LATEST UPDATES

5, జులై 2018, గురువారం

పూటగడవని పేదరికం ౼ నిజాయితీ మాత్రం సుసంపన్నం!

సుధామూర్తి చెప్పిన హనుమంతప్ప కథ!

పూటగడవని పేదరికం ౼ నిజాయితీ మాత్రం సుసంపన్నం!........

అతి నిరుపేద బాలుడి చదువుకోసం ఆర్ధికసాయం చేసే క్రమంలో ‘ఇన్ఫోసిస్‌’ వ్యవస్థాపకుడి భార్య సుధామూర్తికి ఎదురైన ఓ అరుదైన అనుభవమిది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన ఆ కుర్రాడి నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఓ ఘటనను...స్వీయ అనుభవాన్ని సుధామూర్తి తన తాజా పుస్తకం ‘హియర్‌...దేర్‌...అండ్‌ ఎవ్విరివేర్‌’లో కళ్లకు కట్టారు.....

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రామపురకు చెందిన కుర్రాడు హనుమంతప్ప తండ్రి దినసరి కూలీ. రోజుకు తండ్రికి వచ్చే నలభైరూపాయలతోనే ఆ కుటుంబం గడవాలి. అయిదుగురు సంతానం...భార్యాభర్తలు ఆ డబ్బుతోనే పొట్ట నింపుకోవాలి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే హనుమంతప్ప పదోతరగతి బోర్డు పరీక్షల్లో ఎనిమిదో ర్యాంకు సాధించాడు. పోషణలేని శరీరంతో పీలగా...పేలవంగా ఉన్న హనుమంతప్ప ఫొటోను వార్తాపత్రికల్లో చూసిన సుధామూర్తి అతడి ఉన్నత చదువులకు సాయం చేయాలని సంకల్పించారు. బెంగళూరులోని తన కార్యాలయానికి పిలిపించారు. ఎక్కడ చదువుకోవాలనుకున్నా ఖర్చంతా తానే భరిస్తానని హనుమంతప్పకు చెప్పారు.....

కాగా అతడు తన ఊరికి పక్కనే ఉన్న బళ్లారిలోని కళాశాలను ఎంచుకున్నాడు. ప్రపంచంలోని ఏ కాలేజీకైనా సరే వెళ్లదలచుకుంటే డబ్బు కడతానన్న సుధామూర్తి పట్టుదల ఆ కుర్రాడి నిజాయితీ, దీక్ష ముందు పనిచేయలేదు. కేవలం తనకు నెలకు రూ.300 మాత్రమే చాలనీ... ఓ స్నేహితుడితో కలిసి ఒక గదిలో ఉండి చదువుకుంటాననీ చెప్పాడు. దాంతో, ఆరునెలలకు సరిపడా రూ.1800లను ఆమె పంపారు......

కొన్నాళ్ల తర్వాత ఆమెకు హనుమంతప్ప ఓ లేఖ రాశాడు. కవరులో రూ.300ల నోట్లు ఉన్నాయి. తమకు నెలరోజుల పాటు సెలవులనీ...తదుపరి నెలలో సమ్మె ఉన్నందున తాను బళ్లారిలో లేననీ...సొంతూరికి వెళ్లడంతో డబ్బు మిగిలినందున పంపేస్తున్నానన్నది లేఖ సారాంశం. ఈ పరిణామం సుధామూర్తిని అవాక్కు చేసింది. ఆ నిరుపేద  కుర్రాడి నిజాయితీకి ఆమె గుండె చిత్రంగా స్పందించింది.....

బోలో.. వెబ్బు మాతాకీ..జై (ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్)


బోలో.. వెబ్బు మాతాకీ..జై
(ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్)

కృపజూడు తల్లీ!...
గూగుల్ కల్పవల్లీ!...
మంచి బడి నిచ్చీ...
సల్లగ నేలు తల్లీ!...

బహుదగ్గరి చోటులు,
ఖమ్మం పక్క ప్లేసులు,
హాట్ హాటైన కేకులు,
ఆటోలున్న ప్లేసులు...
మాకిచ్చి నీకరుణ ...
సూపించు తల్లీ!...

అహో. *వెబ్బు* మాత.!
ఇదే నీకు జోత!
మాపైన నీ వింత
జాలిని జూపు సుంత...

మహా తెలివైన పిల్లలూ,
ఏకసంతా గ్రాహులూ,
ఒకసారి బోధనకే...
నికరంగా నేర్చువారు,
కంఠ శోష లేకనే....
కంఠత బట్టు వారు...
విద్యార్థులై ఉన్నట్టి
విద్యాలయమిమ్మా...

ఓహో.. వెబ్బు కొమ్మా!
నీకో దండమమ్మా...
నీ వలనుండి మమ్ము
ఆవల జేర్చవమ్మా!...
లీస్ట్ రాంకైన గానీ...
రోడ్డు పాయింటు నిమ్మా...
పాయింట్లు తక్కువైనా
బస్ పాయింటు నిమ్మా!

మా పూజ గొమ్మా!
మంచి స్టాఫు నిమ్మా!
గొడవలకు నింక
పులిస్టాపు నిమ్మా!

కష్టం చెయ్యనోళ్లు,
కయ్యం బెట్టువారూ...
ఊదరగొట్టు వారూ,
ఉట్టెక్కించు వారూ....
ముచ్చుల వంటి వారూ,
మూకీ సైగ వారూ,....
లాంగ్ సెలవు లోళ్ళూ,
మెడికల్లీవులోళ్ళూ...
మాకు స్టాఫవకుండా మముగాయమమ్మా!

తల్లీ వెబ్బు... రాణీ!
ఇదే పూజ బోణీ!
అష్టవర్షాలు నినుగొల్చి
ఆరాధింతుమమ్మా!

జై వెబ్ మాతాకీ.....
బై పాత స్కూళ్ళకీ.....

అర్ధాలు::
*సుంత-కొంత
*జోత- నమస్కృతి
*అష్ట వర్షాలు-ఎనిమిది సంవత్సరాలు.

కవిత్వం  కేవలం నవ్వుకొనుటకూ,.... సాహిత్యసౌరభాన్ని నలుగురకూ పంచుటకు మాత్రమే గానీ, వ్యక్తిగతంగా ఎవ్వరినీ,ఏ పాఠశాలనూ ఉద్దేశించినది కాదని వినయపూర్వక మనవి

స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా....

*🙏 స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా🙏*

ఈ లోకంలో మనుష్యులు ఎంతటి మూర్ఖులు! పరస్పరం కలహించుకుంటూ సమయాన్నంతా వ్యర్థం చేస్తూ గడిపివేస్తున్నారే! ఈ విధంగా ఎంతకాలం సాగిస్తారు ?
*జీవిత సంధ్యాసమయంలో అందరూ ఇళ్ళకు తిరిగి రావలిసిందే, జగజ్జనని చేతుల్లోకి రావలిసిందే.*

యుద్ధాల్లో జయాపజయాలు కలిగాయి. నా వస్తువులన్నీ మూట కట్టి మహాప్రస్థానానికి సిద్ధంగా ఉన్నాను.
*"శివా! ఓ శివా!! నా నావను ఆవలి తీరం చేర్చు."*

బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి - ప్రేమ అంతరిస్తోంది, కర్మ రసహీనమవుతోంది - జీవిత పైపై మెరుగులు తొలగిపోతున్నాయి. గురుదేవుల కంఠస్వరం మాత్రమే పిలుస్తోంది -
*"ఓ ప్రభూ నేను వస్తున్నాను, నా ఆరాధ్య దైవమా, నేను వస్తున్నాను."*

*మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటికి పోవడం మంచిదయుండవచ్చు. కానీ పని చేయడం మాత్రం విరమించను. భగవంతుని తోడి ఐక్యాన్ని లోకంలో యావన్మంది గుర్తించే వరకు నేను వారికి సర్వత్రా ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను.*

*-స్వామి వివేకానంద*

మంచి మాటలు - నిర్వచనం - స్పష్టత

🌺నిర్వచనం    -    స్పష్టత 🌺

మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయితీ
రెండవది దార్శనికత.🌺

చెప్పింది చెయ్యడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్ధత
రెండవది పారదర్శకత.🌺

ఇతరుల మది గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం
రెండవది తత్వం.🌺

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం
రెండవది వివేకం.🌺

ఎలాగయినా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ
రెండవది నేర్పు.🌺

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరులకోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం
రెండవది నీడ వీడిన చైతన్యం🌺

గెలవడం వేరు
గెలిపించడం వేరు
మొదటిది నేను
రెండవది మేము.🌺

సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం
రెండవది చైతన్యం.

4, జులై 2018, బుధవారం

ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?

ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?
ఇక్కడి “ప్రతి పాయింటు”ను గమనిస్తే ఆ సామర్థ్యం ఎలా సాధ్యమైందో అర్థమౌవుతుంది.
చదవండి.....
•🍒 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు
• 🍒చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు
• 🍒7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు
• 🍒స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది
• 🍒స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి
• 🍒13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు
• 🍒తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు
• 🍒ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు
• 🍒ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు
• 🍒ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు
• 🍒ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు
• 🍒ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు
• 🍒పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది
• 🍒ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది
• 🍒ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం
• 🍒ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు
• 🍒56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు
• 🍒అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది
• 🍒ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం
• 🍒ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే” !!!!!!!
• 🍒దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు
•🍒 విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది
• 🍒వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ

అన్నింటికంటే  ముఖ్యవిషయం  ఫిన్లాండ్  పాఠశాలల్లో  "భగవద్గీత"ను  నేర్పుతున్నారు.

ఒక మంచి కాఫీ లాంటి సందేశం

✍ *ఒక మంచి కాఫీ లాంటి సందేశం*

🍥సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

🍥ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

🍥పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

🍥సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.

🍥జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

🍥సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.

🍥సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.

🍥సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.

శిష్యులు

🍥”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.

🍥కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.

🍥 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.

🍥గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.

🍥ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
🍥అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.
శిష్యుల నోట మాట రాలేదు.

🍥" జీవితం అంటే  యేడుస్తూ కూర్చోడం కాదు.,  జీవితం  అంటే  - నాకు  ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని  - నా ఖర్మ  ఇంతే - అంటూ నిందించడం కాదు .,  జీవితం  అంటే  -  నేర్చుకోవడం."

🍥ఇలాటి కధలో, జీవిత చరిత్రలో ,పెద్దల జీవిత  విశేషాలో  కనీసం మన పిల్లలకైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నామా ? ? ఇవి  చెప్పడానికి మనకు టైం వుండదు కదా!  అందుకే పిల్లలు జబర్దస్త్,  పటాస్ ఇంకా  ఇలాంటి  చెత్త కానీ, హారర్ లేదా అసభ్య  దృశ్యాలు వున్న సినిమాలు  చూస్తూనే వుంటారు కదా!

ఎన్ని జన్మ లైనా నీ కొడుకుగానే పుట్టాలని దేవుని ప్రార్ధిస్తున్నా నాన్నా!

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన.
పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.
తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.
పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.
జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.
అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.
పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.
నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?
ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం.
ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించ లేదు.భయం కలిగింది. కన్నీళ్లు వచ్చాయి. ఏడుపు మొదలైంది.
అందరూ పోగయ్యారు. బొమ్మలిస్తాం ఏడవద్దు అన్నారు. బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు. తినుబండారాలు ఇఛ్చి ఏడవద్దు అన్నారు. నాన్న కావాలి అన్నాడు.ఎవ్వరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు.
బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న పిల్లాడు బొమ్మలగురించి ఆలోచించడం లేదు.నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు. కొడుకును వెదుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు.
బొమ్మలు కొందాం పద అన్నాడు నాన్న. వద్దు నాన్న ! నువ్వెప్పుడూ నా చేయి విడవొద్దు . ఇంటికెళదాం పద అన్నాడు కొడుకు.
నాన్న ఉంటే భరోసా
నాన్న ఉంటే ధైర్యం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్ఛే వాడు నాన్న!
రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న!
వేలు పట్టి నడిపించేవాడు!
వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు!!
మన విజయం కొరకు తపించేవాడు!!!
కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు నా నాన్న!
నాన్న చేసిన త్యాగాలు
నాన్న గొప్పతనం
నాన్న బాధ్యత
ఎన్ని చెప్పుకున్నా తక్కువే నాన్నా!
మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని నడుస్తాను నాన్నా!
ఎన్ని జన్మ లైనా నీ కొడుకుగానే పుట్టాలని దేవుని ప్రార్ధిస్తున్నా నాన్నా!
నాన్నకి ప్రేమతో!!

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :

*Shakespeare :* 👌🏿
ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన
నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక
కాని ఒక మంచి వ్యక్తిని
నువ్వు జీవితాంతం కోల్పోతావు.

*Napoleon :* 👌🏿
ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం
అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు
మంచి వ్యక్తుల మౌనం

*Einstein :* 👌🏿
నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను
ఎవరయితే నన్ను నిరాకరించారో..
వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను

*Abraham Lincoln :* 👌🏿
నీలో స్నేహ గుణం అన్నది
నీ బలహీనత అయితే
ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం

*Chralie Chaplin :* 👌🏿
నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు
వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే
ఆ విధంగా తారసపడతారు

*William Arthur :*  👌🏿
అవకాశాలు సూర్యకిరణాలు వంటివి
అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి
ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు

*Hitler :*  👌🏿
నువ్వు వెలుగులో వున్నంత కాలం
నిన్ను అందరూ అనుసరిస్తారు
అదే నువ్వు చీకట్లో వుంటే
నీ నీడ కూడా నీతో రాదు

*Vivekananda :* 👌🏿
నిశ్శబ్దముగా  వుండు
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా
నోట్లు చేయవు
విలువ కలిగినవి అలానే వుంటాయి.

జూన్ 23 నుంచి డిపార్టమెంటల్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

*జూన్ 23 నుంచి డిపార్టమెంటల్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం*

♦ప్రభుత్వోద్యోగులు తమ పదవీ కాలంలో బదిలీ / పదోన్నతికి అర్హత సాధించేందుకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాసేందుకు సదవకాశం లభించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌  15/2018 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్‌ కోడ్‌లతో పరీక్షలు నిర్వహిస్తారు. *జులై నెల 7వ* తేదీలోపు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. 
                         
*♦ఎవరు రాయాలి :*
    అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్‌)లో భాగంగా ఎస్‌జీటీ లేదా ఎస్‌జీటీ సమాన క్యాడర్‌లో ఉన్న వారు, 12 ఏళ్ల స్కేలు పొందేందుకు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కానీ 24 ఏళ్ల స్కేల్‌ పొందడానికి జీవో, ఈవో పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ‘స్కూల్‌ అసిస్టెంట్‌ తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులు 12 ఏళ్ల స్కేల్‌ పొందేందుకు డిగ్రీ, బీఈడీ విద్యార్హతలతో పాటు జీవో (గెజిటెడ్‌ ఆఫీసర్‌), ఈవో (కార్యనిర్వహణాధికారి) టెస్ట్‌  రెండింటిలోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ‘స్కూల్‌ అసిస్టెంట్లు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందేందుకు జీఓ, ఈఓ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ‘సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్‌ కూడా తీసుకోని వారు 45 ఏళ్ల వయసు దాటితే పదోన్నతి పొందేందుకు ఎలాంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

*♦ఆన్లైన్ పరీక్ష*
మొదటి సారిగా డిపార్ట్మెంట్ పరీక్షలు ఆన్లైన్(సీబీటీ) విధానంలో నిర్వహించానున్నారు

*♦ఉత్తీర్ణత మార్కులు ఇలా :*
    డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి.

*📚సిలబస్‌ :📚*
    *♦ జీవోటి(కోడ్ 88) పేపర్ l:*
ఇన్‌స్పెక‌్షన్స్‌ కోడ్స్‌ ది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్‌ రూల్స్, పీఎఫ్‌ రూల్స్‌ ఫర్‌ నాన్‌ పెన్షనబుల్‌ సర్వీసులతో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి.
*♦జీవోటి(కోడ్ 97):పేపర్  ll*
టియస్ పాఠశాల విద్య, సర్వీస్‌ నిబంధనలు, టియస్ సీసీఏ రూల్స్,
టియస్ మండల ప్రజా పరిషత్‌ చట్టం, టియస్ ఓఎస్‌ఎస్‌తో పాట వర్తమాన అంశాలు ఉంటాయి.

*♦ఈవో పరీక్ష (కోడ్‌141) సిలబస్‌:*
టియస్ బడ్జెట్‌ మాన్యువల్, టియస్ ఖజానా శాఖ కోడ్, టియస్ పింఛన్‌ కోడ్, భారత రాజ్యాంగ నిర్మాణం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్‌ అవ్వాలి.

*♦ఫీజు వివరాలు :*
    ప్రతి పేపర్‌కు రూ.200 వంతున ఫీజు చెల్లించాలి. జీవోటెస్ట్‌(GOT)కు రెండు పేపర్లకు రూ.400,ఈవోటెస్ట్‌(EOT)కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే ప్రతి పరీక్షకూ రూ.100 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి.
   
*✳పరీక్ష తేదీలు :*

    ♦జీవోటి (కోడ్‌ 88,) పేపర్‌–1
*జులై 20‌ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల* వరకు,
జీవోటి(కోడ్ 97)పేపర్‌–2 అదే రోజు మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకూ ఉంటుంది.

♦ఈవోటి (కోడ్‌141) *జులై 21* ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది.

♦స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు(పేపర్ కోడ్ 37) తేది *జులై 26* ఉదయం 10 నుంచి 12.30 గం.వరకు ఉంటుంది.

ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !

1.నాకు ఉచిత విద్య లభించడం లేదండీ —
*..... హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు*

2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి
*........................ అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు*

3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని —
*.......................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు*

4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని
*.......................... నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది*

5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది —
*........................ నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు*

6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను —
*........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది*

7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
*....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు*

8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను
*............ లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది*

9. నేను చాలా పోట్టివాడిని
*....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే*

10. నేను మంద బుద్ది వాడిని
*................ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే*

11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
*.................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు*

12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
*................... పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది*

13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుదు ఏమి చెయ్యగలను ?
*.............. వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు*

14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
*.............. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు*

మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే *కోరిక* ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం

పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు

ఈలాంటి మాటలకూ  గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.

కనుక అందరికి పంచండి .....

ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !