ప్రశ్న:చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?
జవాబు:
చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి