LATEST UPDATES

27, జూన్ 2018, బుధవారం

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

This is a simple translate button.

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

(ప్రజ్ఞ టుడే)న్యూదిల్లీ: ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత సదరు ఉద్యోగి తన ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో)నుంచి 75శాతం వరకూ సొమ్మును తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. మంగళవారం జరిగిన కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, మిగిలిన 25శాతాన్ని కూడా ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కింద రెండు నెలల తర్వాత తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది.

‘ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులుగా గుర్తించి, వారి ఖాతాల్లో అప్పటివరకూ జమ అయిన పీఎఫ్‌లో 75శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాం.’ అని కార్మికశాఖ మంత్రి సంతోష గంగ్వార్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల తర్వాత సదరు ఉద్యోగి తన పీఎఫ్‌ ఖాతా నుంచి కేవలం 60శాతం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని ఒక నెలకు తగ్గించారు. అంతేకాదు, పీఎఫ్‌ సొమ్మును వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరతామనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది.

అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు గంగ్వార్‌ తెలిపారు. ఎస్‌బీఐ, యూటీఐలలో ఈటీఎఫ్‌లను మరో ఏడాది పాటు అంటే జులై 1, 2019 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. ఫండ్‌ మేనేజర్ల కాలపరిమితిని కూడా డిసెంబరు 31, 2018 వరకూ పొడిగించారు. ఫండ్‌ మేనేజర్లను మూడేళ్ల కాలపరిమితికి ఏప్రిల్‌ 1, 2015లో నియమించగా, జూన్‌ 30, 2018తో వారి గడువు ముగిసింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి