశవ! నారాయణ! మాధవ!

భారత దేశంలో, ఒకానొక గ్రామంలో, చాలా రోజుల క్రితం గోవిందరాజు అనబడే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు.

అతనికి చిన్నప్పుడు ఎప్పుడో ఎదో గుడిలో ప్రవచనలో, “మరణించేటప్పుడు ఆఖరి శ్వాసతో దేవుడిని తలుచుకున్న వారికి స్వర్గం ప్రాప్తం అవుతుంది” అని విన్న మాట మనసులో నిలిచిపోయింది.

కాల క్రమేణా అతనికి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురి కొడుకులకి కేశవ, నారాయణ, మాధవ అని పేర్లు  పెటుకున్నాడు. కొడుకులందరికి దేవుడి పేర్లు పెట్టుకుంటే మరణించేటప్పుడు వాళ్ళని పిలిచినా దేవుళ్ళని తలుచు కున్నట్లుంటుంది అని అనుకున్నాడు.

“ఎలాగా మరణించేటప్పుడు దేవుడిని తలుచు కుంటాను కదా, రోజు పుణ్యం సంపాదించడానికి ఆరాట పడనక్కర్లేదు” అని గోవిందరాజు అనుకునేవాడు. వ్యాపారంలో మోసాలు చేయటం మొదలు పెట్టాడు. బాగా డబ్బు సంపాదించిన ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు. గుడి, గోపురం, పూజ, పునస్కారం ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే వెంటనే పెడసరిగా జవాబు చెప్పే వాడు.

అతని భార్య మట్టుకు చాలా మంచిది. అందరితో మంచిగా ప్రవర్తించి, మంచి పనులు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది.

ఇలా రోజులు గడిచాయి. అమ్మ ప్రభావం వల్ల ముగురు కొడుకులు సద్బుద్ధితో పెద్ద వాళ్ళయ్యారు. వ్యాపారంలో గోవిందరాజు కి సహాయం చేయడం మొదలు పెట్టారు. గోవిందరాజు కూడా వృద్ధుడు అయ్యాడు. వయసుతో పాటు జబ్బులు కూడా వచ్చాయి. మంచాన్న పడ్డాడు.

ఇక గోవిందరాజుకి ఆఖరి సమయం వచ్చింది. వైద్యుడుని ఇంట్లోనే వుండి, సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు. ఇప్పుడు కూడా మరణించేటప్పుడు దేవుడిని తలచుకుంటే చాలు, అన్ని పాపాలు కడిగి పోయి స్వర్గం ప్రాప్తం అవుతుందని గట్టి నమ్మకంతో వున్నాడు, గోవిందరాజు.

సమయం వచ్చింది. వైద్యుడు గోవిందరాజుకు చెప్పాడు. వెంటనే గోవిందరాజు “కేశవ! నారాయణ! మాధవ!” అన్నాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న తండ్రి పిలుస్తున్నాడు అనుకుని ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుంటూ అతని మంచం దగ్గరకి వచ్చారు.

ముగ్గురు కొడుకులని చూసి వెంటనే గోవిందరాజు తన ఆఖరి శ్వాసతో,  “మీరు ముగ్గురూ ఇక్కడే వుంటే వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు? ఏ మాత్రం శ్రద్ధ లేదు” అని తిడుతూ కన్ను మూసాడు.

*అలాగా చివరి మాట దేవుడి పేరు కాక పోవడంతో, జీవితాంతం చేసుకున్న పాపాల కారణంగా అతనికి స్వర్గం చెందలేదు.*

సేకరణ:సొంటేల ధనుంజయ

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి