LATEST UPDATES

2, జులై 2018, సోమవారం

ఎదుటివారిని ఇలా దారిలోకి తెచ్చుకోండి.. చాణక్యుడు చెప్పిన హిప్నోట్రిక్స్!!

This is a simple translate button.

ఎదుటివారిని ఇలా దారిలోకి తెచ్చుకోండి.. చాణక్యుడు చెప్పిన హిప్నోట్రిక్స్!!

ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. ప్రతి వ్యక్తీ తనకంటూ ప్రత్యేకమైన సహజ లక్షణాలను కలిగి ఉంటారు. అందుకే ఏ వ్యక్తినైనా దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకరి గురించి మనకు ఎంతగా తెలిసినా వారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఎవరి మనస్తత్వాల్లో వైవిద్యం ఎలా ఉన్నా కొందరికి మాత్రం కొన్ని గుణాలు కామన్ గా ఉంటాయి. ఆ స్వభావాలను బట్టి వ్యక్తులను కేటగిరీలుగా వర్గీకరించి వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ఎలా ప్రవర్తించాలో ఆచార్య చాణక్యుడు వేల యేళ్ల క్రితమే చాలా గొప్పగా చెప్పాడు. అవి ఇప్పటికీ ఏ హిప్నాటిస్టు చెప్పలేనంత కరెక్టుగానూ ఉన్నాయి. మనస్తత్వాలకు అనుగుణంగా స్వభావాలు ఏమిటంటే..

కోపిస్టులు:
ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి ఎదుట చాలా మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. అసలు ఎప్పుడూ వారితో కోపాన్ని ప్రదర్శించరాదు. దీంతో వారు ఆటోమేటిగ్గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు. దీంతో వారు మీ దారిలోకి వస్తారు.

మూర్ఖులు:
మూర్ఖపు స్వభావం ఉన్న వారిని దారిలోకి తెచ్చుకోవాలంటే ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలి. వారినే ఎల్లప్పుడూ స్తుతించాలి. దీంతో వారు ఆటోమేటిగ్గా మీ కంట్రోల్లోకి వస్తారు.

ప్రతిభావంతులు:
మన ఎదుటివారు మనకన్నా ప్రతిభావంతులైతే వారితో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడాలి. దీంతో వారు మనపట్ల ఆసక్తిని ప్రదర్శించి దారిలోకి వస్తారు.

ఇగోయిస్టులు:
బాగా ఇగో ఉన్నవారిని దారిలోకి తెచ్చుకోవాలంటే ఎల్లప్పుడూ మర్యాదగా ఉంటూ అదేవిధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమేటిగ్గా కనెక్టయి పోతారు.

పిల్లలు:
చిన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలతోనే లొంగదీసుకోవాలి. ఐదేళ్ల వయసు వచ్చే వరకు వారిని అమితమైన గారాబంగా, ప్రేమగా చూడాలి. ఇక పదేళ్ల వయసు వచ్చే వరకు వారితో ఎలాంటి దురుసు ప్రవర్తన చేయకూడదు. ఇక 16ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి వారితో స్నేహితుల్లా మెలగాలి.

క్లిష్టమైన పరిస్థితుల్లో:
పైన చెప్పిన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతోనే కాకుండా వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు సవివరంగా చెప్పాడు. ముఖ్యంగా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వీలైనంత ఓర్పుగా ఉండాలి. అదే మంచి ఫలితాలు ఇస్తుంది.

అసలు ఓ వ్యక్తి సహజ స్వభావాన్ని తెలుసుకోండి ఇలా..
ఓ వ్యక్తి సహజసిద్ధమైన స్వభావాన్ని తెలుసుకోవాలంటే అతని మాటలు, ప్రవర్తన ఆధారంగా దాన్ని నిర్ణయించాలి.
ఆచార్య చాణక్యుడు మానవులకు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఆచరించ తగిన నీతి సూత్రాలివే:
* ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం అత్యాశ, దురాశ, స్వార్థం వంటి అంశాలను కలిగి ఉన్న వారిని ఎన్నటికీ మార్చలేవట.
* ఎక్కడైతే మనకు మర్యాద, గౌరవం ఉండవో అక్కడ అస్సలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే డబ్బులు రాని దగ్గర కూడా ఉండకూడదట.
* నదులు, వైద్యులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నివసించాలట. అవే నివాసానికి సరైన స్థానాలట.
* ఎలాంటి గొడవలు లేకుండా మిక్కిలి ఆహారం, నీరు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ధనం దండిగా ఉంటుందట.
* సరస్సులో నీరు ఉన్నప్పుడు మాత్రమే వాటిలో ఉండి నీరులేనప్పుడు వాటిని విడిచిపెట్టే హంసల్లా మనుషులు జీవించాలట.
* మనుషులు తోటి వారికి సహాయం చేయకుండా ఉంటే అప్పుడు వారు బతికి ఉన్నా చచ్చిన వారితో సమానమేనట.
* విజయాన్ని ఎల్లప్పుడూ వెంటబెట్టుకుని తిరిగే వారిని ఆదర్శంగా తీసుకున్నా, అలాంటి వారి కథలు చదివినా దాంతో మనమూ స్పూర్తి పొంది విజయం సాధించవచ్చట.
* జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని కాదనకూడదట. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా..

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి