LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

దేశభక్తి కవిత

నేను ఒక్కడినే
శత్రువులు ఎందరో

ఏ రాయి
తలకు తగిలినా
ప్రాణం పోదా

తనువును
తగిలితే
గాయం కాదా

అన్ని రాళ్ళ
దెబ్బలకు
నా తనువు
నిలుస్తుందా

నా కేమన్నఅయితే
భార్యకి దిక్కెవరు
బుడి బుడి అడుగులు
వేసే కొడుకుకి
అండ ఎవ్వరు
పాకటం ఇప్పుడే
నేర్చుకుంటున్న
పాపకు తోడెవ్వరు

జీవితమంతా
కష్టాలు
అనుభవించి
శేషజీవితాన్ని
నాతొ ఆనందంగా
గడపాలనుకున్న
తల్లి తండ్రులకు
దిక్కెవ్వరు

నేను పంపే
డబ్బులతో
చదువుకొనే
తమ్ముడికేది
ఆసరా

ఇలాంటి
ఆలోచనలు ఏవీ
నా మదిలో రావు

నా దేశ
సమగ్రత
నా తల్లి
భరతమాత
రక్షణకోసం
నా ప్రాణం
అన్న నా
ప్రతిజ్ఞే గుర్తుంటుంది
ప్రతిక్షణం

నా కుటుంబానికి
లక్షలమంది
తోటి సిపాయిలు
కోట్లమంది
భారతీయ సోదరులు
రక్ష

మళ్ళీ మళ్ళీ
జన్మిస్తా
మళ్ళీ మళ్ళీ
ఇలా మరణించటం
భరతమాత
సేవగా భావిస్తా

జై హింద్

Health Tip - ఆహారంతో థైరాయిడ్‌కు చెక్..!

*Health Tip*

ఆహారంతో థైరాయిడ్‌కు చెక్..!

నేడు ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో లక్షల మంది పోరాడుతున్నారు. జీవితాంతం ఈ సమస్యను అదుపులో ఉంచుకోడానికి, తగ్గించుకోడానికి ఎన్నో మందులు వాడుతుంటారు.

ఈ హైపోథైరాయిడ్‌ని సరైన ఆహార పద్ధతుల ద్వారా కంట్రోల్‌ చేసుకోవచ్చు. సరైన ఆయుర్వేద ఔషధాలతో ఈ సమస్యను పూర్తిగా అదుపు చేసుకోవచ్చు.

మన బరువు, గుండె పనితీరు, జీర్ణవ్యవస్థ పనితీరు, నరాల వ్యవస్థ పనితీరు ఇవన్నీ ఈ జీవక్రియలో భాగమే. హైపో థైరాటిజంలో ఈ జీవక్రియ నెమ్మదిస్తుంది.

వీటిని గుర్తించేందుకు లక్షణాలు. మెడ ముందు భాగంలో అమరి ఉండే ఈ థైరాయిడ్‌ గ్రంధిలో పెరుగుదల ఉంటుంది. వాపుకూడా ఉండొచ్చు.

వాపు అనేది అందరికీ కనిపిస్తుందనుకోనవసరం లేదు. కొంత మందిలో ఈ వాపు ఉండదు, మరి కొంత మందిలో ఇది అధిక శాతంలో ఉంటుంది. అప్పుడు గొంతు నుండి ఏమన్నా మింగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.

అయితే ఇవి వ్యాధి ప్రారంభంలో కనిపించే లక్షణాలు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇంకొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిని ఆయుర్వేదంతో ఎలా తగ్గించుకోగలమో తెలుసుకుందాం.

ఆహారంలో క్యాబేజిని మానేయాలి. క్యాబేజి ఆయొడిన్‌ని అడ్డుకుంటుంది. అయొడిన్‌ అనేది థైరాయిడ్‌ ఉన్నవారికి అందడం చాలా అవసరం.

అలాగే వేరుశనగలు, మెంతికూర, బచ్చలికూర, సోయా చిక్కుడు, మొక్కజొన్న కండ్లు, చిలకడ దుంపలు వీటిని కూడా తగ్గించాలి.

అయొడిన్‌ ఎక్కువగా ఉండే సముద్రపు చాపలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు బాగా తినాలి. ఆయొడైజ్‌డ్‌ ఉప్పుని మాత్రమే వాడాలి.

క్రమం తప్పకుండా నిత్యం వ్యాయామం చేస్తుండాలి.

ఆహార పదార్థాలలో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

రోజుకు నాలుగు లేదా ఐదు లీటర్ల నీటిని తాగాలి.

ఒక వేళ ఈ హైపోథైరాయిడ్‌ వల్ల మీరు అధిక బరువు ఉంటే ఎరోబిక్‌ తరహా ఎక్సర్‌సైజ్‌లు చేయండి. రక్తపోటు అధికంగా ఉన్నవారు ఉప్పు వాడకం బాగా తగ్గించాలి.

కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు ఆహారంలో నూనెలను తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఉలవలు 100 గ్రాములు, నల్ల నువ్వులు 50 గ్రాములు, వెల్లుల్లి 25 గ్రాములు, నీళ్లు ఒక లీటరు.. వీటన్నింటిని పొడి చేసి ఉంచుకోండి. లీటరు నీటిలో కొంచెం పొడిని వేసి 200 మిల్లీ లీటర్ల కషాయం మిగిలే వరకు మరిగించండి.

ఆ కషాయన్ని వడకట్టి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజు మార్చి రోజు కానీ రెగ్యులర్‌గా కానీ 40 రోజులపాటు తీసుకుంటే జీవితకాలపు మందుల వాడకాన్ని తగ్గిస్తుంది.

అయితే మధ్య మధ్యలో థైరాయిడ్‌ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.

అరకప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె కలుపుకొని ఉదయం, సాయంత్రం 40 రోజుల పాటు తాగాలి. ఈ మిశ్రమం హైపోథైరాయిడ్‌ని బాగా కంట్రోల్‌ చేస్తుంది

నేటి కథ - జీవన సూత్రం

*నేటి కథ*

                    జీవన సూత్రం

రామాపురంలో నివసించే రంగయ్య మంచి ఆదర్శ రైతు. అతని పొలంలో పండే మొక్కజొన్న అద్భుతంగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళు. లావుగా, బలంగా ఉండే మొక్కజొన్న పొత్తులతో అతని పొలం టన్నుల దిగుబడినిచ్చేది. ప్రతి ఏడాదీ రాజధానిలో జరిగే పంటల పోటీకి తన పంటను పంపించేవాడు రంగయ్య. ప్రతిసారీ అతని పంటకే అక్కడ మొదటి బహుమతి వస్తూండేది.

ఒకసారి అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన విలేఖరి అడిగాడు: "ఇన్నేళ్ళుగా మీరు ప్రతిసారీ మొక్కజొన్న పండిస్తున్నారు; ప్రతిసారీ మీరే మొదటి బహుమతి సాధిస్తూ వస్తున్నారు కదా, మీరు ఏ కంపెనీ విత్తనాలు వాడుతున్నారు?" అని.

రంగయ్య అన్నాడు- "అట్లాంటిదేమీ లేదండి, నేను అసలు ఏ కంపెనీ విత్తనాలూ‌ కొనను" అని. విలేఖరి వ్యవసాయం గురించి కొంచెం చదువుకున్నవాడు. అతను ఆశ్చర్యపోయాడు- "అంటే మీ విత్తనం.. నాటు విత్తనమా?" అని.

"అవునండి. నా పంటకు ఆధారం నాటు విత్తనమే" చెప్పాడు రంగయ్య.

"మరి నాటు విత్తనాలలో దిగుబడి రాను రాను తగ్గిపోతుంది కదా?!" అడిగాడు విలేఖరి.

"ఎందుకు తగ్గాలి?" అడిగాడు రంగయ్య. "నా విత్తనాల శక్తి అయితే మరి ఇంతకాలంగా ఏమీ తగ్గలేదు. నిజానికి ఈ విత్తనం మా నాన్న తరం నుండి వస్తూ ఉన్నది- దీని శక్తి తగ్గలేదు కదా మరి?"

"అట్లా కాదు- ఇప్పుడు మీరు ఒక కంపెనీ వారి మొక్క జొన్న వేశారనుకోండి. మీ ప్రక్కవాళ్ళు వేరే రకం వేసి ఉండచ్చు- అప్పుడు మీ పంటకు కావలసిన పుప్పొడి రేణువులు ప్రక్క పొలం నుండి, వాళ్లకు మీ పొలం నుండి- అట్లా వేరు వేరు చోట్ల నుండి వచ్చిన పుప్పొడి రేణువులు కలవటం వల్ల, వేరు వేరు లక్షణాలున్న కొత్త పంట తయారు అవుతూ పోతుంది. క్రమంగా మీ పంట నాణ్యత మారిపోతుంది, మీకు తెలియకుండానే!" వివరించాడు విలేఖరి.

"అట్లా అవ్వదులెండి, మీకు తెలీదు" అన్నాడు రంగయ్య.

"ఎందుకు కాదు?" అడిగాడు విలేఖరి.

"మా ఊళ్ళో రైతులకు అందరికీ ఓ అలవాటుంది- మేం ఒకరి విత్తనాలు ఒకరం పంచుకుంటుంటాం" చెప్పాడు రంగయ్య.

"అవునా?!" ఇంకా ఆశ్చర్యపోయాడు విలేఖరి. "మీ అవార్డు విత్తనాలను కూడా మీరు ఊళ్ళో అందరితోటీ పంచుకుంటారా?!"

"అవును. లేకపోతే కుదరదు. మా పొరుగు రైతులు సత్తువలేని పంట పండిస్తే, వాళ్ల పంటనుండి మా పొలంలోకి వచ్చిన పుప్పొడి, మా విత్తనాల నాణ్యతను దెబ్బతీస్తుంది కదా! నా విత్తనం బాగుండాలంటే, మా పొరుగు రైతులు నాణ్యమైన పంట పండించటం తప్పని సరి" చెప్పాడు రంగయ్య.

అతని అవగాహనకు విలేఖరి నివ్వెరపోయాడు.

నిజంగా చూస్తే 'ఇదే మంచి జీవన సూత్రం కూడా' అనిపిస్తుంది. మనం సంతోషంగా, నిండుగా, అర్థవంతంగా జీవించాలంటే, మన చుట్టూ ఉన్నవారితో మన సంతోషాన్నీ, జ్ఞానాన్నీ‌ పంచుకోవటం తప్పనిసరి. జాగ్రత్తగా చూస్తే మనవల్ల స్పృశించబడే వారివల్లనే మన జీవితానికీ ఒక విలువ ఏర్పడుతుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాధ పడుతూ ఉంటే మనం ఒక్కరం సంతోషంగా ఉండటం కష్టమౌతుంది కదా. అలా సమాజంలో ఒకరి సంతోషం మిగతా వాళ్లందరి సంతోషంతోటీ ముడిపడి ఉన్నది! దీన్ని కావాలంటే సమైక్యతా బలం అనచ్చు; విజయ రహస్యం అనచ్చు; జీవన సూత్రం అనచ్చు- కానీ సత్యం ఏంటంటే- 'అందరం గెలిచేవరకూ ఏ ఒక్కరమూ గెలవలేం'. సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఇమిడి ఉన్నది!

చిన్నారి గీతం - కాకమ్మ

*చిన్నారి గీతం*

కాకమ్మ:

కాకమ్మా! కాకమ్మా!!
చుట్టాలొ చ్చారు చూచిపో,
పక్కాలొ చ్చారు పారిపో,
నీ కాలికి గజ్జకడతా,
కాలుతీసి ఖంగున గంతెయ్‌!

చందమామ బొట్టు
నా సందిటికేసికట్టు,
ఊళ్లోవుంటే ఒట్టు
నీవు వచ్చిన దారినిబట్టు.

నేటి కథ - గొడవ పడి ఏమి లాభము?

* నేటి కథ *

గొడవ పడి ఏమి లాభము?

ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండే వారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళే వారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించే వారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు.

ఒక రోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్ళారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరు ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది, అంటే నాది అని దేబ్బలాడుకున్నారు.

హోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకుని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకుని ఉన్న శక్తంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు.

ఇలాలాగుతుంటే, తాడు పాతదేమో ఠప్పు మని విరిగి పోయింది. ఇద్దరు ఒకటే సారి ధమ్మని తలోక వైపు పడ్డారు. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి.

ఆ విరిగి పోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్ళారు.

కంది పోయిన మొహాలు, మాసి పోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటి మీద గాయాలు వేసుకుని వెళ్ళిన ఇద్దరికీ ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి.

మొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడూ దక్కలేదు, దెబ్బలూ తగిలాయి; ఇంట్లోను చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దేబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకుని వుంటే ఇద్దరు వంతులేసుకుని స్కిప్పింగ్ చేసేవారని బాధ పడ్డారు.

ఇద్దరు అనుకున్నారు: అవును, గొడవ పడి ఏమి లాభము?

నేటి కథ - కేశవ! నారాయణ! మాధవ!

* నేటి కథ *

కేశవ! నారాయణ! మాధవ!

భారత దేశంలో, ఒకానొక గ్రామంలో, చాలా రోజుల క్రితం గోవిందరాజు అనబడే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు.

అతనికి చిన్నప్పుడు ఎప్పుడో ఎదో గుడిలో ప్రవచనలో, “మరణించేటప్పుడు ఆఖరి శ్వాసతో దేవుడిని తలుచుకున్న వారికి స్వర్గం ప్రాప్తం అవుతుంది” అని విన్న మాట మనసులో నిలిచిపోయింది.

కాల క్రమేణా అతనికి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురి కొడుకులకి కేశవ, నారాయణ, మాధవ అని పేర్లు  పెటుకున్నాడు. కొడుకులందరికి దేవుడి పేర్లు పెట్టుకుంటే మరణించేటప్పుడు వాళ్ళని పిలిచినా దేవుళ్ళని తలుచు కున్నట్లుంటుంది అని అనుకున్నాడు.

“ఎలాగా మరణించేటప్పుడు దేవుడిని తలుచు కుంటాను కదా, రోజు పుణ్యం సంపాదించడానికి ఆరాట పడనక్కర్లేదు” అని గోవిందరాజు అనుకునేవాడు. వ్యాపారంలో మోసాలు చేయటం మొదలు పెట్టాడు. బాగా డబ్బు సంపాదించిన ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు. గుడి, గోపురం, పూజ, పునస్కారం ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే వెంటనే పెడసరిగా జవాబు చెప్పే వాడు.

అతని భార్య మట్టుకు చాలా మంచిది. అందరితో మంచిగా ప్రవర్తించి, మంచి పనులు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది.

ఇలా రోజులు గడిచాయి. అమ్మ ప్రభావం వల్ల ముగురు కొడుకులు సద్బుద్ధితో పెద్ద వాళ్ళయ్యారు. వ్యాపారంలో గోవిందరాజు కి సహాయం చేయడం మొదలు పెట్టారు. గోవిందరాజు కూడా వృద్ధుడు అయ్యాడు. వయసుతో పాటు జబ్బులు కూడా వచ్చాయి. మంచాన్న పడ్డాడు.

ఇక గోవిందరాజుకి ఆఖరి సమయం వచ్చింది. వైద్యుడుని ఇంట్లోనే వుండి, సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు. ఇప్పుడు కూడా మరణించేటప్పుడు దేవుడిని తలచుకుంటే చాలు, అన్ని పాపాలు కడిగి పోయి స్వర్గం ప్రాప్తం అవుతుందని గట్టి నమ్మకంతో వున్నాడు, గోవిందరాజు.

సమయం వచ్చింది. వైద్యుడు గోవిందరాజుకు చెప్పాడు. వెంటనే గోవిందరాజు “కేశవ! నారాయణ! మాధవ!” అన్నాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న తండ్రి పిలుస్తున్నాడు అనుకుని ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుంటూ అతని మంచం దగ్గరకి వచ్చారు.

ముగ్గురు కొడుకులని చూసి వెంటనే గోవిందరాజు తన ఆఖరి శ్వాసతో,  “మీరు ముగ్గురూ ఇక్కడే వుంటే వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు? ఏ మాత్రం శ్రద్ధ లేదు” అని తిడుతూ కన్ను మూసాడు.

*అలాగా చివరి మాట దేవుడి పేరు కాక పోవడంతో, జీవితాంతం చేసుకున్న పాపాల కారణంగా అతనికి స్వర్గం చెందలేదు.*

సేకరణ:సొంటేల ధనుంజయ

సుప్రీంకోర్టు సంచలన తీర్పు - రవాణాశాఖ

*సుప్రీంకోర్టు సంచలన తీర్పు*

*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,
భీమా సంస్థలు , రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా    ఏప్రిల్ 1వ తారీకు 2018 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...

1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా)  ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు.  అలాగే ప్రమాదం పాలైన వారికి  ఏ విధమైన పరిహారం వర్తించదు.

2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.

4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.

5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.

6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.

7. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.

8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.

9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.

10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.

11. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే  ఏ విధమైన భీమా వర్తించదు

Please share to every one

ఇండియాలో ఎవ్వరికైనా తెలుసా : లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే...

ఇండియాలో ఎవ్వరికైనా తెలుసా : లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే...

టైటిల్ చూసి షాక్ అయ్యారా.. నిజమే.. రాసే ముందే కూడా మేం షాక్ అయ్యాం. రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే..

నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతి చలానా చూసి అవాక్కవుతున్నారు. అవునా.. అవునా అని అందరూ చర్చించుకోవటం కనిపించింది.

నిమ్స్‌లో ఉద్యోగులకు సాయంత్రపు ఓపీ సేవలు

*నిమ్స్‌లో ఉద్యోగులకు సాయంత్రపు ఓపీ సేవలు

వచ్చేనెల 1 నుంచి ప్రారంభానికి సన్నాహాలు

ఉచితంగా ఔషధాల అందజేతకూ ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో భాగంగా ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు నిమ్స్‌లో సాయంత్రపు వేళ కూడా బయట రోగుల (ఓపీ) సేవలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదేరోజు నుంచి సాయంత్రపు వేళ ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నిమ్స్‌ సహా వనస్థలిపురం, ఖైరతాబాద్‌, వరంగల్‌ తదితర కేంద్రాల్లో ఓపీ సేవలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. సాయంత్రం తర్వాత ఓపీ సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నిమ్స్‌లో ప్రాథమికంగా ఓపీ సేవలను సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకూ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అంతర్గత ఆదేశాలను వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవలే నిమ్స్‌ సంచాలకులకు జారీచేశారు. ఉద్యోగులు, పాత్రికేయుల కోసం సాయంత్రపు వేళలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. వైద్యులు సూచించే నిర్ధారణ పరీక్షలనూ నిమ్స్‌లోనే ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్య పథకంలో భాగంగా ఇతర ఓపీ సేవల కేంద్రాల్లో అందజేస్తున్నట్లుగా నిమ్స్‌లోనూ ఔషధాలను ఉచితంగా అందజేయటానికి ప్రత్యేకంగా ఔషధ నిల్వ గోదామును ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

*📢ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

*వివిధ క్యాటగిరీలు, వేతన స్కేళ్లపై అధ్యయనం

*ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళి

*అగస్టు 15లోగా ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రప్రభుత్వం సీఆర్ బిశ్వాల్ సారథ్యంలో ఏర్పాటుచేసిన పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఉద్యోగులకు సంబంధించిన పూర్తివివరాలను సేకరిస్తున్నది. వివిధ క్యాటగిరీల ఉద్యోగులకు అమలవుతున్న వేతనవిధానం, డీఏ, అలవెన్సులు తదితరఅంశాలను పరిశీలిస్తున్నది. ఆగస్టు15లోగా నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిటీ సమాయత్తమవుతున్నది. ఒకే క్యాడర్ ఉద్యోగులకు ఒక్కోశాఖలో ఒక్కో వేతన విధానం అమలవుతున్న విషయాన్ని కమిషన్ పరిశీలించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పీఆర్సీ కమిషన్ వివిధ శాఖలకు, ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళిని పంపించింది. 1993, 1999, 2005, 2010, 2014 సంవత్సరాల్లో పీఆర్సీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేస్తున్నది. 2014లో కనిష్ఠ వేతనం రూ.13000లు, గరిష్ఠవేతనం రూ.1,10,850 లుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న మాస్టర్‌స్కేల్ విధానంపై అన్నిశాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఒక సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ...

మంచి కాలేజీలో Btech అయిపోయిన వెంటనే నాకు డీసెంట్ ఉద్యోగం వచ్చింది..

ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని వత్తిడి చేస్తుంటే పెళ్ళి చూపులకి వెళ్ళాను

అమ్మాయి నచ్చింది.. ఆ అమ్మాయికి నేను నచ్చలేదని మొహం మీదే చెప్పేసింది..

నేను ఉక్రోషంతో....

సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత చూడు..ఇంత మంచి సంభందం ఎందుకు వదులుకున్నానా..? అని భాధ పడతావు...అని వచ్చేసాను..

After 5 years..

ట్రాపిక్ సిగ్నల్ దగ్గర నన్ను రిజక్ట్ చేసిన అమ్మాయి ఆడీ కారులో(Audi car) తన Boy friend తో ఉంది..

నేను నా యాక్టివా కిక్ కొడుతున్నాను..స్టార్ట్ అవట్లేదు..బహుశా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందనుకుంటా..!అదే సమయంలో ఆ అమ్మాయి నన్ను చూసింది..కానీ నన్ను గుర్తు పట్టలేదు..

ఆ క్షణం...ఇన్ని రోజుల నా డ్రెవింగ్ కెరీర్లో మొదటి సారిగా హెల్మెట్ వల్ల ఉపయోగం తెలిసింది..😜😜

# హెల్మెట్ ధరించండి.. మిమ్మల్ని మీరు అన్నిరకాలుగా కాపాడుకోండీ..

Note : ఈ స్టోరీ నాదికాదు..😅 ఒక సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ...

#ప్రజా ప్రయోజనార్ధం జారీ చేయటమైనది..

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు

ఆ చెరువు లో దూకి  మొసళ్ళకు దొరక్కుండా  తప్పించుకొని పైకి వస్తే కోటి రూపాయలు బహుమతి అని ప్రకటించారు.    

పోటీ చూడ్డానికి వచ్చిన   జనాలు  ఒక్కరూ కూడ దైర్యం చేసి  ముందుకు రాలేదు.
ఇంతలో...
వెనక ముందు చూడకుండా కాంతారావు దూకాడు.
దూకాడమే కాకుండ ఈతకొడుతూ పైకి వచ్చాడు.

అక్కడ  ఉన్నవారందరూ అభినందనలతో ముంచెత్తారు, కోటి రూపాయల  బహుమతి కూడ ఇచ్చారు.

బహుమతి స్వీకరించిన కాంతారావు కోపంతో చుట్టూ చూస్తూ ఇప్పుడు చెప్పండి నన్ను చెరువులోకి తోసింది ఎవరు ???

అక్కడున్న వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

అయితే...
తన పక్కనే  నించున్న తన భార్య కాంతం మాత్రం ముసిముసిగా నవ్వుతూ కనబడింది.

  నీతీ :
ప్రతి  మగవాడి విజయం  వెనక ఒక  స్త్రీ ఉంటుంది.