ఒక రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. బండికి కట్టి లాగించే వాడు. సాయంత్రానికి అది చాలా అలసిపోయేది. యజమాని మీద కోపం వచ్చేది. కొన్ని సంవత్సరాల తర్వాత రైతు ఒక గాడిదను కొని తెచ్చాడు. ఆ గాడిద ఎద్దుతో యజమాని నిన్ను బాగా చూస్తాడా? అని అడిగింది. ఎద్దు దానితో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అప్పుడు గాడిద నీకు పని తప్పించుకునే ఉపాయం చెపుతానంది. మేత మానేసి నీళ్ళు మానేసి జబ్బు చేసినట్లుగా నటించమంది. మర్నాడు ఎద్దు లేవలేదు. మేత తినలేదు, నీళ్ళు తాగలేదు. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలివేసి పొలానికి వెళ్ళిపోయాడు. రెండవ రోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాన్ని వదిలిపెట్టి గాడిదను పొలానికి తీసుకొని వెళ్ళాడు. దానితో పని చేయించాడు. ఆ పని దానికి కష్టమైపోయింది. అయ్యో! పొరపాటు చేశానే! సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది. ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది. సాయంత్రం ఎద్దును కలిసినప్పుడ ఇలా అంది. ‘‘రెండు రోజులు కులాసాగానే గడిచాయి. కాని, ఒక్కటే విచారం. నిన్ను రేపు ‘పశువధశాల’కు తోలుకుని పోతానని రైతు అన్నాడు’’ అంది. అంతే ఎద్దుకు భయం వేసింది. మరునాడు మామూలుగా మేత తిన్నది. రైతు పొలానికి తీసుకొని వెళ్ళాడు. దీనితో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది.
గాడిద సలహా! - కథ
This is a simple translate button.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి