LATEST UPDATES

24, జనవరి 2016, ఆదివారం

Itha(ఈత) - 1వ తరగతి



చెరువుకు పోదాం చెలో చెలో
ఈతలు కొడదాం చెలో చెలో

ఈత కొడుతు పోటీ పడుతూ
చేపలమవుదాం చెలో చెలో

ఈతకు పోదాం చెలో చెలో
చేపలమవుదాం చెలో చెలో

చేపల్లాగ ఈత కొడుతూ
మట్టిని తెద్దాం చెలో చెలో

ఈతకు పోదాం చెలో చెలో
మట్టిని తెద్దాం చెలో చెలో

బంక మట్టితో బొమ్మలు చేసి
ఆటలాడుదాం చెలో చెలో
చెలో చెలో ..... చెలో చెలో


Dhanda(దండ) - 1వ తరగతి



తీరొక్క పూలను తెంపుకొచ్చితిని
సూదీ దారం తోటి దండ గుచ్చితిని
చేమంతుల దండ అమ్మకిచ్చితిని
కనకాంబరం దండ అక్కకిచ్చితిని
పొన్నపూల దండ చెల్లెకిచ్చితిని
సన్నజాజి దండ వదినెకిచ్చితిని
గులాబీల దండ గుడిల ఇచ్చితిని
ఇంటి దర్వాజకు బంతిపూదండ
నా చిట్టి జడకేమొ సిరిమల్లెదండ


Uda(ఊడ) - 1వ తరగతి



ఊడ పట్టి ఊగుదాం
కొమ్మలెక్కి దుంకుదాం
ఊడ పట్టి పాకుతూ
కొమ్మ మీద చేరుదాం
ఊడ నుంచి ఊడకు
కొమ్మ నుంచి కొమ్మకు 
అందకుండ దుంకుదాం
కోతి కొమ్మ ఆడుదాం


Savaram(సవరం) - 1వ తరగతి



నాయన ఇంటికి వచ్చిండు
పాపకు సవరం తెచ్చిండు
సవరం గూట్లో పెట్టిండు
సవరం అమ్మ చూసింది
గూట్లో సవరం చూసింది
చిట్టీ జడకు వేసింది
తమ్ముడు జడను చూసిండు
సవరం పట్టుక గుంజిండు
సవరం ఊడి పోయింది
ఫక్కున అక్క నవ్వింది.

 

Anapa(అనప) - 1వ తరగతి



అన్న తెచ్చే అనపకాయ
అమ్మకు ఇచ్చే అనపకాయ
ఉడకబెట్టే అనపకాయ
అక్క ఒలిచే అనపకాయ
గుడాలుచేసె అనపకాయ
పచ్చికారం అనపకాయ
అందరు మెచ్చే అనపకాయ
ఆహా! ఓహో! అనపకాయ!

Shanaga(శనగ) - 1వ తరగతి



ముద్దు మాటలు పలికె ఓ రామచిలుకా
శనగ చేనుకు నువ్వు కావలికి పోతే
నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు
గుజ్జారి కాళ్ళకు గజ్జెలేయింతు
నువు పోయె తొవ్వల్ల శనగ పోయింతు
శనగ తిని సెయికడుగ సెలమ తోడింతు.


ఉంగరం - 1వ తరగతి



రంగు రంగుల ఉంగరం
రతనాల ఉంగరం
ఎముడాల జాతరలో
దొరికేటి ఉంగరం
జాతరలో మా తాత
కొనిచ్చిన ఉంగరం
మా దోస్తులందరికి
నచ్చినా ఉంగరం
చూపుడు వేలు మీద
చుక్కనుంటి ఉంగరం
ఎర్రెర్ర ఉంగరం
ఎముడాల ఉంగరం


ఆట - 1వ తరగతి



ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ?
ఏ ఆట నీకిష్టమూ తమ్ముడా?

గురిపెట్టి కొట్టేటి
గోటీల ఆటనా!?
గవ్వలతో ఆడేటి
పచ్చీసు ఆటనా!?
పెంకాసు ఏసేటి
తొక్కుడూ బిళ్లనా!?
         || ఏ ఆట ||
గుండ్రంగ తిరిగేటి
బొంగరం ఆటాన!?
కట్టెతో కొట్టేటి
చిర్రగోనె ఆటనా!?
చేతులతో చప్పట్ల
చెమ్మ చెక్క ఆటనా!?
          || ఏ ఆట ||
 అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క!
ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి!


కంజర - 1వ తరగతి

జజ్జనకి జనారే
కంజరనే బజారే
గజ్జెల కంజరతో
దరువులెన్నొ వేయరే
కంజరనే కొట్టరే
పాటలెన్నొ పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నో ఆడరే
ఆటలతో పాటలతో
ఆనందం పొందరే

తబల - 1వ తరగతి

తకధినతోం - తకధినతోం
చప్పుడు చేసే తబల
తరికిటతోం తరికిటతోం
తాళం వేసే తబల
ఢం ఢం ఢం ఢం
ఢం ఢం అంటూ 
దరువులు వేసే తబల

ఆటకు తబల 
పాటకు తబల
దేవుని గుడిలో
భజనకు తబల
తకధినతోం తకధినతోం
చప్పుడు చేసే తబల

23, జనవరి 2016, శనివారం

వేతన సవరణ స్కేళ్ళు-2015 ప్రభుత్వ ఉత్తర్వులు

  1. 10వ, వేతన సవరణ సంఘం సిఫారుసులు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 25 ఉర్థిక, తేది. 18.03.2015
  2. ఆర్ పి యస్-2015, రివైజ్ డ్ డి.ఎ.  ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 26, ఆర్థిక, తేది. 18.03.2015
  3. ఆర్ పి యస్-2015 రివైజ్ డ్ హెచ్ ఆర్ ఎ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 27, ఆర్థిక, తేది 18.03.2015
  4. ఆర్ పి యస్-2015 రివైజ్ డ్ సి సి ఎ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, ఆర్థిక, తేది 18.03.2015
  5. వేతన స్థిరీకరణ కొరకు ప్రొసిజరల్ ఇన్ స్ట్రక్షన్స్ మరియు ఆడిట్ ఆఫ్ క్లయిమ్స్ ప్రభుత్వ మెమో నెం. 68/1/హెచ్ఆర్ఎమ్-IV/214 ఆర్థిక తేది 04.04.2015
  6. మినిమమ్ పెన్షన్ మరియు కన్సాలిడేటేడ్ బేసిక్ పెన్షెన్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 33, తేది. 07.04.2014
  7. హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 37,  ఆర్థిక తేది. 10.04.2015
  8. ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 38, ఆర్థిక తేది. 15.04.2015
  9. మోటారు కారు, మోటారు సైకిల్, మ్యారేజి, కంప్యూటర్, ఫెస్టివల్ మరియు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ప్రభుత్వ సంఖ్య 39,  తేది 15.04.2015
  10. టిఎసుజిఎల్ఐ కంపల్సరీ ప్రీమియం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 49, తేది 27.04.2015
  11. రివైజ్డ్ స్పషల్ పే ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 56, ఆర్థిక శాఖ తేది 02.05.2015
  12. రివైజ్డ్ టి.ఎ. మరియు డి.ఎ. రేట్స్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 60, తేది02.05.2015
  13. రివైజ్డ్ ఎల్.టి.సి. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76, తేది 13.06.2015
  14. పిక్స్ డ్ టి.ఎ. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 73, తేది. 04.05.2015
  15. పిల్లల ట్యూషన్ ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 27, తేది 04.05.2015
  16. గ్రాట్యూటీ హెచ్చింపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 99, తేది 21.07.2015
  17. అదనపు పెన్షన్, మెడికల్ అలవెన్స్, కుటుంబ పెన్షన్ పొందడానికి ఆదాయ పరిమితులకు సంబంధించి ప్రభుత్వ సంఖ్య 100. తేది 21.07.2015
  18. అంగవైకల్యం కల్గిన వారి కన్వేయన్స్ హెచ్చింపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 103, తేది 24.07.2015

22, జనవరి 2016, శుక్రవారం

ఆదాయపు పన్ను గణన - ఆర్థిక సంవత్సరం (2015-16)

కేంద్ర ప్రభుత్వ ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 192ను అనుసరించి ప్రతి ఉద్యోగి తన వేతన, ఆదాయాలను బట్టి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం 12 నెలల వేతనము, ఇతర ఆదాయాల మొత్తంపై పన్నును మదింపు చేయాలి.

2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం 2015 ప్రకారం ఆదాయపు పన్ను శ్లాబ్ లలో ఎలాంటి మార్పులేదు. కాని నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగినది.

I. ఆదాయంగా పరిగణింపబడే అంశాలు:

1. పే(pay)
2. డిఎ(DA)
3. హెచ్.ఆర్. ఎ. (HRA)
4. CCA
5. IR
6. అడిషనల్ & యఫ్.డి. ఇంక్రిమెంట్లు
7. వేతన బకాయిలు
8. సరెండర్ సెలవు
9. బోనస్
10. సెలవు వేతనము
11. ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్
12. పెన్షన్
13. సబ్ సిస్టెన్స్ అలవెన్స్
14. మెడికల్ అలవెన్స్ మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.

II. ఆదాయంగా పరిగణింపబడని అంశాలు:

1. పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యూటి, కమ్యూటేషన్, GIS, GPF, APGLI, లీవ్ ఎన్ క్యాష్ మెంట్.
2. L.T.C.
3. మెడికల్ రీఎంబర్స్ మెంట్
4. టూర్/ట్రాన్స్ ఫర్ T.A. & D.A.
5. ఎడ్యుకేషన్ అలవెన్స్
6. కన్వేయన్స్ అలవెన్స్

III. HRA మినహాయింపు (సెక్షన్ 10):

ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్స్
బి) వాస్తవంగా చెల్లించిన ఇంటి అద్దె - 10% వేతనము (Pay + DA)
సి)  40% వేతనము (పట్టణాలు, గ్రామాలు), 50% వేతనము (మెట్రోనగరాలు)

పై మూడింటిలో ఏది తక్కువగా ఉంటే అది మినహాయించబడుతుంది.
నోట్:-
1. ఇంటి అద్దె అలవెన్స్ నెలకు రూ. 3,000 కన్నా ఎక్కువ పొందుతున్న వారు దానికి మినహాయింపు పొందాలంటే విధిగా ‘‘ఇంటి అద్దె రసీదు’’ డిడిఓ కు సమర్పించాలి.
2. స్వంత ఇంటిలో నివసించు వారికి హెచ్. ఆర్. ఎ. వర్తించదు.

IV. తగ్గింపులు(Deductions):

ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్ ఆర్ఎ మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.
1. వృత్తి పన్ను సెక్షన్ 16(iii): ఉద్యోగి సంవత్సరంలో చెల్లించిన పన్ను ఆదాయం నుండి పూర్తిగా మినహాయించబడును.
2. స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితి గరిష్టంగా 2013-14 సం.కి ముందు తీసుకున్నవారికి రూ. 1,50,000ల వరకు, 2013-14 తర్వాత లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 వరకు మినహాయిస్తారు.

V. చాప్టర్ VI - A క్రింద తగ్గింపులు:

సెక్షన్ 80 సి ప్రకారం ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.
i) LIC
ii) GPF/PF
iii) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
iv) PLI
v) GIS
vi) CPS
vii) APGLI
viii)PPF
ix) SBI Life
x) ఇంటి రుణాలపై చెల్లించు అసలు
xi) ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు
xii) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్స్
xiii) పోస్టాఫీస్ లేదా ఏదైనా షెడ్యూల్ బ్యాంక్ లో 5 సం.లకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు
నోట్:- 80సి, 80సిసిసి, 80సిసిడిల క్రింద తగ్గింపులు మొత్తం రూ. 1,50,000ల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
VI. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 25,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 30,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపు.
3) ఉద్యోగి, భార్య/భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్అప్ నిమిత్తం రూ. 5000 వరకు పైన పేర్కొన్న గరిష్ఠ పరిమితికి లోబడి పన్ను నుండి మినహాయింపబడుతుంది.

VIII) వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్ 80డిడి):

మానసిక, శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ మరియు నిర్వహణకై చేసిన ఖర్చులు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ. 75,000 గరిష్ఠ పరిమితితో 2) 80% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ. 1,25,000 గరిష్ఠ పరిమితితో తగ్గింపబడుతాయి.

 VIII) వైద్య చికిత్సకై ఖర్చులు (సెషన్ 80 డిడిబి):

ఉద్యోగి స్వంత విషయంలో గాని, ఆధారపడిన కుటుంబీకులకుగాని కేన్సర్, Talassemia, Haemophilla, Nuerological diseases, Aids మరియు Chronic Renal Failure వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుచున్నవారు, వారిపై ఆధారపడిన భార్య/భర్త, పిల్లలు, తల్లి/తండ్రి వైద్యఖర్చుల నిమిత్తం రూ. 40,000/-, 60 సం.లు పైబడితే రూ. 60,000 వరకు, 80 సం.లు పై బడితే రూ 80,000 వరకు మినహాయింపు కలదు.

IX) విరాళములు (80 జి):

i) ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి, ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయబాలలనిధి, యూనివర్సటీలు, అర్హత ఉన్న విద్యాసంస్థలకు ఇచ్చిన విరాళాలు మొత్తం ఆదాయం నుండి 100% తగ్గించబడును.
ii) ప్రధానమంత్రి కరవు సహాయనిధి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారకనిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, దేవాలయం, మసీదు, చర్చీల వంటి మత సంస్థలకు ఇచ్చిన విరాళములలో 50% తగ్గించబడును.
నోట్:- 80డి, 80డిడి, 80డిడిబి సెక్షన్ ల క్రింద జమచూపే మినహాయింపులను డ్రాయింగ్ అధికారులు అనుమతించగూడదు. ఇవి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ యొక్క అసెసింగ్ అధికారులు ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ను జూలైలో సమర్పించేటప్పుడు మాత్రమే అనుమతించి అధికముగా చెల్లించిన మొత్తమును రీఫండ్ చేస్తారు. 80 జి సెక్షన్ క్రింద పిఎమ్ రిలీఫ్, సిఎమ్ రిలీఫ్ ఫండ్ వంటి చందాలు తప్ప ఏ ఇతర చందాలను డిడిఓ అనుమతించరాదు.

 X) ఎడ్యుకేషన్ లోను (సెక్షన్ 80 ఇ):

ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువుల కోసం ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని 8 ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు పూర్తిగా తగ్గించబడును.

XI) వికలాంగుడైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80 యు):

వైద్యాధికారి ధ్రువ పత్రం ఆధారంగా 40% కంటె ఎక్కువ వైకల్యం గల వారికి రూ. 75,000 వరకు, 80% కంటె ఎక్కువ వైకల్యం ఉన్న గరిష్ఠంగా 1,25,000 వరకు మినహాయింపు కలదు.

ఉద్యోగి మొత్తం ఆదాయం నుండి హెచ్ ఆర్ ఎ మరియు పైన  పేర్కొనబడిన మినహాయింపులు/తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పై క్రింది రేట్ల ప్రకారం పన్ను లెక్కించబడును.
క్ర.సం. ఆదాయం 80 సం.పై బడిన వెరీ సీనియర్ సిటిజన్ 60 సం.పై బడిన వెరీ సీనియర్ సిటిజన్ ఇతరులు
1 2,50,000 వరకు -Nil- -Nil- -Nil-
2 2,50,001 - 3,00,000 -Nil- -Nil- 10%
3 3,00,001 - 5,00,000 -Nil- 10% 10%
4 5,00,001 - 10,00,000 20% 20% 20%
5 10,00,001 పైబడిన ఆదాయం 30% 30% 30%
  1. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రూ. 2,000లు గరిష్ఠ పరిమితితో పన్నులో రిబేటు ఇస్తారు. 
  2. ఒక కోటి రూపాయల కంటె ఎక్కువ ఆదాయం గల వారికి ఆదాయపు పన్నుపై అదనంగా 12% సర్ చార్జి విధించబడును.
  3. ఆదాయపన్నుపై 3% విద్యాసెస్సు విధించబడును.
  4. స్వచ్ఛభారత్ కోశ్ లేదా గంగా ప్రక్షాళన్ నిధులకు ఇచ్చే విరాళాలను ఆదాయపు పన్ను నుండి ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడమైనది. (సెక్షన్ 10 (23) సి)
  5. సెక్షన్ 80-సి క్రింద కొత్తగా ఈ సంవత్సరం నుండి సుకన్య సంవృద్ధి పథకంలో రూ. 1,50,000 గరిష్ఠ పరిమితికి లోబడి పొదుపు చేసుకునే అవకాశం కల్పించబడినది.
  6. సెక్షన్ 80 సిసిడి (1బి) ప్రకారం కొత్తగా జాతీయ పెన్షన్ పథకంకు వేతనాలలో అదనంగా రూ. 50,000/-ల వరకు మినహాయింపు ఇవ్వనైనది.
ఆదాయం 2.5 లక్షల కంటె తక్కువగల ఉద్యోగులు ఎలాంటి రిటర్న్స్ సమర్పించవలసిన అవసరం లేదు. పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి ప్రస్తుత ఆర్థిక సం. 2015-16 నకు సంబంధించి తన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను నిర్ణీత ప్రొఫార్మా-16 లో సంబంధిత డ్రాయింగ్ అధికారికి సమర్పించవలెను.
 ---------అధ్యాపక జ్వాల