LATEST UPDATES

4, జులై 2018, బుధవారం

పెత్తనం చేస్తూ పనిచెయ్యని వారిదే రాజ్యం - కష్టపడి పని చేసేవాడు ఎప్పుడూ బాధితుడే

🐜 *ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది..*
*ఆడుతూ పాడుతూ పని చేసిది..*
*అది పని చేసే చోట మంచి ఉత్పత్తి (result)వచ్చేది.*

*సీఈఓ సింహం🦁 రోజూ చీమని🐜 చూసి సంతోసించేవాడు.*

*ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు..*

*చీమ🐜 దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంకా ఎంత బాగా చేస్తుందో అని.*

*ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గా నియమించాడు.*

*బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండెన్స్ లు ప్రవేశ పెట్టింది..*

*వీటన్నిటిని చూసుకోవడానికి ఒక సాలీడు🕷 ని సెక్రటరీ గా నియమించుకుంది.*

*సింహం🦁 గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు..*

*ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని 🐝నియమించింది.*

*మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ🐜 నీరసించడం మొదలు పెట్టింది..*

*అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు,  ఎప్పటికప్పుడు అందచేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి.*.

*ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్, వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి..*

*క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది..*

*ఉత్పత్తి(result)పడిపోయింది*

*సిఈఓ సింహం🦁 గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ🦉 కి అప్పగించారు..*

*ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ🦉 గారు ఆఫీసు స్థితిగతులని అద్యయనం చేసి, అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు..*

*వెంటనే సింహం🦁 ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని🐜 పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి..*
.
*This is the style of present administration every where*

*నీతి: పెత్తనం చేస్తూ పనిచెయ్యని వారిదే రాజ్యం*
*కష్టపడి పని చేసేవాడు ఎప్పుడూ బాధితుడే.*.            

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి