అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు
ఆ చెరువు లో దూకి మొసళ్ళకు దొరక్కుండా తప్పించుకొని పైకి వస్తే కోటి రూపాయలు బహుమతి అని ప్రకటించారు.
పోటీ చూడ్డానికి వచ్చిన జనాలు ఒక్కరూ కూడ దైర్యం చేసి ముందుకు రాలేదు.
ఇంతలో...
వెనక ముందు చూడకుండా కాంతారావు దూకాడు.
దూకాడమే కాకుండ ఈతకొడుతూ పైకి వచ్చాడు.
అక్కడ ఉన్నవారందరూ అభినందనలతో ముంచెత్తారు, కోటి రూపాయల బహుమతి కూడ ఇచ్చారు.
బహుమతి స్వీకరించిన కాంతారావు కోపంతో చుట్టూ చూస్తూ ఇప్పుడు చెప్పండి నన్ను చెరువులోకి తోసింది ఎవరు ???
అక్కడున్న వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
అయితే...
తన పక్కనే నించున్న తన భార్య కాంతం మాత్రం ముసిముసిగా నవ్వుతూ కనబడింది.
నీతీ :
ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి