LATEST UPDATES

1, జులై 2018, ఆదివారం

*స్కిప్ చెయ్యకుండా మొత్తం చదవండి ఫ్రెండ్స్ - వాట్సాప్ మెస్సజ్ ల గురించి

*స్కిప్ చెయ్యకుండా మొత్తం చదవండి ఫ్రెండ్స్ - వాట్సాప్ మెస్సజ్ గురించి

   ఎవరో ఓ అమ్మాయి ఫొటోలు ఇంటర్నెట్
లో తీసుకొని ఆ అమ్మాయి కి బ్రైయిన్
కాన్సర్ అని , ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే
వాట్స్ అప్ , ఫేస్ బుక్ రూపాయి,
రూపాయి చొప్పున ఇస్తారని ఎవరో
పోస్ట్ పెడితే మనసు కరిగి పోయి
తన మెంబరుగా ఉన్న అన్ని గ్రూపులకు
మెసేజ్ లు పంపిన పాపానికి ఆ గ్రూపు
ఎడ్మిన్ , అతడు కోర్టు పాలు కావలసి
వచ్చింది. ఆ ఫోటోలు గల అమ్మాయి
హైకోర్టులో పరువు నష్టం క్రింద తన
ఫొటోలు పోస్టు చేసిన వారి పైన ,ఇంకా
ఆ మెసేజ్ ఎవరు ఎవరు ఫార్వర్డ్
చేసారో వారిపైన *10లక్షల చెప్పున్న*
దావ వేసింది. దానితో ఆ మెసేజ్

పంపిన వాళ్ళు ,దానిని ఫార్వర్డ్
చేసిన వాళ్ళు
( *మొత్తం 258 మంది కి కోర్టు*
*సమన్లు అందాయి.* )
గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

*అందుకే దొరికిన ప్రతీ మెసేజ్ ఫార్వర్డ్ చేయకండి.ఫలితంఇలానే ఉంటుంది.*

*అలాగే👇🏼*

🎍 *స్పిన్ వీల్ అని*

🎄 *పది మందికి ఏదో ఓ మెసేజ్ పంపితే ఎంతో కొంత రీచార్జ్ అవుతుందని*

🎍 *25 రూపాయలకే పెన్ డ్రైవ్ వస్తుందని*

🎄 *499రూపాయలకే 10000వేల రూపాయలకు పోన్ వస్తుందని*
మెసేజ్ కదా ఏం పోతుందిలే అని
ఇతరులకు పెట్టకండి. ఇవన్నీ
*సైబర్ నేరాల* క్రిందే వస్తాయి.

👉 ఈ మెసేజీ పది మందికి పంపమని లేదా మీకు చెడు జరుగుతుందనేవి దేవుని పేర సెంటిమెంట్ మేసేజిలు పంపకండి.
*వాట్స్ అప్ మెసేజస్ లో*
*నిజాలతో పాటు*
*అబద్దాలు కూడా*
*చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి.*

👉 వార్త వాస్తవమా కాదా
అని పరిశోధించే టైం లేక
అమాయకంగా అబద్దాలను
నిజాలుగా భావించి
ఫార్వార్డ్  చేయటం జరుగుతోంది.
అందువల్ల
*రెండు ప్రమాదాలు...*
ఒకటి వార్తలోని వ్యక్తి
"అభాసు"పాలు కావడం.
రెండు వార్తను చదివేవాళ్ళు
"ఫూల్స్" కావడం.

ఉదాహరణకు "రెండు/అయిదు/ఏడు తలల పాము ఫోటో,
మనిషిని మింగిన అనకొండ",
"ఒకే కాన్పులో 11 మంది బిడ్డలు",
"అతి పెద్ద అస్థిపంజరం", లాంటివి.కొన్ని అయితే....

👉 ఈ మెసేజ్ ను పంపితే ఫ్రీ,
ఫలానా వాళ్లకు ఫలానా  రోగం
మీరు ఈ మెసేజ్ ను
ఫార్వర్డ్ చేస్తే 10 పైసల లెక్కన డబ్బులు వస్తాయి.

👉ఈ ఫోటో లో వ్యక్తి దొంగ జాగ్రతగా ఉండండి.
లేదా పోలీసులకు పట్టి ఇవ్వండి.

👉ఫలానా హాస్పిటల్ లో ఉచిత వైద్యం... ( *కనీసం ఫార్వర్డ్ చేసే ముందు ఆ మెసేజ్ లో ఇచ్చిన నంబర్లకి ఫోన్ చేసి చూడండి ఒక్క నంబరూ పనిచేయదు.* )

👉 *ఈ మెసేజ్ పంపితే*
*బ్యాటరీ 100% చార్జింగ్.... ఇలా ఎన్నో వందల వార్తలు ఫార్వర్డ్ అవుతూనే వున్నాయి.*

క్రాస్ చెక్ చేసుకునే
టైం లేక ఆ వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి .
కనుక వెంటనే అతి త్వరగా ఫార్వర్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల ఇంకొంత మంది ఫూల్స్ అవుతున్నారు.

"దయచేసి కొంచం హేతుబద్దంగా" మనం ఆలోచించాలి.
"శాస్త్రీయంగా" విశ్లేషించాలి. వార్తలో *నిజానిజాలు అంచనా వేయాలి.* తరువాతే ఫార్వర్డ్ చేయాలి.

మనం అందరం చదువుకున్న వాళ్ళం .
లోక జ్ఞానం తెలిసిన వాళ్ళం.

ఇక మీద అందరు సభ్యులం ఒకటికి రెండు సార్లు ఆలోచించి
మెసేజస్ ఫార్వర్డ్ చేద్దాం.

మ‌న‌కు స‌మ‌వ‌ర్త‌న‌ము,
తార్కిక‌ ఆలోచ‌న‌,
శాస్త్రీయ‌ దృక్ప‌థ‌ము,
స‌మ‌య‌స్పూర్థి అవ‌స‌ర‌మైన‌ ల‌క్ష‌ణాలు.

1  ఒక‌ దేవుని పొటోను పోస్ట్ చేసి ఇత‌రులుకు/గ్రూపుల‌కు పంపాల‌ని ..
పంపితే శుభ‌వార్త‌,పంప‌క‌పోతే దుర్వార్త‌ వింటార‌ని బ్లాక్ మేయిల్ చేస్తాడు.

2 ఒక‌ బ్ల‌ర్ పోటో ఉంటుంది..దాన్ని గ్రూపుల‌కు పంపాల‌ని..
మ్యాజిక్ చూడండి  అంటాడు.

3 ఒక‌ మెస్సేజ్ ...రెండు గ్రూపుల‌కు పంపిస్తే బ్యాట‌రీ రీచార్జ్ అవుతుంద‌ని... ఒక‌ స్టూడెంట్ త‌యారు చేసాడ‌ని.. వివ‌రాలుంటాయి..

4 ఒక‌ పోలీసు ఒక‌ పాప‌ను ఎత్తుకుని రైల్వేప్లాట్ ఫాం పై ఉన్న‌ పోటో... ఈ పాప‌ త‌ప్పిపోయింది.
..ఫార్వ‌ర్డ్ చేయ‌మ‌ని..
*డేట్ - ప్లేస్ ఉండదు ఆ పాప ఈ పాటికి ఇంట్లో ఉండి ఉంటుంది.*

5 వాట్స‌ప్ డిలీట్ చేస్తే ఏదో కంపెనీ వాడు మ‌న‌ అకౌంట్లో డ‌బ్బులు వేస్తాడ‌ని...

6 న‌రెంద్ర‌మోదీ గారు..హైక్ వారి మెసెంజ‌ర్ వాడితే మ‌న‌కు డ‌బ్బులు ఇస్తాడ‌ని... బాలన్స్ వేస్తారని...

విదేశీ వ‌స్తువులు 120 రోజులు కొన‌క‌పోతే మ‌న‌దేశం ప్ర‌పంచ‌ములోనే ధ‌నిక‌ దేశం అవుతుంద‌ని..
మన జాతీయ గీతాన్ని యునెస్కో ఉత్తమ జాతీయ గీతం గా ఎంపిక చేసిందని..
రేపటి నుంచి వాట్సాప్ పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని....ప్రధాని, కేంద్రంపై వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే జైలు తప్పదని. ....ఈ లింకు క్లిక్ చేస్తే  వాట్సాప్ కలర్లో వస్తుందని.....

గ్రూపుల్లో ఇలాంటి సందేశాలు..,
క‌నీస‌ సామాజిక‌ స్పృహ‌ లేని ఇలాంటి వార్త‌ల‌ను మ‌న‌ము మోస్తూ...
ఇత‌రుల‌కు చేర్చుతున్నాము..
ఆలోచించండి...

*దయచేసి ఉపయోగపడేవి మాత్రమే గ్రూప్ లో పంచుకోండి/ షేర్ చేయండి. మంచి విషయాలు పంచుకుందాం.*
*గ్రూపు యెక్క విలువ పెంచుకున్దాము .*
మనకి ఉపయోగపడే సమాచారాన్ని మాత్రము పంపుకుందాము
మీ  శ్రేయోభిలాషి......✍

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి