LATEST UPDATES

5, జులై 2018, గురువారం

మంచి మాటలు - నిర్వచనం - స్పష్టత

This is a simple translate button.

🌺నిర్వచనం    -    స్పష్టత 🌺

మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయితీ
రెండవది దార్శనికత.🌺

చెప్పింది చెయ్యడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్ధత
రెండవది పారదర్శకత.🌺

ఇతరుల మది గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం
రెండవది తత్వం.🌺

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం
రెండవది వివేకం.🌺

ఎలాగయినా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ
రెండవది నేర్పు.🌺

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరులకోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం
రెండవది నీడ వీడిన చైతన్యం🌺

గెలవడం వేరు
గెలిపించడం వేరు
మొదటిది నేను
రెండవది మేము.🌺

సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం
రెండవది చైతన్యం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి