బోలో.. వెబ్బు మాతాకీ..జై
(ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్)
కృపజూడు తల్లీ!...
గూగుల్ కల్పవల్లీ!...
మంచి బడి నిచ్చీ...
సల్లగ నేలు తల్లీ!...
బహుదగ్గరి చోటులు,
ఖమ్మం పక్క ప్లేసులు,
హాట్ హాటైన కేకులు,
ఆటోలున్న ప్లేసులు...
మాకిచ్చి నీకరుణ ...
సూపించు తల్లీ!...
అహో. *వెబ్బు* మాత.!
ఇదే నీకు జోత!
మాపైన నీ వింత
జాలిని జూపు సుంత...
మహా తెలివైన పిల్లలూ,
ఏకసంతా గ్రాహులూ,
ఒకసారి బోధనకే...
నికరంగా నేర్చువారు,
కంఠ శోష లేకనే....
కంఠత బట్టు వారు...
విద్యార్థులై ఉన్నట్టి
విద్యాలయమిమ్మా...
ఓహో.. వెబ్బు కొమ్మా!
నీకో దండమమ్మా...
నీ వలనుండి మమ్ము
ఆవల జేర్చవమ్మా!...
లీస్ట్ రాంకైన గానీ...
రోడ్డు పాయింటు నిమ్మా...
పాయింట్లు తక్కువైనా
బస్ పాయింటు నిమ్మా!
మా పూజ గొమ్మా!
మంచి స్టాఫు నిమ్మా!
గొడవలకు నింక
పులిస్టాపు నిమ్మా!
కష్టం చెయ్యనోళ్లు,
కయ్యం బెట్టువారూ...
ఊదరగొట్టు వారూ,
ఉట్టెక్కించు వారూ....
ముచ్చుల వంటి వారూ,
మూకీ సైగ వారూ,....
లాంగ్ సెలవు లోళ్ళూ,
మెడికల్లీవులోళ్ళూ...
మాకు స్టాఫవకుండా మముగాయమమ్మా!
తల్లీ వెబ్బు... రాణీ!
ఇదే పూజ బోణీ!
అష్టవర్షాలు నినుగొల్చి
ఆరాధింతుమమ్మా!
జై వెబ్ మాతాకీ.....
బై పాత స్కూళ్ళకీ.....
అర్ధాలు::
*సుంత-కొంత
*జోత- నమస్కృతి
*అష్ట వర్షాలు-ఎనిమిది సంవత్సరాలు.
కవిత్వం కేవలం నవ్వుకొనుటకూ,.... సాహిత్యసౌరభాన్ని నలుగురకూ పంచుటకు మాత్రమే గానీ, వ్యక్తిగతంగా ఎవ్వరినీ,ఏ పాఠశాలనూ ఉద్దేశించినది కాదని వినయపూర్వక మనవి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి