LATEST UPDATES

27, జూన్ 2018, బుధవారం

తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని, తెలుసుకోవాల్సిన సమాచారం

తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని, తెలుసుకోవాల్సిన సమాచారం :
*తి.తి.దే.దేవస్థానము చరిత్ర*

🔔  కలియుగ ప్రత్యక్ష దేవుడు ఐన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం అవేలాది భక్తులు వస్తుంటారు.

పర్వ దినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి
👉 *వార్షికాదాయం ఎంత తెలుసా...?*
ఏకంగా ఏడు వందల యాబై కోట్ల రూపాయల కు పైమాటే....

👉 ఈ స్వామి వారికి మూడు వేల కిలోల బంగారు డిపాజిట్లున్నాయి.

👉 ఇంకా వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి.

👉 ఈ ఆలయానికి ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు,

👉 మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు,

👉 ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా
వస్తుంటాయి.

👉 ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన
సేవ టికెటు ధర *పది లక్షల రూపాయలు.*

అయినా ఆ టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి
పోయాయి.

🔔 మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు.

👉 ఈ ఆలయం వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది పొందుతున్నారు.

👉 *తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:....*

💐 *సుమారుగా*💐
🔴 ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా  వంద కోట్లు ఆ దాయం వస్తున్నది.

🔴 బ్యాంకుల్లో
వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ 140 కోట్లు వుంటుంది.

🛑మన స్వామి వారి చెంత నున్న
బంగారం సుమారు ఐదు టన్నులు.

🛑 విదేశాలలో వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల కోట్లు.

🛑 ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు,
మిరాసీ దారుల చేతుల్లో వుండేది.

🛑 ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చేతుల్లోకి వచ్చింది.

తి.తి.దే ఏర్పడ్డాక కూడ మిరాసి విధానమె కొనసాగింది. అనగా
పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి వుండే వారు.
అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి *51 లడ్డులకు 11 లడ్డులను* మిరాసి కింద అర్చకులకిచ్చేవారు.
వాటిని అర్చకులు అమ్ముకునెవారు.

🛑 1987 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు / మిరాసి విధానాన్ని రద్దు చేశారు.

🛑 కాని అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని పూర్తిగా రద్దు చేసింది.

🛑 అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని ప్రారంబించారు.

కాని ఇప్పుడు మిరాసి విధానాన్ని
పునరుద్దరించాలని అర్చకులు పోరాడుతున్నారు.

🛑 *కారణం ఏమంటే......?*

👉తి.తి.దే ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల లడ్డులను తయారు చేస్తున్నది.

👉మిరాసి విధానం ప్రకారం ప్రతి *51 లడ్డులకు 11 లడ్డులను* అర్చకులకివ్వాలి. అనగా రోజుకు 86,274 లడ్డులను అర్చకులకివ్వాలి.

👉 ప్రస్తుతం ఒక లడ్డు *ధర 25* రూపాయలు. ఆ లెక్కన మిరాసి ధారులకు రోజుకు 21,56,000
రూపాయలను చెల్లించాలి. ఇంత ఆదాయాన్ని వదులు కోడానికి వారికి రుచించ లేదు.

👉 శ్రీవారు 2011 వ సంవత్సరంలో ఆదాయం: రూ.1700 కోట్ల రూపాయలు రాగా వివిద జాతీయ
బ్యాంకుల్లో వున్న డిపాజిట్లు కు వడ్డీ
ద్వార ......, వివిద రకాల పూజా కార్య క్రమాల ద్వార రోజు వారి టికెట్ల విక్రయం ద్వారా మరో 200
కోట్ల రూపాయల ఆదాయం లబించింది.

👉ఇవి కాక భక్తులు సమర్పించిన వజ్రాలు, బంగారం,వెండి, వంటి ఆభరణాలు సమర్పించారు. ఈ ఏడాది అనగా *2012 లో 2.2 కోట్ల మంది భక్తులు స్వామి
వాని దర్శించు కున్నారు.*

       🙏💐🙏💐🙏

🔔 తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు *వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి*
తిరుమలలో శ్రీవారికి
రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.

🔔 *అవి:*
👉 *ప్రత్యూష,*
👉 *ప్రభాత,*
👉 *మధ్యాహ్న,*
👉 *అపరాహ్ణ,*
👉 *సాయంకాల,*
👉 *రాత్రి పూజలు.* తెల్లవారుజామున జరిగే *సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.*

💐 *సుప్రభాతం:*
నిత్యం స్వామివారికి జరిపించే
ప్రప్రథమ సేవ ఇదే.

👉 నిత్యం తెల్లవారుజామున
మూడు గంటలకు సుప్రభాత సేవ
మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,
శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల)
దేవాలయం వద్దకు వస్తారు.
*నగారా మండపంలో గంట మోగుతుంది*.

మహాద్వారం గుండా సన్నిధి
గొల్ల ముందు వెళుతుండగా
అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.
కుంచెకోలను,
తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న
క్షేత్రపాలక శిలకు తాకించి
ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి
అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే
అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి
వంశీకుడు తంబురా పట్టుకుని
మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.
బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల
దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే
అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి,
మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో
తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ,
గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని
మేల్కొలుపుతుంటాడు. అర్చక
స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి
గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి
పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని
మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి
ముందు తెరను వేస్తారు. ప్రధాన
అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం
సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన
పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి
స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి
భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ
సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని
విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ
అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి
మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ
శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత
రాత్రి జరిగిన అలంకరణలు,
పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి
ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
అర్చన: శ్రీవారికి
ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది.
దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది)
నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న
వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి
సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష
సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి
ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు,
గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి
విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.
ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ
స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ
సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి
భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి
ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత
మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి,
అలంకారాసనం సమర్పిస్తారు.
అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి
నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని
దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి)
స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే
దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ
మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'...
తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన
అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని
పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో
ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ
జరిపిస్తారు.
శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన
తరువాత తోమాలసేవ చేస్తారు.
కొలువు: తోమాలసేవ తర్వాత
పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో
కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్
జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత
మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని,
ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి
విన్నవిస్తారు. ముందురోజు హుండీ
ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ,
నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ
తెలియజేస్తారు. అనంతరం నువ్వులు,
బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా
సమర్పిస్తారు.
సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30
వరకు సహస్రనామార్చన జరుగుతుంది.
బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి
వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ
అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న
పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి
దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో
మిరాశీదారు వరాహ పురాణం లోని
లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత
నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు,
అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత
స్వామివారికది నైవేద్యసమయం.
నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని
శుభ్రం చేసి, బంగారు వాకిలి
తలుపులు మూసేస్తారు. తిరుమామణి
మంటపంలోని గంటలు మోగిస్తారు.
అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి
పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి
(అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు,
దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి
(పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో
మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.
వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది
నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి
పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన
అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది.
పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు,
పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా
సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం,
కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ
వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర
శతనామార్చన, శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ
అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట
మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే
పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.
ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో
కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి
పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా
పెడతారు. రాత్రిపూట స్వామివారిని
పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని
కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు.
ఏడుకొండల వాడిని
నిదురపుచ్చేందుకు అన్నమయ్య
కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి
అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల
పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో
మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో
ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
గుడిమూసే ప్రక్రియ: రాత్రి
రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ
మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ
తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి
గడియలు బిగిస్తారు.
అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై
సీళ్లు వేస్తారు.
ప్రత్యేక సేవలు
రోజువారీ అర్చనలు,
ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ,
గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి
ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి
సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద
పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ,
తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి
రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం,
సహస్ర దీపాలంకరణ, ఆర్జిత
బ్రహ్మోత్సవాలు ఇవన్నీ
ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు: గురువారం ప్రాతఃకాల
పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి
ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని
తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల
కన్నులు భక్తులకు కనిపిస్తాయి.
అనంతరం శ్రీవారికి 24మూరల
పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ
కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు,
శంఖచక్రాలు, కర్ణాభరణాలు,
స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి
తలుపులు తెరుస్తారు. దీన్నే
సడలింపు అంటారు.
పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని
పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ.
తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి
దివ్యమనోహర
విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటా
---Dept of PRO TTD.

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

(ప్రజ్ఞ టుడే)న్యూదిల్లీ: ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత సదరు ఉద్యోగి తన ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో)నుంచి 75శాతం వరకూ సొమ్మును తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. మంగళవారం జరిగిన కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, మిగిలిన 25శాతాన్ని కూడా ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కింద రెండు నెలల తర్వాత తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది.

‘ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులుగా గుర్తించి, వారి ఖాతాల్లో అప్పటివరకూ జమ అయిన పీఎఫ్‌లో 75శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాం.’ అని కార్మికశాఖ మంత్రి సంతోష గంగ్వార్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల తర్వాత సదరు ఉద్యోగి తన పీఎఫ్‌ ఖాతా నుంచి కేవలం 60శాతం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని ఒక నెలకు తగ్గించారు. అంతేకాదు, పీఎఫ్‌ సొమ్మును వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరతామనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది.

అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు గంగ్వార్‌ తెలిపారు. ఎస్‌బీఐ, యూటీఐలలో ఈటీఎఫ్‌లను మరో ఏడాది పాటు అంటే జులై 1, 2019 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. ఫండ్‌ మేనేజర్ల కాలపరిమితిని కూడా డిసెంబరు 31, 2018 వరకూ పొడిగించారు. ఫండ్‌ మేనేజర్లను మూడేళ్ల కాలపరిమితికి ఏప్రిల్‌ 1, 2015లో నియమించగా, జూన్‌ 30, 2018తో వారి గడువు ముగిసింది.

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

మిత్రమా.... గాయం ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లుగా ఉన్నది ఇప్పటి పరిస్థితి... మీరు చెప్పిన కొన్ని విషయాలతో నేను కూడా ఏకీభవిస్తాను... కాని దానికి పరిష్కారం ఇది మాత్రం కాదు అని  నా అభిప్రాయం... వెబ్ కౌన్సిల్ వలన దొంగ సర్టిఫికెట్లు తగ్గాయా? SSC సబ్జెక్ట్ పాయింట్లలో తప్పులు జరగలేదా? అర్హత లేకున్నా ఇప్పటికి D కేటగిరి పేరుతో అధిక పాయింట్లు పొందిన వారు లేరా? వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏది ఆగిపోయింది... సరి అయిన విధి విధానాలు రూపొందించకుండా తప్పులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో అవకాశవాదులు తప్పులు చేస్తూనే ఉన్నారు... మీరన్నట్లుగా సాంకేతికతను అందరూ స్వాగతించాల్సిందే... కాని దాని వలన పని సులభతరం కావాలి  కష్టతరం కాకూడదు... సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పుడు పని వేగవంతంగా పూర్తి అయ్యేలా ఉండాలి కానీ మరింత ఆలస్యం చేసేదిగా ఉండకూడదు... మీరు చెప్పినట్లు రాత్రి పగలు కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాలనే ఆలోచన ఎవరికి లేదు, దాని వలన అందరం ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళమే కానీ ఇప్పుడు అంత కన్నా అధ్వాన్నంగా పరిస్థితి తయారయ్యేలా ఉన్నది. ఈ రోజు నేను మన కరీంనగర్ లో అందరి కన్నా మిన్నగా బిల్స్ చేస్తారని పేరు ఉన్న ఒక ఉపాధ్యాయ సోదరుని దగ్గర SA గణితం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళాను... 100 కన్నా తక్కువ ఆప్షన్స్ అయితేనే ఇస్తాను. 100 ఇవ్వడానికి గంట సమయం పడుతుంది.. అంత కన్నా ఎక్కువ అయితే నా వల్ల కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు... నేను తీసుకు వెళ్లిన వ్యక్తిది 550 పైన ర్యాంకు.. పైగా లాంగ్ స్టాండింగ్.. ఉండేది కరీంనగర్ లో... కాబట్టి  కనీసం 400 వరకైనా ఆప్షన్స్ ఇచ్చి మిగతావి బల్క్ గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాము... తాను తొలుత చేయను అన్నప్పటికి నా మాట కాదనలేక పని మొదలుపెట్టి 215 ఆప్షన్స్ ఇవ్వగానే పవర్ పోయింది...అయిన వరకు సేవ్ చేద్దాము అంటే కంపల్సరీ కాబట్టి అన్ని ఆప్షన్స్ ఇస్తే తప్ప సేవ్ తీసుకోవడం లేదు... తొందర తొందరగా ఇంకో 25 ఆప్షన్స్ ఇచ్చామో లేదో కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది... దాదాపు 2.30 గంటల సమయం కష్టపడితే పని పూర్తి కాలేదు... ఇక తన వల్ల కాదు బయట చేసుకోండి సార్ అని చెప్పడంతో ఇంటికి వచ్చాము... ఈ సాఫ్ట్ వేర్ మిడి మిడి పరిజ్ఞానముతో రూపొందించినట్లు ఉన్నది తప్ప ఉపయోగకరంగా లేదు... ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ కిందికి మీదికి జరుపుకునే సదుపాయం ఉంటది కానీ ఇందులో కనీసం ఆ సదుపాయం కూడా లేదు..  ఒకసారి ఏదైనా మధ్యలో తప్పుగా ఇచినట్లైతే దానిని తొలగించడం తప్ప దాని స్థానంలో సరైంది ఇవ్వడానికి అవకాశం లేదు.. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి... నిన్న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సిలింగ్ లో spouce కేటగిరీ లో ఒకరికి కేవలం 7 మండలాలు ఆప్షన్స్ గా వచ్చాయి ఒకవేళ అవి దొరక్కపోతే పరిస్థితి ఏంటి... అలాగే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే spouce వాళ్ళు అదే మండలం లేదా దగ్గరి మండలంలో పోస్టింగ్ పొందే వాళ్ళు... ఇప్పుడు అలా కాకుండా అందరూ కరీంనగర్ వచ్చి చేరితే మిగతా ఉపాద్యాయుల పరిస్థితి ఏంటి... ఇప్పటికే spouce కేటగిరీ తీసివేయాలి అని వస్తున్న డిమాండ్ కి మరింత బలం చేకూర్చినట్లు కాదా... అన్ని విధాలా అనుకులమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించి ముందుగా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఫలితాల ఆధారంగా ఆచరణలో ప్రవేశ పెట్టాల్సింది... కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఒక సాఫ్ట్ వేర్ రూపొందించి అది మన ముఖాన పారేసి అడిగిన కొద్దీ రోజుకో మార్పు చేసుకుంటూ పోతుంటే ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది... ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కాలంలో ఒక్క సాఫ్ట్ వేర్ ను సమర్థవంతంగా రూపొందించకుండా ఉపాధ్యాయులను తప్పు పడితే ఎలా... చివరిగా ఒక ప్రశ్న... నా ర్యాంకు 1006... నేను ఉండేది కరీంనగర్ లో... కనీసం ఎన్ని మండలాల్లో ఎన్ని స్థానాలు చూపిస్తే నాకు కచ్చితంగా ప్లేస్ వస్తుందో చెప్పగలరా... సాఫ్ట్ వేర్ రూపిందించిన వారే 1007 ఇస్తే గ్యారంటీ అంటున్నారు... అలాంటప్పుడు నేను 1007 ఇవ్వాలి అంటే కనీసం 10 గంటలు నెట్ సెంటర్లో ఉండి ఆప్షన్స్ ఇవ్వాలి... మరి నా ఒక్కడికే అంత సమయం పడితే అందరివి ఎప్పుడు పూర్తి అవుతాయి... ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కోసమో లేక మరో దాని కోసమో కాదు...నాకు ఎదురైన పరిస్థితి తీవ్రతను మీకు తెలియ పరచాలని ఉద్దేశంతోనే.... మరొక్క సారి మీరు వెబ్ కౌన్సిలింగ్ విషయమై పునరాలోచన చేయాలని ఎల్లుండి ప్రారంభం కాబోయే SGT ల పరిస్థితిని అంచనా వేయాలని మా సూచన...

---సామాన్య ఉపాద్యాయుడు......
(సాంకేతిక పరిజ్ఞానం లేని ఉపాద్యాయులందరు ఇబ్బంది పడుతున్నారు--ఇది నిజం)

తెలుగు అక్షరమాలతో అద్భుతమైన వాక్యాలు

తెలుగు అక్షరమాలతో అద్భుతమైన వాక్యాలు

అ:- అన్వేషించడం మొదలుపెట్టు...
ఆ:- ఆత్మవిశ్వాసానికి పదునుపెట్టు...
ఇ:- ఇష్టపడటం నేర్చుకో...
ఈ:- ఈర్ష్యపడటం మానుకో...
ఉ:- ఉన్నతంగా ఆలోచించు...
ఊ:- ఊహకు అందేలా ఆచరించు...
ఋ:- ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు...
ఎ:- ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు...
ఏ:- ఏకాగ్రతను అసలు కోల్పోకు...
ఐ:- ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు...
ఒ:- ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది...
ఓ:- ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు గెలుపుకు బాటలు వేస్తాయి...
ఔ:- ఔన్నత్యానికి గెలుపోటములు నీ  పునాదులు అని మరువకు...
అం:- అందని ఎత్తుకు ఎదగాలంటే...
అః:- అఃర్నిశలుగా ఇప్పటి నుండి శ్రమించాలని తెలుసుకో....
క:- కష్టపడి పనిచేయడం నేర్చుకో...
ఖ:- ఖచ్చితత్వం అలవరుచుకో....
గ:- గమ్యాన్ని ఎంచుకొని పయనించు...
ఘా:- ఘాటుగా స్పందించడం నేర్చుకో...
జ్ఞ:- జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసలుకో...
చ:- చతురతను ప్రతి విషయంలో నేర్పుగా  వ్యవహరించు...
ఛ:- ఛత్రపతిలా జీవితాన్ని సార్ధకం చేసుకో....
జ:- జగడాలకు దూరంగా ఉండు..
ఝ:- ఝుమ్మంది నాదంగా మారు...
ణ:- జనగణమన గీతాన్ని మర్చిపోకు..
త:- తర తమ బేధాలను అణగదొక్కు.
థ:- థదేకంగా ధ్యానించు....
ద:- దయాదాక్షిణ్యాలు కలిగివుండు...
ధ:- ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించు...
న:- నట జీవితం నేర్చుకోకు...
ప:- పరిహాసమాడకు...
ఫ:- ఫలితాలను సమంగా చూడు...
బ:- బలముతో అన్ని పనులు నెరవేరవు...
భ:- భయాన్ని దరిచేర నీయకు...
మ:- మర్యాదగా వ్యవహారించు...
య:- యవ్వనాన్ని అపహాస్యం చేయకు...
ర:- రంగురంగుల జీవితంలో పడి మోసపోకు...
ల:- లక్షణమైన జీవితాన్ని ఏర్పరుచుకో...
వ:- వంచనకు గురికాకు, గురిచేయకు...
శ:- శిరస్సును వంచుకునే పనిచేయకు...
ష:- షడ్రుచులను ఆస్వాదించు...
స:- సన్నిహితులను ఏర్పరుచుకో...
హ:- హానికరమైన పనులు ఏనాడు చేయకు...
ళ:- అవహేళన చేయకు...
క్ష:- క్షణికావేశానికి లోనుకాకు...
ఱ:- ఱణాన ఎదురు నిలువు...

సర్కారు బడికి ప్రైవేటు బడికి వున్నా తేడా...

సర్కారు బడికి   ప్రైవేటు బడికి వున్నా తేడా...

వున్నోడు ఎలాఐనా ఎగురుతాడు, 
వాన్ని చూసి లేనోడు ఎగురుతే ఏమైతది  వున్నయన్ని అమ్ముకోవలసి వస్తుంది ...
ఇప్పుడు అందరూ వున్నోడు లేనోడు మద్యతరగతి వాళ్ళు
అందరూ సర్కారు బల్లె న పిల్లల ను సదువుపియండి
సర్కారు బల్లె వున్న సదుపాయాలు  ప్రైవేటు బల్లల్లొ వుండవు లేవుకూడా...
పిల్లలకు స్కూల్ యూనీఫామ్స్ ఫ్రీ
మధ్యాహ్నం బోజనం ఫ్రీ
ఫీజు ఫ్రీ
సర్కారు బల్లె సదువుకున్నోళ్ళకు  పై సదువులు కూడా ఫ్రీ
ర్యాంకు వస్తే..

ఇన్ని సదుపాయాలు వుంచుకొని ప్రైవేటు బల్లో సదువు పిస్తే ఏమస్తుంది జేబు కాళి అవుతుంది తప్పా...
ఈరోజు ల్లో ప్రైవేటు బల్లో ఫీజు లు కట్టాలంటే మద్యతరగతి జీవితాలకు సాద్యపడదు,

నాలుగో తరగతికి కే అన్ని అమ్ముకున్నాడంటే  ఇగ  ఐదోతరగతి కి  ఆరోతరగతికి పరిస్థితి ఏమౌతుందో  ఏ గుడి మెట్లమీద కూసోవలసి వస్తుందో ...
ఆ దుస్తితి రాకుండా వుండాలని కోరుకుందాం...

సర్కారు బల్లె  మంచిగా సదువుకున్న టీచర్లు  టీచర్ ట్రేనింగ్ ఐనవాళ్ళు సదువు చెబుతారు,  పిల్లల భవిష్యత్ బాగుంటుంది ....

సర్కారు బడి ముద్దు  ప్రైవేటు బడి వద్దు....

మనం బాగుండాలి అనుకునే వాడు సీరియస్ గా మాట్లాడతాడు మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు

మనం బాగుండాలి అనుకునే వాడు
సీరియస్ గా మాట్లాడతాడు
మనల్ని మోసం చేసేవాడు మాత్రం
ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు

సూటిగా మాట్లాడే వాళ్ళకి
శత్రువులు ఎక్కువ..!
మాయ మాటలు చెప్పేవారికి
మిత్రులు ఎక్కువ...!!

నడుస్తున్న కాళ్లు మనకు ఎన్నో జీవితపాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందు ఉన్నానని ,వెనకున్న కాలికి అవమానం లేదు తాను వెనుకబడ్డానని .
      ఎందుకంటే ఆ రెంటికీ తెలుసు.. వాటి స్థానం క్షణాల్లో మారుతుందీ అని.
      
     మన జీవితం కూడా అంతే మిత్రమా...మనకన్నా ముందు ఉన్నవాళ్ళను చూసి ఈర్ష పడడం...మనకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడడం.. రెండూ ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు..
   
రుచించక పోయినా ఇదే యదార్థం.

*మూసిన కన్ను తెరవకపోయినా,
*తెరిచిన కన్ను మూయకపోయినా,
*శ్వాస తీసుకుని వదలకపోయినా,
*వదిలిన శ్వాస తీయకపోయినా,
*ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు.
*మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.

*విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.
*ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు.

*ఈ క్షణం మాత్రమే నీది,
*మరుక్షణం ఏవరిదో?
*ఏమవుతుందో ఎవరికి తెలుసు?

*ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు..

*ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా
*అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.

*ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు.

*ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు..

*చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు.
*ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. *మనం సహప్రయాణికులం మాత్రమే.

*కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ.
*అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేధిద్దాం.
అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం.

*అందుకే మనుషుల్లా జీవిద్దాం.
మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం.

*దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

*భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.

*ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి.

  *నిరంతరం భగవత్ ధ్యానంతోఉంటూ ,సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి పంచుతూ ,నిన్ను నీవు ఉన్నతాత్మగా పెంచుకుంటూ ఉండటమే జీవనం.

మితిమీరితే జరిగే అనర్ధాలు..........

మితిమీరితే

మితిమీరిన  ఖర్చు  ...
పేదరికం పాలు చేస్తుంది.

మితిమీరిన  పొదుపు  ...
కష్టాల పాలు చేస్తుంది.

మితిమీరిన  సంపాదన  ...
మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

మితిమీరిన  కర్తవ్యం  ...
అగచాట్ల పాలు చేస్తుంది.

మితిమీరిన  క్రమ శిక్షణ  ...
రక్త సంబంధీకులను దూరం చేస్తుంది.

మితిమీరిన  బాధ్యతలు  ...
అప్పుల పాలు చేస్తుంది.

మితిమీరిన  హాస్యం  ...
  నవ్వుల పాలు చేస్తుంది.

మితిమీరిన  కోపం  ....
శతృవులను వృద్ధి చేస్తుంది.

మితిమీరిన  ఆలోచనలు  ...
జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

మితిమీరిన  వ్యసనాలు  ...
అప మృత్యు పాలు చేస్తుంది.

మితిమీరిన  స్వార్ధం  ...
అందరినీ దూరం చేస్తుంది.

మితిమీరిన  పోటీ  ...
నష్టాల పాలు చేస్తుంది.

మితిమీరిన  లాభార్జన  ... వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .

మితిమీరిన  వస్తుత్పత్తి  ...
నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.

మితిమీరిన  గర్వాహంకారం  ...
ఆపదలు కొని తెస్తుంది.

మితిమీరిన అలంకారం  ...
వెగటు పుట్టిస్తుంది.

మితిమీరిన  శృంగారం  ...
వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

మితిమీరిన  కామాంధకారం  ...
జీవచ్ఛవాన్ని చేస్తుంది.

మితిమీరిన  అత్యాశ   ...
  నేరాల పాలు చేస్తుంది.

మితిమీరిన  అధికార దాహం  ... హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

మితిమీరిన  త్యాగం  ...
కడగండ్ల పాలు చేస్తుంది.

మితిమీరిన వ్యవసాయకోత్పత్తి  ...
భూమిని నిస్సారం చేస్తుంది.

మితిమీరిన  జనాభా పెరుగుదల ...
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.

మితిమీరిన  గారాబం  ...
చెడు స్నేహాల పాలు చేస్తుంది.

మితిమీరిన  వేదాంతం  ...
వెటకారం పాలు చేస్తుంది.

మితిమీరిన  ఈర్షా ద్వేషాలు  ...
నిద్రా సుఖాన్ని దూరంచేస్తుంది.

మితిమీరిన   భక్తి  ...
మూర్ఛల పాల చేస్తుంది.

మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...
నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.

మితిమీరిన  ఉపవాసాలు  ...
నిస్త్రాణతకు దారి తీస్తుంది.

మితిమీరిన  ప్రేమ  ...
అనుమానాలకు దారి తీస్తుంది.

మితిమీరిన  నమ్మకం  ...
ద్రోహానికి దోహదం చేస్తుంది.

మితిమీరిన  విశ్వాసం  ..
లోకువ పాలు చేస్తుంది.

మితిమీరిన  ఋణం  ...
మరణంపాలు చేస్తుంది.

మితిమీరిన  అభిరుచి  ...
దుబారాకు దారి తీస్తుంది.

మితిమీరిన  కీర్తి దాహం  ...
ఆదాయాన్ని మింగేస్తుంది.

అతి సర్వత్రా వర్జేయత్    
తస్మాత్  .                
జాగ్రత్త  ...
జాగ్రత్త  ...
జాగ్రత్త

మితా హారం  ...
మిత భాషణం  ...
మితమైన నిద్ర  ...
మిత సంసారం  ...
మిత సంపాదన ...
మనో కాలుష్య రహితంగా ...
జీవన యానం సాగిస్తే  ...
పరిపూర్ణమైన జీవితానంద   ప్రక్రియకు  అదే రాచబాట...

ప్రశాంతమైన మనశ్శాంతికి
అదే పూల తోట.

మూర్తీభవించిన
మానవతా విలువలకు    
అదే పెట్టని కోట

పదవీ విరమణ వయస్సు 60 కి పెంచాలి...

పదవీ విరమణ వయస్సు 60 కి పెంచాలి..

పదవి విరమణ 60 కి పెంచితే నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వస్తదని సాకు చూపించి 60 కి పెంచడం ఆపకూడదు.భారత దేశంలో 18 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులoదరికి పదవి విరమణ వయస్సు60 సం.లుగా ఉన్నది.ఒకవేళ నిజంగా నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వ్యక్తముఐతే 18 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం లో 60 సం. ల పెంపు ఎలా సాధ్యమైంది? అంతే కాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు పదవి విరమణ వయస్సు 65 కి పెంచింది.మధ్య ప్రదేశ్ ప్రభుత్వo ఇటివల పదవి విరమణ వయస్సు 62 కు పెంచింది.తెలంగాణాలో కూడా వైద్య విద్య ప్రొఫెసర్ ల పదవి విరమణ వయసు 65 సం లకు పెంచాలని ఆలోచిస్తుంది.

ఈ పెంపు ఇప్పుడు కాకపోయినా ఇంకొ 20 సం.ల తర్వాత పెంచిన కూడా నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వస్తుంది. అలా అయితే ఇక ఎప్పటికీ 60 సం లకు పెంపు కుదరదు...ఇది కేవలం ఒక దిన పత్రిక తప్పుదోవ పట్టిస్తుంది.ఇది ముమ్మాటికి తప్పుడు సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గరిష్ట వయస్సు 39 సం.ఈ వయస్సు లో ఉద్యోగం పొందిన ఉద్యోగి 58 సం లకి ఉద్యోగ విరమణ చేస్తే కేవలం 19 సం ల సర్వీస్ చేస్తారు.ఆ లెక్కన ప్రస్తుతం చాల మంది ఉద్యోగులు 19 నుండీ 25 సం ల సర్వీస్ చేసి పదవి విరమణ పొందుచున్నారు.వీరికి 6 నుండీ 7 లక్షల గ్రాట్యూటి మరియు 5-6 లక్షల కమ్యూటేషన్ కలిపి మొత్తం 11-13 లక్షలు వస్తున్నాయి.ఈ కాస్త డబ్బు తో పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం ఎలా?
సర్వీస్ లో ఉన్నంత కాలం పిల్లల చదువు,కుటుంబ పోషణకై సరిపోయింది.
కావున పత్రికల వారికీ మనవి చేయునది ఏమనగా...దేవుడు వరమిచ్చిన పూజారిలాగా ఆడ్దుపడకూడదని పదే పదే కోరనైనది.

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలకు మనవి చేయునది ఏమనగా....క్రింది అంశాల వారిగా ప్రాధాన్యతలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సాధించలని కొరనైనది.

1) CPS నుంచి OPS కు

2) ఉద్యోగ విరమణ వయస్సు 58 నుండి 60 కి పెంపు 01-05-2018 నుండి

3) 11వ PRC వెంటనే ప్రకటించి 02-06-2018 నుండి అమలు చేయాలి.

4)బదలీలు,ప్రమోషన్ లు

5)ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్

6)AP లో ఉన్న TS ఉద్యోగులను వెంటనే ఇక్కడకు తీసుకరావడం.

14సం.ఆంధ్ర నాయకులతో పోరాడి తెలంగాణను తెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పదవి విరమణ వయస్సు 60 కి పెంచడం అనేది చిన్న సమస్య.కావున రాష్ట్ర నాయకులూ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి పదవి విరమణ వయస్సు 60 కి పెంచాలని కోరుతూ....

తక్కువ సర్వీస్ తో రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయుల మనవి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2018 నెల వేతనాలు ఈ-కుభేర్ పద్దతిలో చెల్లించనున్నారు.

          రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2018 నెల వేతనాలు ఈ-కుభేర్ పద్దతిలో చెల్లించనున్నారు.

           ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖ జానా కార్యాలయము నుండి  అన్ని జిల్లా ఖజానా కార్యాలయాలకు ఆదేశాలు అందాయి.

          దీని కోసం చేయవలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

          అందరు డ్రాయింగ్ అధికారులు తమవద్ద పని చేయు ఉద్యోగుల వివరాలను DDO Request లో నమోదు చేసి, దాని ద్వారా వచ్చిన text file ను బిల్లుకు జత   చేయాలి.

        ఎవరైనా ఉద్యోగి బదిలీ పైనగానీ, ప్రమోషన్ మీదగానీ వచ్చినట్లయితే వారి వివరాలను కొత్తగా నమోదు చేసుకోవాలి.

        ఎవరైనా ఉద్యోగి వివరాలను సరిచేసే వీలు లేనప్పుడు సంబంధిత ట్రెజరీ అధికారిని సంప్రదించి, అట్టి ఉద్యోగి వివరాలను తాత్కాలికంగా Treasury Impact1819 Software ద్వారా Delete చేయించి, తిరిగి సరి అయిన వివరాలను DDO Request లో నమోదు చేయాలి.

       బిల్ ఐడి ప్రకారం Text File Generate అవుతుంది. దానిని సంబంధిత బిల్లుకు జత చేయాలి. బిల్లు ఐడి ప్రకారం ఉద్యోగుల బ్యాంకు అకౌంట్ వివరాలను Check చేసుకొని Submit చేయాలి.

       (DDO Request => BENF MAPPING =>  Bank Account & IFSC ENTRY మరియు  Employe Bank Details Confirmation)*  ద్వారా వివరాలను నమోదు చేసి అంగీకరించాల్సి ఉంటుంది.

        అకౌంట్ నంబరును సరిగా నమోదు చేయాలి.

        లేనట్లయితే జీతం అందే అవకాశం ఉండదు. తిరిగి ఖజానా అధికారిని సంప్రదించి సరి చేయించాల్సి వస్తుంది.

       అసమగ్ర బ్యాంకు అకౌంట్ వివరాలతో బిల్లు జనరేట్        కాదు.

        ఈ-కుభేర్ రూపంలో బిల్లుకు సంబంధించిన Text File జతచేయనట్లయితే ఆ బిల్లుకు ట్రెజరీ కార్యాలయములో టోకెన్ రాదు. ఎటువంటి అనుమానాలనైనా ట్రెజరీ అధికారులు తీరుస్తారు.

         సరి అయిన బిల్లులను ట్రెజరీ సిబ్బంది పాస్ చేసి సంబంధిత ట్రెజరీ బ్యాంకుకు కాకుండా RBI హైదరాబాద్ కు పంపి, నేరుగా మొదటి తారీఖునే జీతాలు అందించనున్నారు.

          కావున అందరు డ్రాయింగ్ అధికారులు సరి అయిన బ్యాంకు అకౌంట్ వివరాలను ట్రెజరీ సాఫ్ట్ వేర్  లో నమోదు చేసి, ఈ- కుభేర్ Text File ను జీతం బిల్లుతో పాటుగా ట్రెజరీ కార్యాలయాలో అందచేసి, వచ్చే నెల మొదటి తారీఖు జీతాలను ఈ-కుభేర్ పద్దతిలో నేరుగా RBI హైదరాబాద్ వారి ద్వారా పొందగలరు.