కథ - రాజు-ప్రజలు
రాజు గొప్పవాడుగా కీర్తిని పొందగలుగు తున్నాడు.నిజానికి ఆ రాజ్యంలో అరాచకం నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న తరుణంలో ప్రజలకు అన్నీ పోయి కేవలం ఒక 'గోచిపేగు' మాత్రమే మిగిలింది. ఇది భరించలేక ప్రజలంతా కలిసి రాజుగారి దగ్గరకు వెళ్లి మాకు చాలాకష్టంగా ఉంది. కావున మాకు కొన్ని బట్టలు ఇప్పించండి.మా మానాలు కాపాడుకోవడానికి లేకపోతే మేము ఏ పని చేయలేమని రాజభవనం ముందు కూర్చున్నారు.
దాంతో రాజుగారికి ఒక ఉపాయం తట్టింది.
వెంటనే సైనికులను పిలిచి ప్రజల దగ్గరున్న 'గోచిపేగులు'మొత్తం లాక్కొని రండి అన్నాడు. సైనికులు ప్రజల 'గోచిపేగులు'లాగడంతో ప్రజలు లబోదిబో అంటూ
అయ్యా రాజుగారూ " మీరు మరిన్ని బట్టలు ఇవ్వకపోయినా మంచిదే. కానీ 'మాగోచిపేగులు'మాకు ఇప్పించండి చాలు" అనడంతో
రాజు వికటాట్టహాసం చేస్తూ నా ముందే కుప్పిగంతులా మీరు ఇకముందు ఏమీ అడగనంటేనే 'మీగోచిపేగులు'మీకు ఇస్తా ఖబర్ధార్ అన్నాడు. సరే రాజుగారు అంటూ గోచిపేగులు తీసుకొని ఎటోల్లటే వెళ్ళిపోయారు పాపం ప్రజలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి