ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?
జవాబు :
చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి. ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి