అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాకలి రామయ్య ఉండేవాడు. ఆయనకు ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద రోజూ చాకిరేవుకు బట్టలు మోసేది. కుక్క ఇంటికి కాపల కుసేది. రామయ్య వాటికి సరైన ఆహారం పెట్టెవాడు కాదు. ఆహారం సరిగా పెట్టడం లేదని అవి రోజూ బాధపడుతుండేవి.
ఒక రోజు రామయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. కుక్క దొంగలు రావడం చూసింది. కాని మొరగకుండా ఉండిపోయింది. గాడిద కూడా దొంగలు రావడం, కుక్కమొరగ కుండా ఉండడం గమనిస్తూనే ఉంది.
‘‘మన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారు కదా ఎందుకు నువ్వు మొరగడం లేదు? అవి అడిగింది గాడిద.
‘‘యజమాని మనల్ని ఉంచుకొన్నాడు. ఆయనకు మనం ఎంతో సేవ చేస్తున్నాం. అయినా మనకు కడుపు నిండా ఆహారం పెట్టడం లేదు. అందుకే నేను మొరగడం లేదు?’’ అంది కుక్క.
గాడిద మనస్సు ఒప్పుకోలేదు. యజమాని ఎలాగైనా నిద్రలేపాలని బిగ్గరగా గాండ్రించడం మొదలు పెట్టంది.
గాడిద అరుపులకు దొంగలు పారిపోయారు కాని, మంచి నిద్రలో ఉన్న రామయ్యకు, నిద్రాభంగం కలిగింది. గాడిద అలా అరవడం అతనికి కోపం తెప్పించింది. కట్టె తీసుకొని గాడిదను ఎడాపెడా కొట్టాడు. ఆ దెబ్బకు గాడిద విలవిలలాడింది.
‘ఎవరి పని వారే చెయ్యాలి’ అని అందుకే అంటారు.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి