LATEST UPDATES

1, జులై 2018, ఆదివారం

ఉత్తమ ఉపాధ్యాయుడు - అనుసరణీయ అంశాలు

This is a simple translate button.


*ఉత్తమ ఉపాధ్యాయుడు*
*ఉపాధ్యాయులు - అనుసరణీయ అంశాలు*
[సేకరణ, సమర్పణ : ఎం. ఎస్. ప్రకాశరావు.]
~~~~~~~~~~
*🙏 కృతజ్ఞతలు 🙏*
    _గుడ్ టీచర్, పాఠం చెప్పడం ఒక కళ, గుడ్ పేరెంట్, గుడ్ పేరెంట్ + బెటర్ టీచర్ = బెస్ట్ స్టూడెంట్ వంటి గొప్ప పుస్తకాలను రచించి విద్యారంగానికీ, ఉపాధ్యాయ వర్గానికీ, తల్లిదండ్రులకూ, విద్యార్థిలోకానికీ అపురూపమైన సేవలందించిన సన్మిత్రులు, సాయి సోదరులు డా. బి.వి. పట్టాభిరామ్, పి హెచ్.డి. గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు._
~~~~~~~~~~~~
*విద్య - నిర్వచనం*
_విద్యార్ధిలో గుప్తంగా ఉన్న సంపూర్ణతను సాకారం చేయడమే విద్య,_
~~~~~~~~~~~
*ఉపాధ్యాయుడొక శిల్పి*
• దేవాలయంలో ఉన్న రాళ్ళను శిల్పి తన శిల్పకళా కౌశలంతో దేవతా మూర్తులుగా మలచుతాడు.
• పాఠశాలే దేవాలయం.
• విద్యార్థులే రాళ్లు.
• ఉపాధ్యాయుడే శిల్పి.
• సంస్కరింపబడిన విద్యార్థులే దేవతామూర్తులు.
~~~~~~~~~~~~~~
*ఉపాధ్యాయుల్లో తరగతులు*
• సాధారణ ఉపాధ్యాయుడు - పాఠం చెబుతాడు.
• మంచి ఉపాధ్యాయుడు - పాఠాన్ని వివరిస్తాడు.
• ఉత్తమ ఉపాధ్యాయుడు - ఉదాహరణలతో బోధిస్తాడు.
• గొప్ప ఉపాధ్యాయుడు - ఉత్తేజపరుస్తాడు.
~~~~~~~~~~~
*ఆచార్య దేవో భవ అని ఎందుకన్నారంటే*
_గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు_
_గురుదేవో మహేశ్వరా_
_గురుపాక్షాత్ పరబ్రహ్మ_
_తస్మై శ్రీ గురవే నమః_
• లక్ష్యసిద్ధికి కట్టుబడినవాడు.
• ప్రత్యేకత కలవాడు.
• ఆదర్శప్రాయుడు.
• ఐకమత్యం సాధించేవాడు.
• మార్గదర్శి
• సరైన వైఖరి గలవాడు/
• సలహాదారుడు.
• సమ్మోహనుడు.
• ప్రేరకుడు.
• పరోపకారి.
~~~~~~~~~~~~~
*విద్యార్థులకు బోధించవలసిన విలువలు*
• మానవతావిలువలు.
• సామాజిక స్పృహ.
• పర్యావరణ పరిరక్షణ.
~~~~~~~~~~~~~~~~
*ఉపాధ్యాయుడు విద్యార్థులలో కలిగించ వలసిన వికాసం*
• శారీరక వికాసం
• సామాజిక వికాసం
• ఆలోచనా వికాసం
• భావ వికాసం
• ప్రవర్తనా వికాసం
• మేథో వికాసం
~~~~~~~~~~~~~~~~~~
*విద్యార్థికి అవసరమైన దిద్దుబాట్లు*
• వ్యక్తిగత దిద్దుబాటు
• శారీరక దిద్దుబాటు
• మానసిక దిద్దుబాటు
• సామాజిక దిద్దుబాటు
• వృత్తిలో దిద్దుబాటు
• ఆర్థిక దిద్దుబాటు
~~~~~~~~~~~~~~~~
*విద్యార్థుల్లో చిగురింపజేయవలసిన సద్గుణాలు*
• విశ్వాసం
• స్వాతంత్ర్యం
• స్వయంకృషి
• మంచి అలవాట్లు
• ప్రజ్ఞ
• అభిమానం
• క్రమశిక్షణ
• సంతృప్తి
~~~~~~~~~~~~~~~~~~~~
*ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణాలు*
• ప్రజ్ఞ
• సామర్థ్యం
• ప్రవర్తన
• సత్మీలం
• ఉత్తేజపరిచే బోధన
• ప్రావీణ్యము - ఫలితాలు
• వ్యక్తిగత సంబంధాలు
• విమర్శల స్వీకరణ
• ఆచారయోగ్యమైన సలహా
• ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సంసిద్ధత.
~~~~~~~~~~~~~
*ఉపాధ్యాయుల సాధన*
• గొప్ప ఉపాధ్యాయుల జీవిత చరిత్రలు చదవండి
• మంచి అభిరుచులు కలిగి ఉండండి.
• మీ బలహీనతలు విడిచి పెట్టండి.
• సమయాన్ని సద్వినియోగం చేయండి.
• సమయానికి తగిన సలహా ఇవ్వండి.
• నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొనండి.
• సలహాలివ్వడంలో మీ సమర్థతను పరీక్షించుకొండి.
• నిత్య విద్యార్థిగా ఉండండి. అధ్యయనానికి అంతంలేదు.
~~~~~~~~~~~~~~~~~
*ఉపాధ్యాయులకు ఇరవై మార్గదర్శకాలు*
1. పిల్లల్ని ప్రేమించండి.
2. పాఠం కథలా చెప్పండి.
3. శ్రీమంతులు, పేదవారన్న తేడాలు పరిగణించకండి.
4. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల్ని గౌరవించండి.
5. వారి అనుభవం నుండి నేర్చుకొండి.
6. మీ ఉద్యోగాన్ని నిజాయితీతో నిర్వహించండి.
7. మీ వృత్తిని అంకిత భావంతో చెయ్యండి.
8. వ్యసనాలకు దూరంగా ఉండండి.
9. వికలాంగులకు చేయూత నివ్వండి. వారిని చులకనగా చూడనివ్వకండి.
10. ప్రేమవ్యవహారాల్లో పడకండి.
11.  పాఠశాల ధనాన్ని అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
12.  మీ వ్యక్తిగత సమస్యల్ని ఇంటికే పరిమితం చేయండి. పాఠశాలకు తీసుకుపోకండి.
13.  దాన ధర్మాలు అలవాటు చేసుకోండి.
14.  విద్యార్థులకు, ఒక స్నేహితునిగా, తత్త్వవేత్తగా, మార్గదర్శిగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని వారు దైవంగా భావిస్తారు.
15. సాధారణ విద్యార్థికూడా సమర్థుడు కావొచ్చని గుర్తు పెట్టుకోండి.
16.  తాజా సమాచారంతో మీ విజ్ఞానానికి పదును పెట్టుకోండి.
17. సృజనాత్మకతను ప్రోత్సహించండి.
18.  సందేహం లేని ఆలోచన కలిగి ఉండండి.
19.  ఆత్మవిశ్వాసం కలిగి ఉండండీ
20.  ఉత్తేజపరచేలా బోధించండి.
~~~~~~~~~~~~~~~~~~~
*బోధనా ప్రణాళిక*
• తేదీ, సమయం
• బోధించవలసిన తరగతి
• పాఠం పేరు, పాఠం సారాంశం
• అడగవలసిన ప్రశ్నలు
• ఇవ్వవలసిన హెూమ్ వర్కు
• పాఠానికి అవసరమైన ఉదాహరణలు
• విద్యార్థుల స్థితి (గ్రామీణ/పట్టణ/నగర వాసులు)
• ఆరోజు బోధించవలసిన భాగం, వట్టే సమయం
• బోధన కవసరమైన సాధనాలు/ఉపకరణాలు, పటాలు, సైడులు, ఛార్టులు, బొమ్మలు, పరికరాలు మొదలగునవి.
• బోర్డు పై వ్రాయవలసిన విషయాలు, వేయవలసిన బొమ్మలు (ముందుగా అభ్యాసం చేయండి)
~~~~~~~~~~~~~~~~
*విజయానికి నాలుగు మెట్లు*
• ప్రణాళిక
• పరిశ్రమ
• అభ్యాసం
• ప్రదర్శన
~~~~~~~~~~~~~~~~~~
*ప్రతిభకు ఇరవైయ్యొక్క సోపానాలు*
1• స్పష్టత కలిగి, అర్థమయ్యే భాష
2• చక్కని ఉచ్చారణ
3• తోటి ఉపాధ్యాయుల పై గౌరవం
4• వారితో సౌమ్యంగా సంభాషించడం
5• విద్యార్థి అభివృద్ధిని వారి తల్లిదండ్రులతో చర్చించడం
6• అందరి అభిమానాన్ని చూరగొనడం
7• భావావేశం పై నియంత్రణ కలిగి ఉండడం
8• అత్యాధునిక వస్త్రాలు ధరించకండి
9• ఆత్మవిశ్వాసం మీ ఆయుధం
10• వికలాంగుల్ని ప్రేమించండి
11• పిల్లల్ని ప్రేమగా పేరుతో పిలవండి
12• విద్యార్థుల్ని చిరునవ్వుతో పలకరించండి
13• ఇతర ఉపాధ్యాయుల్ని పరిహసించకండి.
14• సృజనాత్మకతని ప్రోత్సహించి పెంచండి.
15• మీకన్నా పెద్దవారిని గౌరవించండి
16• సమయపాలన ఖచ్చితంగా పాటించండి
17• ఎప్పుడూ ఒకే విద్యార్థిని పొగడకండి
18• వ్యంగ్య ధోరణి మంచిది కాదు
19• పిల్లల్ని నిందించకండి
20• పిల్లల్ని దుర్మార్గులతో పోల్చకండి
21• తప్పు ఒప్పుకున్న విద్యార్థిని మెచ్చుకోండి.
~~~~~~~~~~~~~~~~
*ఉపాధ్యాయుని ధర్మాలు*
• పాఠం చెప్పడానికి ముందుగానే సిద్ధంగా ఉండండి
• పిల్లలకర్ధమయ్యేలా బోధించండి • పిల్లల తప్పుల్ని ఓర్పుతో వివరించండి
• కుతూహలం రేకెత్తించే అద్భుతమైన కథలు చెప్పండి
• చక్కని పఠనా ప్రణాళిక నిచ్చి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించండి
• వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించండి
• లలితకళలలో ప్రతిభగల విద్యార్థుల ప్రజ్ఞను మెచ్చుకొని ప్రోత్సహించండి
• అరచి, శిక్షించి క్రమశిక్షణ అమలు చెయ్యగలమని భావించకండి
• మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి వంటి మానవతావిలువలను చిగురింప జేయండ
• క్లిష్టమైన ప్రశ్నలు వేస్తే చిరునవ్వుతో పాఠం ముగించి, బాగా అధ్యయనం చేసి మరునాడు సమాధానాలు చెప్పండి.
~~~~~~~~~~~~~~~~~~~~
*బోధన సార్థకం కావడానికి పద్దెనిమిది సూత్రాలు*
1• బోధనకు చక్కని బోధనా ప్రణాళిక రూపొందించుకోండి
2• పాఠం బోధించాలనే ధృఢ సంకల్పం కలిగి ఉండండి
3• వినాలనే ఉత్సుకతను రేకెత్తించేలా బోధించండి
4• బోధనకవసరమైన సాధనాలు సమకూర్చుకోండి
5• సమయానికి సరిగ్గా పాఠం మొదలు పెట్టండి
6• చక్కని శరీరభాషపై దృష్టి సారించండి
7• ప్రశ్నలు వేసేలా విద్యార్థుల్ని ప్రోత్సహించండి
8• సునిశితమైన హాస్యం జోడించండి .
9• క్రమశిక్షణ కలిగి ఉండండి.
10• విద్యార్థులు చెప్పింది శ్రద్దగా వినండి
11• అనవసరము/అప్రస్తుతము అయిన విషయాల పై ప్రసంగించకండి
12• కుల, మతాలను ప్రస్తావించకండి
13• కోపం ప్రదర్శించక అదుపులో పెట్టుకోండి
14• అందరు విద్యార్ధుల్నీ ఒకేలా చూడండి
15• ఎవ్వరి పైనా ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించకండి
16• చిరునవ్వులు చిందిస్తూ ఉండండి
17• సరిగ్గా సమయానికి పాఠం పూర్తి చేయండి
18• స్వోత్కర, ఆడంబరాలు ప్రదర్శించకండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
వైఖరిలో పరివర్తనకు పది నియమాలు*
1• బోధన పై ఏకాగ్రత కలిగి ఉండండి
2• మీరు బోధించే విషయం పై తాజా పుస్తకాలు, ప్రచురణలు చదవండి
3• ఎవ్వరితోనూ వాదించకండి, వాదన సాధనకు పనికిరాదు
4• మీ సంభాషణా మెలకువల్ని అభివృద్ధిపరుచుకోండి
5• సందేహంలేని ఆలోచనలు కలిగి ఉండండి
6• ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినండి
7• ఆశావాదిగా ఉండండి
8• సమాజ సేవ చెయ్యండి
9• బదిలీని ఆహ్వానించండి
10• మీ భావావేశాన్ని నియంత్రించుకోండి.
~~~~~~~~~~~~~~~~~~~
*మీ బోధనను అంచనా వేసుకోండి*
1. విషయం : నేను బోధిస్తున్న విషయాన్ని సరిగ్గా బోధించగలిగానా?
2. పద్దతి : నేను బోధించిన పద్ధతి బాగుందా? చూపించవలసిన బొమ్మలు, సైడ్లు, ఛార్డులు చూపించానా?
3. నిర్వహణ: నాకిచ్చిన సమయంలో బోధించ గలిగానా?
4. సాధనాలు : సరియైన సాధనాలు ఉపయోగించానా?
5. క్రమశిక్షణ : క్రమశిక్షణ అమలు చెయ్యగలిగానా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సంభాషణా చతురతకు ఎనిమిది చిట్కాలు*
1• చిరునవ్వు చిందించండి
2• అర్థం చేసుకోండి
3• శరీరభాషపై దృష్టి పెట్టండి
4• క్లుప్తంగా, మధురంగా మాట్లాడండి
5• శబ్ద నియంత్రణ కలిగి ఉండండి
6• ప్రభావశీలమైన పదాలు ప్రయోగించండి
7• విశ్వసనీయత కలిగి ఉండండి
8• మర్యాద, మన్నన పాటించండి.
~~~~~~~~~~~~~~~~~
*ప్రేరణకు 18 సూత్రాలు*
1• మీ బలహీనతల్ని తెలుసుకొని సరిదిద్దుకోండి
2• విద్యార్థుల అవసరాల్ని గమనించండి
3• ఒక స్నేహితుడిగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకొని అర్థం చేసుకోండి,
4• విద్యార్థుల్ని భయ పెట్టి ఉత్తేజపరచలేరు
5• మృదుమధురమైన మాటలతోనే వారిలో ప్రేరణ కలిగించగలరు.
6• విద్యార్థులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అందుచేత వారికి ప్రేరణ కలిగించే విధానంకూడా వేరుగా ఉండాలి.
7• విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనండి
8• విద్యార్థులకీ, తల్లిదండ్రులకీ చదువు వలన వచ్చే లాభాల్నీ, విద్య పరమార్థాన్నీ వివరించండి.
9• పేదకుటుంబంలో పుట్టి అఖండ విజయాలు సాధించిన విద్యార్థుల కథలు చెప్పండి
10• గొప్ప విజయాలు సాధించిన విద్యార్థుల ఫోటోలను నోటీసు బోర్డులో పెట్టి విద్యార్థులకు వారి విజయాలను వివరించండి.
11• పజిల్స్, క్విజ్, చిత్రవిచిత్రమైన సమస్యలలో పోటీలు నిర్వహించి విద్యార్థులలో సృజనాత్మకతను పెంచండి.
12• ఏదో ఒక కారణంతో తరగతిలో ప్రతి విద్యార్థినీ అభినందించండి.
13• నీటి బిందువులాంటి విద్యార్థిని ముత్యంగా మార్చగల ముత్యపుచిప్ప మీరని గ్రహించండి. పేద విద్యార్థుల పట్ల సానుభూతి చూపండి.
14• అపకీర్తి పొందిన వ్యక్తులు తాత్కాలికంగా విజయం సాధించ వచ్చు, గౌరవం పొందవచ్చు. కాని అది తాత్కాలికమేననీ ఏదో ఒకరోజున తమ తప్పులకు వారు పరిహారం చెల్లించవలసి ఉంటుందనీ విద్యార్థులకు చెప్పండి.
15• నీతి నిజాయితీలు, సత్ప్రవర్తన కలవారు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని చెప్పండి.
16• మీ శరీరభాష, మాట, చిరునవ్వు ఇతరులను ఉత్తేజపరచగలవని మరచిపోకండి.
17• మీరు కలిగించే ప్రేరణకి విద్యార్థుల విజయాలే కొలమానాలు.
18• అపజయాలకు మూలకారణం సోమరితనం, వాయిదావెయ్యడం అని మనస్సుకు హత్తుకునేలా చెప్పి వారిలో చదువు పట్ల శ్రద్ధాసక్తులు పెంచండి.
~~~~~~~~~~~~~~~~
*శరీరభాష సవరించుకోవడానికి నవ సూత్ర  ప్రణాళిక*
1. గౌరవప్రదమైన దుస్తులు ధరించండి. దుస్తులు మీ మాన మర్యాదలు కాపాడడానికీ, గౌరవం పెంచడానికి గాని, ఆడంబర ప్రదర్శనకు, అంగాంగ ప్రదర్శనకూ కాదు.
2. త్రేన్చక తప్పలేదా? సారీ చెప్పండి.
3. గోక్కోకండి. చూడడానికి బాగుండదు.
4. టై కట్టుకుంటే మాటిమాటికీ సవరించుకోకండి.
5. క్లాను చెబుతున్నప్పుడు ఆవలించకండి.
6. చెవులోనూ, ముక్కులోనూ వేళ్ళు పెట్టుకోకండి.
7. దగ్గొస్తోందా? మీ రుమాలు నోటికి అడ్డం పెట్టుకోండి.
8. కాలుమీద కాలు వేసుకొని కూర్చోకండి, అది అహంకారానికి చిహ్నం.
9. విద్యార్థులు వేసే కొన్ని అర్థంలేని ప్రశ్నలకు కూడా నవ్వుతూ సమాధానం చెప్పండి. తప్పదుమరి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
PUSH-"కళ"
P - Practice
U - Until
S - Success
H - Happens
*విజయం సాధించే వరకు అభ్యాసం చేయండి.*
~~~~~~~~~~~~~~~~~~
*విద్యార్థుల్లో సమగ్రవిజయం ఉపాధ్యాయుని ప్రతిభకు ప్రతిబింబం.*
~~~~~~~~~~~~~~~~
*_శ్రద్ధతో విన్నందుకు ధన్యవాదాలు_*
*_గురుదేవో  భవ!_*
*ప్రార్థన*
_సర్వేశ్వరుడు మీ అందరినీ ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలని నా ప్రార్థన.._
====🙏==THE END==🙏=====

1 కామెంట్‌:

  1. బోధించడానికి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ప్రేరేపించబడకూడదా? అప్పుడు బాహ్య ప్రేరణ ఎందుకు? దానిపై మీ ఆలోచనలు ఏమిటి?

    రిప్లయితొలగించండి