1.“స్లేట్ ది స్కూల్స్”కి ఛైర్మన్‌గా ఉన్న విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తలిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీడియా ఇలాంటి వాటిని విడిచి అక్కర్లేని విషయాలను రుద్దుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ సంఘటనలను ప్రమాద ఘంటికలుగా ప్రతి పేరెంట్ గుర్తించాలి.
కాలనీ, అపార్ట్‌మెంట్, టీచర్స్ అసోషియేషన్లలో కూడా తమ పిల్లలు ఇలా అవకుండా తామేం చేయగలమో మాట్లాడుకోవాలి.
ఇంతకీ అమర్‌నాథ్ గారు ఆందోళన వ్యక్తం చేసిన సీరియస్ పరిణామాలు ఇవే.
వాసిరెడ్డి అమర్‌నాథ్ పోస్టు యథాతథంగా:
ఒక్కసారి ఆలోచించండి !
రెండు నెలల క్రితం ఢిల్లీ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 2వ తరగతి పిల్లాడిని అదే స్కూల్ కు చెందిన 11 తరగతి అబ్బాయి స్కూల్ టాయిలెట్‌లో చంపేశాడు.
కారణం?
స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు పోస్ట్ పోన్ అవుతాయి అని.
ఏమండీ 16 ఏళ్ళ పిల్లాడికి 7 ఏళ్ళ పిల్లాడిని చంపాలని ఆలోచన రావడమేంటి ?
అందులో ఏదో ఆవేశంతో తోస్తే కింద పడి చనిపోయిన బాపతు కాదు కదా?
మీరు భయ పడకండి.
ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి.
నేనే ఏదోకటి చేస్తాను అని ఆ బాల రాక్షసుడు రెండు రోజల ముందు నుంచి క్లాస్ మేట్స్ కు చెప్పాడు .
స్కూల్ కు కత్తి తెచ్చి ప్లాన్ చేసి చంపేశాడు.
టెర్రరిస్ట్‌లు కూడా ఇంత చిన్న కారణానికి అందునా పసి పిల్లని చంపడానికి వెనకాడుతారు.
కానీ ఒక స్కూల్ పిల్లాడు ఇలా చేసాడు అంటే కారణం ఏంటి అని ఎవరు పెద్దగా ఆలోచించలేదు.
ఒకే ఒక్క రోజు అది బ్రేకింగ్ వార్త అయ్యింది.
అమ్మా! ఢిల్లీలో పిల్లలు ఇలా వుంటారా అని అని కాసేపు క్రైమ్ సీరియల్ చూసినట్టు అందరూ ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడితో వదిలేసారు.
సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు లక్నోలోని బ్రైట్ ల్యాండ్ స్కూల్‌లో జరిగింది.
ఇక్కడ ఒకటో క్లాస్ అబ్బాయి ని అదే స్కూల్ కు చెందిన ఆరవ క్లాస్ అమ్మాయి పొడిచింది.
అవునండీ..
ఆరవ క్లాస్, పొడిచింది కూడా అమ్మాయే
. మీరు సరిగ్గానే చదివారు.
ఇదేదో ఎక్కడో జరిగిన ఒకటి అరా సంఘటనలు కావు.
ఇందాకే ఒక టీవీ డిస్కషన్ బ్రేక్ లో ఒక వ్యక్తి చెప్పారు.
రంగారెడ్డి జిల్లా లో ఒక ప్రభుత్వ స్కూల్ కు చెందిన ఆరవ తరగతి అబ్బాయి తన స్కూల్ మేట్స్ ను మోసం చేసి రూ.35 వేలు పోగేశాడట.
అమ్మ నాన్నకు తెలియకుండా మిమ్మల్ని టూర్ కు తీస్కొని వెళతాను అని చెప్పాడట.
చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడట!
పిల్లలలో ఇంత క్రిమినల్ మనస్తత్వం ఎందుకు పెరుగుతోంది.
గత కొన్ని నెలలుగా నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నా…
అయ్యా పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసారు.
వారు అందులో అతి భయానక దృశ్యాలు ఉన్నా వీడియో గేమ్స్ ఆడుతున్నారు.
గత కాలం పిల్లలు కబాడీ, ఖోఖో లాంటి గేమ్స్ ఆడితే ఇప్పటి పిల్లలు చంపడం ఒక ఆటగా తయారు అయ్యింది.
అమ్మలకేమో టీవీలో సీరియళ్ళు పిచ్చి.
నాన్నలకు చెత్త రాజకీయాల పిచ్చి.
టీవీలకు సంచలన వార్తలు కావాలి.
పిల్లలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా?
బాలల లోకాన్ని ఎప్పుడో కల్మషం చేసేసారు.
ఇప్పుడు ఇప్పుడు వారిని మనం టెర్రరిస్ట్‌లుగా తయారు చేస్తున్నాం.
ఇంటి ఇంటిలో ఒక టెర్రరిస్ట్ తయారు అవుతున్నాడు.
మీడియా పట్టించుకోదు.
ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు.
మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి.
నీలి చిత్రాలు, హింసాత్మక వీడియో గేమ్స్, మద్యపానం, ధూమపానం, ఇవన్నీ ఆధునిక రోగాలు.
వీటిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేసే దోమ స్మార్ట్ ఫోన్.
స్మార్ట్ ఫోన్‌ను మీ పిల్లలకు దూరంగా ఉంచండి.
ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేయించండి.
దానిపై చైల్డ్ లాక్ లాంటి ఫీచర్స్ ఇన్‌స్టాల్ చెయ్యండి.
పిల్లని ఒక కంట కనిపెట్టండి.
పిల్లలతో సమయం గడపండి.
వారితో మాట్లాడండి.
వారు చెప్పేది వినండి.
కేవలం ధనాపేక్షే ద్యేయంగా కాక పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పే స్కూల్స్‌లో వారిని చేర్పించండి.
మన పిల్లని రక్షించుకొందాం. లేక పొతే మనం సర్వనాశనం అయిపోతాం.
నా బాధను నలుగురితో పంచుకోండి.
ఈ విషయాన్నీ తల్లి తండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి
మీ పిల్లల భవిషత్ కు బంగారు బాటలు వేయండి
2 ఎక్కడకు వెళ్తున్నారు ఆంటీ..?
మా బాబును చూడటానికి Hostel వెళ్తున్న.
బాబు ఏం చదువుతున్నాడు.?
1 వ తరగతి
మీ వారు ఏం చేస్తుంటారు.?
Contractor (Govt) job చేస్తున్నారు.
మరి మీరేం job చేస్తున్నారు..?
Job ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.
మరీ పిల్లాడిని hostel ల్లో...?
అంటే ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైందిలే.
ఓహో...
ఆరేళ్ళ పిల్లాడు కాకుండా ముప్పై ఏళ్ల నీ మొగుడు చేస్తాడా అల్లరి (మనసులో)
మీకు తెలియని విషయం ఏంటంటే..
పిల్లాడు hostelల్లో ఉన్నంత కాలం
వాడికి
అమ్మంటే ఓ ఆయా..
నాన్నంటే డబ్బులిచ్చే Atm.. అంతే
అలా పెంచిన మీరు
రేపొద్దున్న వాడికి ముపై
మీకో అరవై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది.
అప్పుడు
మా కొడుకు మమ్మల్ని
old age home లో పడేశాడు అని ఏడవడానికి సిగ్గుపడాలి.
పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి
15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి
25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి
మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.
అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి.ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే...? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.
అసలేం జరుగుతుంది మన దేశంలో..?
విద్యాసంస్ధలేమో లాబాల కోసం
ఉపాధ్యాయులేమో జీతాల కోసం
తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు
తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి
పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.
బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..
అది కాస్తా తలుపులు వేసుకొని
బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.
మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.
గుర్తుంచుకోండి..
" మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు
సమాజాన్ని తీర్చిదిద్దే
రేపటి తరాన్ని.."
అది మర్చి పోవద్దు...
వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు .
ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు...
మీ శ్రేయోభిలాషి..........
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి