LATEST UPDATES

13, డిసెంబర్ 2020, ఆదివారం

EHS సందేహాలు - సమాధానాలు

EHS  సందేహాలు - సమాధానాలు

సందేహం: ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?

సమాధానం: ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.

సందేహం: తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
సమాధానం: తెల్లరేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.

సందేహం: ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?

సమాధానం: కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.

సందేహం: సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?

సమాధానం: అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.

సందేహం: దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?

సమాధానం: అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.

సందేహం: నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?

సమాధానం: కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

సందేహం: భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?

సమాధానం: అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.

సందేహం: ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?

సమాధానం: కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.

సందేహం: నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?

సమాధానం: అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.

సందేహం: *25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?

సమాధానం: ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్‌ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్‌ చేస్తుంది.

సందేహం: నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయటం ఎలా?

సమాధానం: హోమ్‌ పేజీలో సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత 'ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌' పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ జెనరేట్‌ చేసిన పాస్‌వర్డ్‌ దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరుకు, ఇ మెయిల్‌ ఐడికి అందుతుంది.

సందేహం: కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?

సమాధానం: పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్‌ జెఇఓ (ఇహెచ్‌ఎస్‌) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్‌ వివరాలను ఎడిట్‌ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్‌ చేయటానికి కుదరదు.

సందేహం: పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్‌ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?

సమాధానం: అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.telangana.gov.in పోర్టల్‌లో యూజర్‌ ఐడి, పేరు, అసలు మొబైల్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.

సందేహం: ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్‌ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి లేదా పాస్‌వర్డ్‌' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?

సమాధానం: ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఏదీ వుండదు. రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్‌ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ "nAI0xQk7" ” (కేస్‌ సెన్సిటివ్‌) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్‌ చేయాలి.

సందేహం: పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?

సమాధానం: రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్‌ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.

సందేహం: ఆధార్‌ కార్డులో ఉన్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్‌ చేయాలి?

సమాధానం: సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో ఉన్న పేరు వ్రాయండి.

సందేహం: పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?

సమాధానం : పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.

సందేహం: లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?

సమాధానం: దరఖాస్తుదారు రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్‌ పంపటం జరుగుతుంది.

ఎ. దరఖాస్తుదారు పాస్‌వర్డ్‌ మారుస్తున్నప్పుడు

బి. దరఖాస్తుదారు ''ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు*

*సి. పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు*

*డి. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు

13, అక్టోబర్ 2020, మంగళవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

జవాబు:
ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.

ప్రశ్న:
ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?

జవాబు:
ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

జవాబు:
వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

ప్రశ్న:
దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

జవాబు:
FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును.
G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
    
ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?

జవాబు:
ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu, Hindi, Urdu ఎవరు రాయాలి?

సమాధానం:
ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.

ప్రశ్న:
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

సమాధానం:
G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974 ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను, రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days... అని వున్నది. అందుచేత 11 రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.

 ప్రశ్న:
ముగ్గురు పిల్లల తల్లి అయిన ఉపాధ్యాయురాలు "హిస్టరెక్టమీ" ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజులు సెలవు వర్తిస్తుందా?

సమాధానం:
G.O.Ms.No.52 Fin Dept, Dt:1-4-2011లో "45 days for women employees who undergo hysterectomy operation అని వున్నది. ఇందులో ఎంతమంది పిల్లలు వుండాలన్న ప్రసక్తే లేదు. అందుచేత నిరభ్యంతరంగా 45 రోజుల సెలవులు వాడుకోవచ్చును.

ప్రశ్న:
నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను. రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే, DEO గారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం:
అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి

ప్రశ్న: 
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

సమాధానం: 
అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.

ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు. తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు.

సమాధానం:
F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.

ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు 23 ఏప్రిల్ చివరి పనిదినం నాడు పాఠశాలకు హాజరు కాలేదు. వేసవి సెలవులలో అతని జీతం చెయ్యవచ్చునా?

సమాధానం:
ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలలోని రూల్ 22A ప్రకారం వేసవి సెలవులను ఏ 'లీవ్' తో నైనా జోడించుకోవచ్చును (CL/spl.CL) తప్ప) ఆ ప్రకారంగా 23 ఏప్రిల్ నాడు ఏదో ఒక లీవ్ (HPL/EL/EOL) మంజూరు చెయ్యాలనే అభ్యర్ధనపై సెలవు మంజూరుచేసి అదే ఉత్తర్వులోనే 'Vacation' ను లీవ్ కు జోడిస్తూ ఉత్తర్వులు ఇచ్చి యధావిధిగా వెకేషన్ జీతం కూడా చెయ్యవచ్చు.

ప్రశ్న:
FAC గా పనిచేసిన వారికి అలవెన్స్ అర్హత వుందా?షరతులేవి?

సమాధానం:
FR-49(2) ప్రకారం కనీసం 15 రోజుల కాలం FAC గా పనిచేస్తేనే FAC అలవెన్స్ లేదా అడిషనల్ చార్జ్ అలవెన్స్ మంజూరు చేస్తారు.FR-49(i)(a) ప్రకారం మొదటి మూడు నెలల కాలానికి  'పే' లో 1/5 వ భాగం మరియు ఇతర అలవెన్స్ లు తరువాతి మూడు నెలల కాలానికి 'పే' లో 1/10 వ భాగం మరియు అలవెన్స్ లు మంజూరు చేస్తారు.

ప్రశ్న:
నేను 1994 M.A,B.Ed అర్హతలతో SGT గా చేరి 3 అదనపు ఇంక్రిమెంట్లు పొందుతున్నాను. 2015 లో SA ప్రమోషన్ పొందాను. SA క్యాడర్ లో అదనపు ఇంక్రిమెంట్లు కొనసాగుతాయా ?

సమాధానం:
SA ప్రమోషన్ పొందినప్పటికి SGT  క్యాడర్ లో అదనపు అర్హతలకు ఇంక్రిమెంట్లు అన్నీ యధావిధిగా కొనసాగుతాయి. G.O.Ms.No.40 తేది:02-02-1993 లోని నిబంధన 3(i) మరియు DSE వివరణ ఉత్తర్వులు R.C.No.1043/G4/93 తేది:19-08-1993 ల ద్వారా పై విషయం స్పష్టం చేయబడింది.

ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?

సమాధానం:
ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సెలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు, వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

సందేహం:

ఒక ST ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వోదోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుని కి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉంటుందా?

సమాధానం:

అర్హత ఉంటుంది. తాత లేక తండ్రి ఉద్యోగస్థులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులైనప్పటికి వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Rc.No.860/Ser.4-3/2018 తేది: 12.01.2018 ద్వారా వివరణ ఇచ్చారు.

 సందేహం:

ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సంధర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా?సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు?

సమాధానం:

సస్పెండైన ఉద్యోగి క్రమశిక్షణా చర్యలు పూర్తికాకుండానే చనిపోయిన సంధర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించి అతనికి రావాలసిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో.275,F&P,తేది:8-8-1977 ద్వారా సూచించింది.

 సందేహము:

చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?

 సమాధానము:

G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.

సందేహము:

చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?

 సమాధానము:

చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.

 సందేహము:

చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?

 సమాధానము:

వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.

 సందేహము:

మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?

సమాధానము:

చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.

 సందేహము

సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?

 సమాధానము:
అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.

సందేహము:

భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?

 సమాధానము:

వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో *Women Employees* అని ఉన్నది.

 సందేహము:

చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?

సమాధానము:

అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

 సందేహము:

పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా ?

 సమాధానము:

GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations, sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.

 సందేహము:

చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?

 సమాధానము:
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును..

సందేహం..

ప్రశ్న: మా ఒక పాఠశాల లో SA హిందీ సీనియర్ సర్ కానీ ఆమెకు గతంలో 10.th వుండి  hpt తో ఉద్యోగ0 వచ్చింది.అందువల్ల ఆమెకు ఇంటర్ లేదు అని స్కూల్ ఛార్జ్ ఇవ్వబడలేదు.
ఇప్పుడు ఇంటర్  ఓపెన్ exam ద్వారా పాస్ అయిన అని చెప్పి స్కూల్ ఛార్జ్ అడుగుతున్నారు. ఆ పాఠశాల hm .meo గా fac ఛార్జ్ పై వెళ్లారు.గతంలో ఆమె తరువాత సీనియర్ కి 10th, inter,degree ,MA.eot. got కూడా ఉన్నందున వారికి ఇప్పటివరకు ఛార్జ్ ఇచ్చారు.సమస్య ఏమిటి అంటే Sa హిందికి పూర్తి గాని పాక్షికంగా గాని ఛార్జ్ ఇవ్వవచ్చ తెలుపగలరు. ఆమె hpt.తరువాత ఇప్పుడు ఇంటర్ పాస్ అయేరు.

జవాబు...

ఆమె ఎలిజిబుల్ కాదు.ఎందుకంటే go 23 ప్రకారం 10.ప్లేస్ 2 ప్లేస్ 3 ప్లేస్ వరుసగా పాస్ అయితే నే pghm కు ఎలిజిబుల్ వారికి మాత్రమే స్కూల్ fac గాని ఒక పూట గాని ఛార్జ్ ఇవ్వవచ్చు కానీ ఇక్కడ 10th పాస్ అయి ఇంటర్ లేకుండా hpt చేసింది.10 ఇయర్స్ గడిచిన తరువాత ఇప్పుడు ఇంటర్ పాస్ అయి నదున hpt అంటే హయ్యర్ క్యాడర్ తరువాత లోయర్ క్యాడర్ ఇంటర్ ఇప్పుడు చెల్లదు. అందువల్ల 12.ఇంక్రిమెంట్ కు 18 ఇయర్ ఇంక్రిమెంట్ కు ఎలిజిబుల్ కాదు.కావున స్కూల్ ఛార్జ్ ఇవ్వరాదు....

30, ఆగస్టు 2020, ఆదివారం

చట్టానికి కళ్ళులేవ్ ! రచయిత :షేక్ రంజాన్

చట్టానికి  కళ్ళులేవ్ ! రచయిత :షేక్ రంజాన్

 

చట్టానికి కళ్ళులేవ్!

     ........................... 

రైతు     రుణాలు 

కట్టకపోతే  జప్తులు 

పెట్టుబడిదారులు రుణాలు 

కట్టకపోతే అడిగేవారే లేకపోయా 

బడా బాబులకు మాత్రం మాఫీలు 

అయినా .......... 


       చట్టానికి  కళ్ళులేవ్!


రెవన్యూ భూముల గోలమాల్ 

అధికారులే  ఆసరా 

ప్రభుత్వాలే కొండంత అండ 

రియల్ దందాలూ 'రియాలే '

అబద్దాలేమీ కావు............... 

అయినా............... 


        చట్టానికి   కళ్ళులేవ్ !


ఒకడేమో కులంతో 

మరొకడు మతంతో

కొందరేమో భాషతో 

మరికొందరు ప్రాంతం......

అయితేనేం.......... ప్రజాస్వామ్యం ఖూనీ 

అయినా .......... 


         చట్టానికి  కళ్ళులేవ్ 


 కర్షక  కార్మికుల

శ్రమజీవుల ఫలాలను 

పెట్టుబడిదారీ వర్గం 

పాలకవర్గం కలిసి మరి... 

దోపిడీ చేస్తున్నా .... 

అయినా ......... 


         చట్టానికి కళ్ళులేవ్ !


దోపిడీదారులు  అరాచకులు 

కుల, మత ప్రచారకులు 

ఎంపీలు, ఎం యల్ ఏ లు, మంత్రులై 

రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నా...... 

అయినా ......... . 


        చట్టానికి  కళ్ళులేవ్! 


విద్యా   వైద్యం 

కార్పోరేటీకరణ  ప్రైవేటీకరణ అవుతూ 

ఉన్నత చదువు పేదోడికి దూరమై 

ఉన్నోడికి దగ్గర అవుతున్నా...... 

అయినా ............. 


        చట్టానికి  కళ్ళులేవ్ !


ఎలక్షన్ సంఘం మూగబోయి 

ప్రశ్నించిన వారి పై  దాడిచేసి 

అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 

దోపిడీదారులు గెలుస్తున్నా... 

అయినా ............. 


        చట్టానికి  కళ్ళులేవ్ !


రాజకీయవ్యవస్థ   అవినీతి 

ప్రజాస్వామ్య మూలలను హరిస్తున్నా.. 

న్యాయస్థానం పై ప్రజల్లో 

విశ్వాసం  సన్నగిల్లుతున్నా... 

అయినా ............. 

        

        చట్టానికి  కళ్ళులేవ్ !


రాజ్యయంత్రాంగం సుప్రీంకోర్టు 

ఒకే వైఖరి అవలంభిస్తున్న 

వ్యవహారశైలి  ఎట్లున్నా 

అటార్నరీ జనరల్ స్పందించక పోయినా... 

అయినా ................ 


         చట్టానికి  కళ్ళులేవ్ !


కోర్టులు తమ కేసును 

తామే విచారించి శిక్ష విధిస్తున్న 

న్యాయవ్యవస్థ  అవినీతి 

పార్లిమెంట్ లో చర్చ జరగక పోయినా... 

అయినా .............. 


         చట్టానికి  కళ్ళులేవ్ !


న్యాయవ్యవస్థ  ముఖచిత్రం 

సామాజిక మాధ్యమాల ప్రభావం.... 

భారత పాలనావ్యవస్థ 

తీరుతెన్నులకు అద్దం పడుతున్న 

అయినా ......... 


       చట్టానికి  కళ్ళులేవ్ !


రచయిత :-షేక్ రంజాన్

13, ఆగస్టు 2020, గురువారం

ఓ మనిషీ తెలుసుకో - రచన షేక్ రంజాన్

 

ఓ మనిషీ తెలుసుకో - రచన షేక్  రంజాన్

* ఓ మనిషీ తెలుసుకో *

      --------------------------


కులము లేనివాడు గుణవంతుడౌతాడు 

మతము లేనివాడు మానవతావాదౌతాడు 

ప్రాంతాలు లేనివాడు పరోపకారుడౌతాడు 

ఇవన్నీ ఉన్నోడు దేశ ద్రోహుడౌతున్నాడు!


         ఓ మనిషీ  తెలుసుకో !

తెలుసుకొని మసలుకో!!


భగవత్ గీత  చదివినవాడు 

మార్గం  చూపుతానంటాడు, 

బైబిల్  చదివినవాడు 

శాంతి   పరుస్తానంటాడు,

ఖురాన్  చదివినవాడు 

ఆకలి     తీరుస్తానంటాడు.

ఏమీ చదవనివాడు 

దేశభక్తుడనంటాడు. 


      ఓ మనిషీ  తెలుసుకో !

తెలుసుకొని మసలుకో !!


చదువు చెప్పే గురువుకు 

కులమతాలు  లేవయ్యా !

దేశాన్ని   కాపాడేవాడికి 

కులమతాలు  లేవయ్యా! 

పంట పండించే రైతుకు 

కులమతాలు    లేవయ్యా !

యంత్రాలు తయారుచేసే వారికీ 

కులమతాలు లేవయ్యా 

దేశాన్ని పాలించే పాలకులు 

కుల మతాలు  అంటా రేమిటయ్యా ? 


        ఓ మనిషీ  తెలుసుకో !

తెలుసుకొని మసలుకో!


పాలకులు వాడే వస్తువులేమో పరదేశీవీ..

తినే తిండి మాత్రం స్వదేశీది...

విదేశాలు వెళ్ళితే కులమతాలపై  హితబోధలు..

స్వదేశంలో  మాత్రం కుతంత్రాల కులమతాల కాష్టాలు.. 


        ఓ మనిషీ  తెలుసుకో!!

తెలుసుకొని మసలుకో !!


రచయిత :- షేక్  రంజాన్

అంశం - శ్రీ కృష్ణ తత్వం జీవన సూత్రం - రచన శ్రీ చిప్ప ఓదయ్య

అంశం - శ్రీ కృష్ణ తత్వం జీవన సూత్రం - రచన శ్రీ చిప్ప ఓదయ్య
 

అంశం

శ్రీ కృష్ణ తత్వం జీవన సూత్రం



దేవకి నందన శ్రీకృష్ణ 

వెన్న మీగడల బాలకృష్ణ

కృష్ణ తత్వమే జగత్తంతా

తెలుసుకోలేరు ఈ జనమంతా

కృష్ణ శబ్దమే శ్యామలవర్ణం

ధరణి దున్నడం సశ్యశ్యామలం

కృష్ణను కాపాడిన కన్నయ్యా

అర్జున రథసారథి క్రిష్ణయ్యా

నల్లని పద్మ నయనములవాడా

ఫింఛమును ధరించిన వాడా

గోపికల మనసు దోచాడు

గోప బాలురతో ఆడిపాడాడు

మధురలో బాలకృష్ణ నువ్వేగా

పూరీ జగన్నాథుడవు నువ్వేగా

మురళీ కృష్ణ రారా

మురిపాల కృష్ణ రారా

ఉడిపిలో శ్రీకృష్ణ నీవే

గురువాయూర్ గురవాయప్ప 

                                నీవే

పండరి విఠోబా నీవేగా

పాండవుల రక్షణ నీవేగా

కంసుని వధించిన కన్నయ్యా

కుచేల సఖుడ కృష్ణయ్యా

ప్రాణం పోగొట్టుకున్న పూతన

భాగవతం విరచిత పోతన

హరేకృష్ణ భక్తి ఉద్యమం

మానవాళికి మహా ప్రసాదం

జీవకోటికి  మోక్ష ప్రదానం

భగవద్గీత భారతావని దిక్చూచి

  

        చిప్ప ఓదయ్య

తెలుగు భాషా పండితులు

3, ఆగస్టు 2020, సోమవారం

సందేహం: భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు. ఇద్దరు పాత పెన్షన్ పరిధిలో ఉన్నవారే! అయితే, దురదృష్టవశాత్తు భర్త గుండెపోటుతో మరణించాడు. భార్య సర్వీస్ లోనే ఉన్నారు. భర్త చనిపోయిన కారణంగా... భార్యకు ఫ్యామిలీ పెన్షన్ కూడా చెల్లిస్తున్నారు.ఈ ఫ్యామిలీ పెన్షన్ పై Dearness Relief (DR ) చెల్లిస్తారా?

సందేహం: భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు. ఇద్దరు పాత పెన్షన్ పరిధిలో ఉన్నవారే! అయితే, దురదృష్టవశాత్తు భర్త గుండెపోటుతో మరణించాడు. భార్య సర్వీస్ లోనే ఉన్నారు. భర్త చనిపోయిన కారణంగా... భార్యకు ఫ్యామిలీ పెన్షన్ కూడా చెల్లిస్తున్నారు.ఈ ఫ్యామిలీ పెన్షన్ పై Dearness Relief (DR ) చెల్లిస్తారా?

సందేహం:
భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు. ఇద్దరు పాత పెన్షన్ పరిధిలో ఉన్నవారే! అయితే, దురదృష్టవశాత్తు భర్త గుండెపోటుతో మరణించాడు. భార్య సర్వీస్ లోనే ఉన్నారు. భర్త చనిపోయిన కారణంగా... భార్యకు ఫ్యామిలీ పెన్షన్ కూడా చెల్లిస్తున్నారు.ఈ ఫ్యామిలీ పెన్షన్ పై Dearness Relief (DR ) చెల్లిస్తారా? 

సమాధానం:

> DR చెల్లిస్తారు

> G.O.Ms.No.33 Fin Dt: 07.04.2015 లోని point.26 లో ఇలా ఉంది "The employed family pensioner shall be entitled for payment of Dearness Relief on family pension irrespective of the fact that he/she getting Dearness Allowance  on his/her pay. 

> ఫ్యామిలీ పెన్షన్ పై DR ఎప్పుడు చెల్లించరంటే......

1. ఒక సర్వీస్ పెన్షన్, మరొక ఫ్యామిలీ పెన్షన్... ఇలా రెండు పెన్షన్లు ఒకరే పొందుతున్న సందర్భాల్లో.... ఫ్యామిలీ పెన్షన్ పై DR రాదు.

2. కారుణ్య నియామకం పొందిన సందర్భాల్లో కూడా ఫ్యామిలీ పెన్షన్ పై DR చెల్లించరు.

2, ఆగస్టు 2020, ఆదివారం

సందేహం: సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్లు,పెన్షన్ కు లెక్కిస్తారా?

సందేహం: సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్లు,పెన్షన్ కు లెక్కిస్తారా?

సందేహం:
సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్లు,పెన్షన్ కు లెక్కిస్తారా?

సమాధానం:
వివిధ కారణాలతో  కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి సస్పెన్షన్ కు గురవుతారు. కొన్ని నెలలపాటు సస్పెన్షన్ ఉన్న తర్వాత Competent Authority .... సస్పెన్షన్ ఎత్తివేసి... వారిని తిరిగి రీఇన్స్టెట్ చేస్తారు. చాలా కేసుల్లో సస్పెన్షన్ పీరియడ్ కు ఎలిజిబుల్ లీవ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలూ జారీచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో సదరు ఉద్యోగికి సస్పెన్షన్ కాలానికి సరిపోయే సెలవులు.... Half Pay Leave మరియు Earned Leave నిల్వ లేనప్పుడు... అనివార్యంగా జీతనష్టపు అసాధారణ సెలవు (Extraordinary Leave on Loss of Pay) మంజూరు చేయాల్సి ఉంటుంది. మామూలుగానైతే, జీతనష్టపు అసాధారణ సెలవు మంజూరు ఎన్ని రోజులు ఉంటుందో.... అన్ని రోజులు వార్షిక ఇంక్రిమెంటును కూడా పోస్టుపోన్ చేస్తారు. కానీ, సస్పెన్షన్ పీరియడ్ కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ... GO Ms No 307 Fin (FR.II) Department dated 03.12.2012 నంబర్ జీవో జారీచేసింది.

31, జులై 2020, శుక్రవారం

స్వదేశీ - రచన శ్రీ చిప్ప ఓదయ్య

స్వదేశీ - రచన శ్రీ చిప్ప ఓదయ్య
స్వదేశీ

స్వదేశీవస్తువులనే వాడుదాం
స్వంతంగా నిలదొక్కుకుందాం
అవనిపై భారతశక్తినిచాటుదాం
ప్రపంచదేశాల సరసన చేరదాం
స్వదేశీ వస్త్రాలేవాడుదాంఅన్న
గాంధీజీ టంగుటూరి మరెందరో
మహనీయులే మనకు స్ఫూర్తి
వారి బాటలోనే పయనిద్దాం
భావితరాలకు బంగారుబాటలు
వేయడానికి ప్రతిన పూనుదాం
విదేశీవస్తువులు విలాసాలకు
పుట్టిల్లులామనకుఎన్నిచేరినాస్వదేశీవస్తువులదరికిచేరలేవు
విదేశీ వస్తువులు పాడైతేవాటికి పాడెకట్టుడే కొత్తదానికొరకు
ఉరుకులాటనే తండ్లటనే
పొరుగింటి పుల్లకూర రుచి మరిగిన జనులకుఇంటికూరలా
మనవస్తువులవాడకంపెంచాలి
అన్ని కొట్టులలో అవే ఉండాలి
జనం అలవాటుగామారుతుంది

నాణ్యతతో ధరలందుబాటులో
ఉంటే ఏ దేశం వస్తువులైనా
మనముందు పేలిపోతాయి
లాభాలు ముందు రాకున్నా
జీవితకాలం లాభాలపంటనే
చైనా బొమ్మలుచూడు అవి
తెచ్చిన్నాడే  పాడైతవని
అందరికి తెలుసు కానీ     
పిల్లల మారాం భరించలేక
తీసుకుంటారందరు అలాగే
చైనా చరవాణిలు పాడైతవని 
తెలిసిమనమేకొంటాము ఇక
బొమ్మలను బొందపెట్టాలి
చరవాణిలకు చరమగీతం
పాడాలి ఇక మనయే వాడాలి
సబ్బులతో మొదలుసౌందర్య
సాదనాలన్నీ మనవే కావాలి
సంతూర్ మైసూర్సాండిల్ కు 
సాటి లక్స్ లిరిల్ లైఫ్ బాయ్
అసలే కావు xxx నిర్మా మనవే
అయినా జనం రిన్ ఏరియల్
కావాలంటారెందుకోఅర్థంకాదు
పల్లపొడులెన్నున్నఫేస్టులెన్నున్న
కోల్గేట్ క్లోజప్ ల వైపే జనం
మిల్క్ ప్రొడక్ట్స్ లెన్నున్నవాటిని
 బ్రిటానియా మింగేస్తుంది
ఆశీర్వాద్ అట్ట ఉన్నా  దానిని
అన్నపూర్ణ  కప్పేస్తుంది   బిస్లరీ ఉన్నా ఎందుకు కిన్లీపై మోజు
థమ్స ఫ్ కోకోకోలా సరేసరి
టాటా రిలియన్స్ ఉన్నను       సోనీ సామ్ సంగ్ దిక్కు చూపు
అవేమంచిదంటారు ఎందుకంటే
రాజుగారిపెద్దభార్యమంచిదంటే
చిన్నభార్య చెడ్డదని చెప్పకనే
చెప్పి నట్లనుకుంటరు  జనులు
వంటనూనెలెన్నున్న మనకు
వండడానికి పనికి రావన్నట్లు
టీ కాఫీ పొడులెన్నున్నా తాగడానికి పనికి రావన్నట్లు
 స్వదేశీ వస్తువులంటే  నామోషీ
విదేశీ వస్తువులుంటే మనకు      
 విలు పెరిగినట్టుభావిస్తున్నారు
జనుల లో కొందరు
చూసే చూపు లో తేడా మారాలి
స్వదేశీ వస్తవులనే వాడాలి
స్వరాజ్య సంపద ను  పెంపొందింప చేస్తాం

జై భారత్ మహాన్

మేక్ ఇన్ ఇండియా


చిప్ప ఓదయ్య తె ,నం
ప్రా.ఉ.పా బొమ్మరెడ్డిపల్లి
మం ధర్మారం
జిల్లా పెద్దపల్లి
తెలంగాణ


2
స్వదేశీ   
 
     స్వదేశీ వస్తువులే అవసరాలకు
విదేశీ వస్తువులు విలాసాలకు
స్వదేశీ వస్తువులనే వాడుదాం
స్వంతంగా తయారు చేసుకుం
                                   దాం-1
విదేశీ వస్త్రాల బహిష్కరణ
స్వదేశీ వస్త్రాల స్వీకరణ
విదేశీ వస్త్రాలు వద్దు
స్వదేశీ వస్త్రాలు ముద్దు-2

గాంధీజీ ప్రకాశంల ఉద్యమం
విదేశీ వస్త్రాలపైనే ఉద్యమం
విదేశీ వస్త్రాలు విడవడం
చేనేత వస్త్రాలను వాడడం-3

స్వదేశీ వస్తువులు మనపుట్టిల్లు
విదేశీ వస్తువులు   మెట్టినిల్లు
పుట్టింటి వస్తువులు మరిపించు
మెట్టినింటివి అన్ని మురిపించు
                                         -4
మనవాటి వాడకం పెంచాలి
అందరి దృష్టిలో పడాలి
జనానికి అలవాటు అవుతుంది
మార్కెట్ మనదే అవుతుంది-4

చైనా ఫోన్లకు స్వస్తిపలుకుదాం
మన ఫోన్లనే  వాడదాం
సబ్బులన్ని మనవే కావాలి
బొమ్మలన్నీ మనవే కావాలి-5

ఆశీర్వాదట్టను అన్నపూర్ణ కప్పే
                                    స్తుంది
బిస్కెట్లను బ్రిటానియా మింగే
                                    స్తుంది
 థమ్సన్ కోకోలపై ఉన్నమోజు
ఎందుకుండదు కిన్లీపై మోనా*6

టాటా రిలియన్స్ ఎన్నున్న
పండ్లపొడుల ఫేస్టులు ఎన్నున్న
సోనీ సామ్సంగ్ కావాలంట
కోల్గేట్ క్లోజప్ కావాలంట-7

నిర్మల్ బొమ్మలు నిండుచంద- 
                               మామలు
విదేశీ బొమ్మలు విదేశీ భామలు
తెచ్చిన్నాడే తేలి పోతాయి    
చూచిన మనకండ్లు వాలిపోతా 
                                యి-7

   అవనిపైన భారతశక్తిని చా
                             టుదాం 
ప్రపంచదేశాల సరసన చేరుదాం
పెద్దల బాటలో పయనిద్దాం  
మనం భారతీయులని గర్విద్దాం
                                        -8
చైనా బొమ్మలు చూడు
 మన బొమ్మలు చూడు
తెచ్చిన్నాడే పాడైతవి చైనావి
రంగన్నపోదు మన బొమ్మలు-9


ఉప్పుతోటి తొమ్మిది దొరికినంక
జనమెందుకు పోతారు బయట
                                    -కింక
కొట్టులో స్వదేశీ వస్తువులుండా
                                        -లి
ఊరిజనం ఎక్కడికెల్లకుండ
                     -చూడాలి-10

ఊల్లలో మనవస్తువుల వాడక 
                              -మెక్కువ
నగరాల్లో వాడకం తక్కువ
జనం అభిరుచి మారాలి
జాతీయ భావాలు మొలకెత్తాలి
                                      -11

చిప్ప ఓదయ్య
తెలుగు భాషా పండితులు
మం.ప్రా.ఉ.పా.బొమ్మరెడ్డిపల్లి
మం.ధర్మారం జిల్లా. పెద్దపల్లి
తెలంగాణ 505416
ఫోన్. నం 7382322134

30, జులై 2020, గురువారం

సైనికుడు - రచన శ్రీ చిప్ప ఓదయ్య

సైనికుడు - రచన శ్రీ చిప్ప ఓదయ్య

సైనికుడు


అన్ని రంగముల కన్న
సైనిక  రంగమె  మిన్న
సైనికులే లేని అవని
కాంతి తప్పిన జనని_1

దేశానికి రక్ష సైనికులు
వారికివ్వాలి రక్షణ పాలకులు
మనకు ధైర్యాన్నిచ్చేది వారే
వారికిసాటి మరెవ్వరూ లేరే_2

సరిహద్దు రక్షణ సైనికులే
నిశీధిలోతారాజువ్వలు సైనికులే
వారే నింగిలోని సూర్యచంద్రులు
పుడమిపై      జనించిన పుణ్యపురుషులు_3

భూమాత పుత్రుడు సైనికుడు
యుద్ధరంగంలో వీర కిశోరుడు
భారతావనికి వెలుగు దివ్వెవు
జనులందరికి నీవే రక్షకుడవు-4

చేనుకు కంచె‌ రక్ష
దేశానికి సైనికులే రక్ష
మన సుఖనిద్ర ఫలం
ఎందరో సైనికుల త్యాగఫలం-5

చిప్ప ఓదయ్య
తెలుగు పండిట్
MPUPS  బొమ్మిరెడ్డిపల్లి
మండలం ధర్మారం
జిల్లా పెద్దపల్లి 7382322134
తెలంగాణ

29, జులై 2020, బుధవారం

కరోనా గ్రహణం - రచన శ్రీ తాటిపాముల రమేష్

కరోనా గ్రహణం - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴కరోనా గ్రహణం🌴

భూగోళ గ్రహానికి కరోనా గ్రహణం పట్టింది
ప్రపంచమంతా మూతికి బట్ట కట్టు కొని
హస్త రేఖలు అరిగేలా శానిటైజర్ ను  రుద్దుకుంటూ భయం నీడన బతుకుతుంది

అగుపించని శత్రువు కరోనాపై        ఆయుధం లేని యుద్ధం చేస్తూ
అలసిపోయిన గుండెలను అక్కున
చేర్చుకోవడానికి బండెడు బలగమున్నా
సముద్రమంత ఆస్తి ఉన్నా
అనుమానపు అడ్డుగోడలు ఎక్కువై 
మానవత్వం మంటల్లో మాడిపోతుంది

ఆపదను ఆసరా చేసుకుని
 జలగల్లా పీక్కు తింటున్న
కనికరంలేని “ కార్పోరేట్ ” జేబులకు
చిల్లులు పెట్టి రాక్షస ఖేలి ఆడుతుంది

కరోనా చివరి మజిలీ కూడా            
 చిరాకు పెడుతుంది.
కాలీ కాలనీ శవాలు                            
పీక్కు తింటున్న శునకాలు
పల్లెలు ,పట్టణాలు విషాద సరాగాలు
ఆలపిస్తున్నాయి 
మందో మాకో వచ్చేదాకా ఇంకా కొన్నాళ్లు
ఈ కన్నీళ్లు తప్పవు
అందాకా తాబేలులా తలను ఇంట్లోకి
ముడుచుకుని ఉందాం 
కరోనా నుండి మనల్ని మనం కాపాడుకుందాం
----‐-----------‐--------------------------
✍✍✍తాటిపాముల రమేష్ (టీచర్ )
శివనగర్, వరంగల్

7, జులై 2020, మంగళవారం

యువతరమా మేలుకో నవతరమా తెలుసుకో - రచయిత షేక్ రంజాన్

యువతరమా మేలుకో నవతరమా తెలుసుకో - రచయిత షేక్ రంజాన్

*యువతరమా మేలుకో
             నవతరమా తెలుసుకో
             -----------------------------

పౌరసత్వమంటూ
మతాలను రెచ్చగొడుతూ
ఐక్యతను దెబ్బతీసి
రాజ్యాంగానికి
తూట్లు పొడుస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా
       
          యువతరమా మేలుకో
           నవతరమా తెలుసుకో

మేధో సృజనకారుల పై
దాడులకు దిగుతూ
చరిత్రకు వక్రభాష్యాలు చెబుతూ
మనువే మా మనోరథం అంటుంటే
చూస్తూ మిన్న  కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

           యువతరమా మేలుకో
            నవతరమా తెలుసుకో

కార్మిక చట్టాల రద్దంటూ
పనిగంటలు హెచ్చిస్తూ
యజమానికి హక్కులంటూ
చట్టాలను మారుస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

           యువతరమా మేలుకో
            నవతరమా తెలుసుకో

గుళ్లు  గోపురాలంటూ
మసీదులు చర్చీలంటూ
బాబాలు యాగాలంటూ పాలకులు
కాలాన్ని వృధాచేస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

           యువతరమా మేలుకో
            నవతరమా తెలుసుకో

మేం చెప్పిందే రాయాలి
రాసిందే చెప్పాలని
 కళల్నీ,కలాల్ని
నియంతృత్వ ధోరణితో
శాసిస్తూ, పీడిస్తూ
భయోత్పాతాలను సృష్టిస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

           యువతరమా మేలుకో
             నవతరమా తెలుసుకో

అబద్దాలు పేర్చి మాయమాటలు కూర్చి
అవినీతి పరులంతా గద్దెలెక్కుతుంటే
వాగ్దానాలను నిలబెట్టుకోని వారు
మారణ హోమం చేస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

          యువతరమా మేలుకో
           నవతరమా తెలుసుకో

బాంబ్ బ్లాస్ట్ లు చేసినోళ్లకు 
తీవ్రవాదుల దన్నుండి  దొరికినోడికి
బెయిల్ మంజూరు చేస్తూ,
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు
బెయిల్ నిరాకరిస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

         యువతరమా మేలుకో
          నవతరమా తెలుసుకో

కలెక్టర్లు  జడ్జీలు
డాక్టర్లు   ఫ్లీడర్లు
కమీషనర్లు కాంట్రాక్టర్లు  అవినీతి నాయకుల
అండతో దోచుకుంటుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా
        
          యువతరమా మేలుకో
           నవతరమా తెలుసుకో

స్వేచ్ఛ కోసం పోరాటం
జీవించడం కోసం పోరాటం
ఆత్మగౌరవం కోసం పోరాటం
మరణించడానికి పోరాటం
తిలకించే యజమానులు
వినోదం పొందుతుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

         యువతరమా మేలుకో
          నవతరమా తెలుసుకో

కుటిలత్వానికి రక్తపాతానికి
మానవులను బలిచేస్తుంటే
పురుషులు స్త్రీలు పసిపిల్లలు
అనిలేకుండా ప్రతి ఒక్కరూ
నిరాశాసదృశ్యులవుతుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

          యువతరమా మేలుకో
           నవతరమా తెలుసుకో

కోర్టులకు ప్రభుత్వాలకు
తేడాలు  లేకుండా
ప్రభుత్వం  చెప్పేదే
న్యాయస్థానం తీర్పంటూ
అన్యాయమే చట్టమౌతుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

         యువతరమా మేలుకో
          నవతరమా తెలుసుకో

భూమి  కోసం
భుక్తి     కోసం
విముక్తి కోసం
దేశ్ ముఖ్ లను ఎదిరించాం
దొరలను దించాం
నిజాంను కూల్చాo
ఏకాధిపత్యపాలన చేస్తుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

         యువతరమా మేలుకో
          నవతరమా తెలుసుకో

బ్రిటీష్ వాణ్ణి ఎదిరించి
ఉరికంబం ఎక్కినారు
మన సంపద మనదని
తిరుగుబాటు చేసినారు
మా రాజ్యం మాకని
ఉవెత్తున లేచినారు
మన వాళ్లు మన సంపద
దోచు కుంటుంటే
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా

         యువతరమా మేలుకో
          నవతరమా తెలుసుకో
 
చూస్తూ మిన్న కుంటారా
మీరు చూస్తూ ఉంటారా
యువతరమా మేలుకో
నవతరమా తెలుసుకో
🌹🌹🌹🌹🌹🌹🌹


రచయిత :- షేక్ రంజాన్

20, జూన్ 2020, శనివారం

ఏమంటిరి ఏమిచేసితిరి - రచన షేక్ రంజాన్

ఏమంటిరి ఏమిచేసితిరి - రచన షేక్ రంజాన్

ఏమంటిరి ఏమిచేసితిరి
     ................ ...............
ఉద్యోగులు స్నేహితులంటిరి
కాంట్రాక్టు    ఉండదంటిరి
RTC     ప్రభుత్వమంటిరి
కాళ్లలో ముళ్ళు పళ్లతో తీసుడే నంటిరి 

        ఏమంటిరి ఏమిచేసితిరి

లక్షల  ఉద్యోగాలంటిరి
నిరుద్యోగం  ఉండదంటిరి
కార్మికులకు అండనంటిరి
కన్నీళ్లు   ఉండవంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి

విద్య   ఉచితమంటిరి
ఊరూరా   వైద్యమంటిరి
ఇంటింటికి  నల్లానంటిరి
రైతు ఆత్మహత్యలు ఉండవంటిరి

       ఏమంటిరి ఏమిచేసితిరి

మూడెకరాల భూమంటిరి
దున్నేవానిదే    భూమంటిరి
లక్షల    నాగళ్లంటిరి
లక్షలమందికి  ఉపాధి అంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి

ఆంధ్రోడి    పాలనంటిరి
మన భూములు మనవంటిరి
మన నీళ్లు   మనవంటిరి
సస్య   శ్యామలమంటిరి

         ఏమంటిరి ఏమిచేసితిరి

కాగితపు  ముక్కనంటిరి
ఫైరవీలు  ఉండవంటిరి
రోడ్లు   ఎక్కనీయనంటిరి
ధర్నాలు   ఉండవంటిరి
మన హక్కులు మనవంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి


రచయిత :-షేక్ రంజాన్

17, జూన్ 2020, బుధవారం

సైనికులకు జోహార్లు - రచన శ్రీ తాటిపాముల రమేష్

సైనికులకు జోహార్లు - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴  సైనికులకు జోహార్లు 🌴

1.  సాయుధ పోరాట పౌరుషం
నాన్న నూరిపోసిన దేశభక్తి
తెలంగాణ తెగువను పుణికిపుచ్చుకొని
కలల స్వప్నం కోసం సైన్యంలో చేరి
కరేజ్ ని చూపించి కల్నల్  గా ఎదిగిన
 సంతోష్ బాబు నీకు జోహార్లు
2.   శత్రువులకు సింహ స్వప్నమై
పగోని గుండెల్లో                                 
రైల్లు పరిగెత్తించిన యోధుడా
జగడానికి జంకని ధీరుడా
అనుకున్నోళ్ళకు ఆప్త మిత్రుడా
కరోనా ను వదిలి ప్రపంచాన్ని
కష్టాల పాల్జేసిన చిలిపి చైనా
కుహానా రాజకీయాలతో
డ్రాగన్ దొంగ దెబ్బ కు ఎదురొడ్డి
పోరు సల్పిన సైనికుడా
భారతమాత ఒడిలో ఒరిగిన
వీరుడా జోహార్లు
3.  బార్డర్ లో బాధ్యతలతో తరించి
దేశం కోసం , భరత జాతి కోసం
కంటికి నిద్ర లేక, కాలికి విశ్రాంతి లేక
నిరంతరం శ్రమించిన వీరులు
జాతి మొత్తం ప్రణమిల్లు తుంది
మీ తెగువ ముందర
మీ కీర్తి, యువతకు స్ఫూర్తి
భౌతికంగా దూరమైనా
మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతరు
వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు
(తూర్పు లద్దాఖ్ లో మరణించిన భారత సైనికులకు నివాళి తో)
------------------‐-------------------------
✍✍✍తాటిపాముల రమేష్ (టీచర్)
ZPHS WARDHANNAPET
WGL(R)

15, జూన్ 2020, సోమవారం

పదండి ముందుకు పదండి - రచయిత షేక్ రంజాన్

పదండి ముందుకు పదండి - రచయిత షేక్ రంజాన్

పదండి ముందుకు పదండి
...................................

పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

భగత్ సింగ్ వలె
పిడికిలి బిగించి
అల్లూరి సీతారామరాజు వలె
గుండెను చూపి
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

ఆజాద్ చంద్రశేఖర్ వలె
మీసం  తిప్పి
కొమరం భీం  వలె
తుపాకీ ఎక్కుపెట్టి
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

రుద్రమదేవి వలె
ఖడ్గం చేబూని
చాకలి ఐలమ్మ వలె
రోకలి బండ పట్టి
రజియా సుల్తానా వలె
సై అంటూ
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

అసిఫుల్లాఖాన్ వలె
ధీరత్వమును చూపుతూ
మంగళ్ పాండే వలె
పౌరుషం చూపుతూ
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

జ్యోతి రావ్ పూలె వలె
సామజిక ఉద్యమకారుడిగా
భీమ్ రామ్ అంబేద్కర్ వలె
విప్లవ యోధుడిగా వేగుచుక్క లాగా
పుచ్చలపల్లి సుందరయ్య వలె
పోరాట యోధులుగా ప్రజాసేవే పరమావధిగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం


ఝాన్సీ  లక్ష్మీ బాయి వలె
ఖడ్గం తిప్పుతూ
అరుణా అసఫ్ అలీ వలె
నాయకత్వంతో, ప్రగతి పథంతో
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

సావిత్రి బాయి పూలె వలె మడమ తిప్పని ధీశాలిగా 
బేగం  హజ్రత్ మహల్ వలె
యోధురాలుగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

కాళోజి నారాయణ వలె
ధిక్కార స్వరంతో
శ్రీ రంగం శ్రీనివాసరావు వలె
చెమట చుక్కవై మరో ప్రపంచపు దిశగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

దాశరధి కృష్ణమాచార్యులు వలె
కలంకు పదును పెట్టి
మగ్దూం మొహిద్దీన్ వలె
కలమే పోరాటం లాగా
సురవరం ప్రతాప్ రెడ్డి వలె
కలమే ఆయుధంగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

పదండి ముందుకు పదండి


రచయిత :-షేక్ రంజాన్

8, జూన్ 2020, సోమవారం

ఆశల అలలు ఆవిరైనయ్ - రచన శ్రీ తాటిపాముల రమేష్

ఆశల అలలు ఆవిరైనయ్ - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴ఆశల అలలు ఆవిరైనయ్ 🌴
1 .స్వరాష్ట్రం కై
ఆటనైనం, పాటనైనం
దరువు వేసే డప్పు నైనం
సడక్ బంద్ నుండి
సకల జనుల సమ్మె వరకు
పిడికిలేత్తినం
దిక్కులు పిక్కటిల్లేలా గర్జించినం
2. బంగారు తెలంగాణలో
ఉద్యోగుల బతుకులు
బాగుంటయ్ అనుకుంటే
ఆశల అలలు ఆవిరైనయ్
ఇచ్చిన హామీలన్నీ అటకెక్కినయ్
చేసిన బాసలన్నీ నీటిమీద రాత లైనయ్
3. కరోనా కల్లోలం తో
సంచిలోకి సగం జీతం రాబట్టే
EMI, ఇంటి ఖర్చులకు సరిపోక బట్టే
అమ్మ హార్ట్  పేషెంట్,                         నాన్న కు కాళ్ళనొప్పులు
మందులకు మనీ లేక తిప్పలైతాంది
తెచ్చిన అప్పులు కుప్ప లై
బతుకు సుడిగుండమై
సరస్వతి పూలు రాల బట్టే
4.    సబ్బండ వర్గాలను
సంబర పెడుతున్న సర్కారు
సంక్షేమ పథకాలను              సామాన్యులకు చేరవేసే చిరుద్యోగుల వైపు
కన్నెత్తి చూడట్లేదు, పల్లెత్తి మాట్లాడట్లే
5.  మర్లబడటం  మరిచిపోయినం
పౌరుషాలన్నీ లాకర్ల పెట్టినం
నమ్ముకున్న సంఘనాయకులు
సొంత పనులను చూసుకుంటున్రు
సమస్యల తోరణాన్ని సాధించడానికి
సిద్దాంతాలను సిగలో చెక్కి
యూనియన్ల విభేదాలను  గట్టునపెట్టి
వేతన జీవులు మరొక్కసారి రోడ్డెక్కాలి
మన ఐక్యతను ఎరక జెయాలే
----------------------‐-----------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

4, జూన్ 2020, గురువారం

మారిందన్నారు ఏం మారింది - రచన షేక్ రంజాన్

మారిందన్నారు ఏం మారింది - రచన షేక్ రంజాన్

మారిందన్నారు ఏం మారింది
........................................

మన మట్టి గొప్పదన్నాడు సోక్రటీస్
మనం మట్టి కాదోయ్
మనుషుల మన్నాడు గురజాడ
మట్టిని మతముతో అలుకుతుంటిరి

     మారిందన్నారు ఏం మారింది

రాజ్యాంగమును రచించిన
ప్రపంచ మేధావిని ఒక వర్గ మంటిరి
బ్రిటిష్ వారి తొత్తులను
మహాత్ముని చంపిన వాడిని
దేశ భక్తులంటుంటిరి

      మారిందన్నారు ఏం మారింది

గో మూత్రం  అమృతమంటిరి
ఎవరు  త్రాగరైతిరి
మాంసం  తిననంటిరి
వ్యాపారం  చేస్తుంటిరి
మతాలు మధ్య చిచ్చు పెడితిరి


      మారిందన్నారు ఏం మారింది

నీతి నిజాయితీ ధర్మం  న్యాయం
పాటించిన   వాడిని
దేశ    ద్రోహులంటిరి
ఎమి  పాటించని వాడిని
దేశ   భక్తులంటిరి

మారిందన్నారు ఏం మారింది

మతంగురించి  మాట్లాడేవాడిని
దేశ       భక్తుడంటిరి 
ప్రజల గురించి మాట్లాడేవాడిని
దేశ   ద్రోహులంటిరి


మారిందన్నారు ఏం మారింది

రచయత :-షేక్ రంజాన్

29, మే 2020, శుక్రవారం

ఐనా నాకేంటి - రచన షేక్ రంజాన్

ఐనా నాకేంటి - రచన షేక్ రంజాన్

ఐనా నాకేంటి
--------------------
కార్మిక చట్టాలు  రద్దు చేసిన
పని గంటలు    పెంచిన
వలస కూలీలు   నడిచిన
ఆకలితో       మరణించిన
             
                 ఐనా నాకేంటి

PRC   మాటెత్తకపోయిన
IR        రాకపోయినా
ప్రమోషన్స్  ఇవ్వకపోయినా
DA        లేకపోయినా
CPS    రద్దు కాకపోయినా
సగం   జీతాలు ఇచ్చినా
    
              ఐనా నాకేంటి

విద్యార్థులు  ఆహుతి ఐనా
యూనివర్సిటీలు  ప్రైవేట్ పరమైన
క్యాంపస్ లో   దాడులు జరిగిన
నిరుద్యోగులు రోడ్డున పడినా
 
            ఐనా నాకేంటి

నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన
పెట్రోల్ డీజిల్ రేట్లు  పెంచిన
రైతు పంటకు  ధర లేకపోయినా
ఆత్మ హత్యలు చేసుకున్న

           ఐనా నాకేంటి

రక్షణ రంగం   విదేశీలకు
రైల్వే  విమానాలు ప్రైవేట్ పరం
విద్య వైద్యం  కార్పొరేటర్లకు
బ్యాంకులు   విలీనాలు

              ఐనా నాకేంటి

జడ్జీలకు   పదవులు
అధికార్లకు  కోట్లు
పారిశ్రామిక వేత్తలకు  కోట్లు రద్దు
డబ్బు  దోచుకున్నోడు  పరదేశి

             ఐనా నాకేంటి

రచయత :-షేక్ రంజాన్
✊️✊️✊️✊️🙏🙏🙏🙏🌹🌹🌹

సుందర బృందావన - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

సుందర బృందావన - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

సుందర బృందావన మధ్యమున,/ సుందరి గోపిక సర్వం మరచి, మైమరచి!/ రమణీయ పూబాలలతో అతి రమ్యముగా,/ మనోమందిరంలో కొలువైన మోహనాంగుడి,/ ఊసులు లీలలు మనోహరంగా సన్నుతించు వేళ,/ మధుర మురళీగానం అలకింప!/ వేంచేసేను వేగిరముగా మోహనకృష్ణ!!/ సమ్మోహనా గానంతో సకలం పరవశింప!/ ముదిత కన్నులు ప్రేమకాంతులు ప్రసరించగా!/ చెక్కిలి లేలేత భానుడిలా ఎరుపెక్కగా!/ కోమలి ముదముతోడ మురిపెంగా!/ మధురభక్తిని కమనీయంగా సమర్పించెను!!!   - ప్రవీణ్ కుమార్ వేముగంటి.   26/05/2020, 13:25, మంగళవారం.

సమరభేరిని మోగించాలి - రచన శ్రీ తాటిపాముల రమేష్

సమరభేరిని మోగించాలి - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴సమరభేరిని మోగించాలి🌴
1. జగతిలో సగమై
    సృష్టికి మూలమై
    ఎవరెస్టు శిఖరం ఎక్కినా
    అంతరిక్షంలో అడుగుపెట్టినా
    అన్ని రంగాల్లో రాణించినా
    ఏమిటీ గృహహింస
.   ఎందుకీ చిత్రహింస
2. నాగరిక సమాజంలో
     అనాగరిక చేష్టలతో
     చిగురుటాకులా వణుకుతుంది
     మానవ మృగాల చేతిలో
     చిన్ని జీవితం చితుకుతుంది
3.  పురుషాధిక్యత   పడగ నీడలో
      చీదరింపులు, బెదిరింపులతో
      సమానత్వం కరువాయె
       మనసంతా బరువాయే
       ప్రజాస్వామ్యంలో పవరొస్తే
       పేరేమో నీదాయే
       అధికారం వాల్లదాయే
       అమ్మ కాల కోసం    
       ఆట బొమ్మను చేయడంతో 
       మగువ ప్రతిష్ట మసక బారుతుంది.
4.    ఉవ్వెత్తున ఉప్పెనై
        సముద్రంలో కెరటమై
        చీకట్లను చీల్చే సూర్య కిరణమై
        స్వేచ్ఛ వాయువుల కోసం
        వివౕక్ష సంకెళ్లను తెంపడం కోసం
        చీమల దండులా కదిలి
        సమర శంఖం  పూరించాలి
        సమరభేరీ ని మోగించాలి
----------‐-‐---‐------‐----------‐-'
✍✍✍ తాటిపాముల రమేష్ ,
      ZPHS  వర్ధన్నపేట .

26, మే 2020, మంగళవారం

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

లాక్డౌన్ కాలాన లక్షల సమస్యలాయే!
ఇంటి నుంచి పనాయే, ఇంట్లోనూ పనేనాయే!!
 కరోనా కాలంలో పనిమనిషి  రాకపోయే!
అర్థాంగి ఎన్నెన్నో ఆర్డర్లు వేసుడాయే!
షార్టులతోనే సాగిపొమ్మని హుకుం జారీచేసే!!
ముక్కు మూతి మూసుకొని భార్య  మాట వింటినాయే!
కాలమహిమ అని అట్లనే చేయబడితిని!!
బాసునుండి మెయిలాయే ఆఫీసుకు రమ్మని!
లాకుడవును కాలాన అలవాటైన ప్రాణమాయే!!
ఆఫీసులోన పాతపాట పాడితి హాయిగాఉందని!
హడావుడిగా బాసు వచ్చి కస్సుబుస్సులాడే !!
ఆఫీసనుకున్నావా? ఇల్లనుకున్నవా? అని చెడామడ వాయగొట్టే!
ఇటు బాసు ఆర్డరాయే, అటు భార్య హుకుమాయే!!
ముందు చూస్తే   గొయ్యాయే, వెనక చూస్తే నుయ్యాయే!
ఏమి పాలుపోక వాట్సప్పులోన మెస్సేజు పంపితినాయే!!
ప్రాణమిత్రుడొకడు వెంటనే బావురుమనే!
డోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నదని వాపోయే!!

(కార్టూనికి  కవిత)

-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
23/05/2020, 12:10, శనివారం.

25, మే 2020, సోమవారం

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

☺️ మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా ☺️

(లాక్ డౌన్ అరవై రోజులు పూర్తైన సందర్భంగా)

ప్రభుత్వాలు చేతులెత్తేసాయ్!
ఎవరి ప్రాణం వారు కాపాడుకోవలసిందే!
"తాంబూలం ఇచ్చేసాం తన్నుకు చావండి"
ఇది నాటి అగ్నిహోత్రవదాన్ల మాట!
"లాక్ డౌన్ ఎత్తేసాం మీ చావు మీరు చావండి"
ఇది నేటి పాలకుల అంతరంగం!

కరోనాకు తాళాలు ఇచ్చేసారు
ఇక తన్నుకు చావవలసిందే!
ప్రభుత్వాలు ఆధాయాన్వేషణలో పడ్డాయి!
రైల్లు,బస్సులు, కార్లు,ఆటోలు
ఎప్పటిలాగే రోడ్లెక్కాయి!
కరోనా తో కాపురం వేగవంతమయ్యింది!

ఆహారం దొరకని పులి
ఆబగా పొంచి చూసినట్టు
మీ కోసం కార్పొరేట్ ఆసుపత్రులు
గ్రీన్ కార్పెట్ పరచి ఎదురుచూస్తున్నాయ్!
దొరికితే సున్నంలోకి
ఎముకలు కూడ మిగలవు!
మరికొన్నిరోజులుపోతే
ఆసుపత్రులేవి ఖాళీ ఉండకపోవచ్చు!

ఇకనుంచి అందరివి
అనుమానపు బ్రతుకులే!
ఇక అనుమానించడమే
నీ జన్మహక్కు అవుతుంది!
ఎవరికి కరోనా ఉందో తెలియక
సతమతమైపోవలసిందే!
నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి!

ఇకపై హెల్త్ బులెటిన్ లు ఉండకపోవచ్చు!
ప్రసారమాధ్యమాలు మన్నుతిన్న పాములౌతాయి!
నాయకుల మాటలు కోటలు దాటతాయి!

ప్రాణంపోతే తేలేము!
అప్రమత్తంగా లేకపోతే మనలేము!
చావో బ్రతుకో మీ చేతిలోనే!
మరణానికి కొంచెం దూరంగా
మరి కొంచెం దగ్గరగా అంతే!

ఇది కరోనా కాలం!
మీ తలరాతలు మారి'పోయేకాలం'!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️☺️

24, మే 2020, ఆదివారం

వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్



🌴 వలస కూలీల వెతలు 🌴
1. పేదరికమే శాపమై
బతుకే జీవిత పోరాటమై
పనినెతుక్కుంటూ పట్నం పోయి
రెక్కలు ముక్కలు గా చేసి
ఆకాశ హార్మ్యాలను నిర్మించినం
రోడ్లన్నీ అద్దాలు గా మార్చినం.
2. ఇప్పుడు నగరం నడిబొడ్డున మీరు
మురుగు కాలువ పక్కన మేము
ఏసీ గదుల్లో  మీ విలాసాలు
దొడ్డు దోమలు దద్దుర్ల తో మా జీవితాలు
సెంటు బట్టలు మీవాయే
చినిగిన బట్టలు మావాయే
పరమన్నాలు మీవాయే
పాశిఅన్నం, పచ్చడి మెతుకులు మావాయే
3.  మా చెమట చుక్కలు చిందించి
 మీ వీధులన్నీ వెలుగుపూలను పూయించాము.
కరెంటు కాంతులు మీకాయే
గుడ్డి దీపం మాకాయే
మా రక్తాన్నంతా దారవోసి
మీ అభివృద్ధిలో అరిగిపోయినం.
4.  కరోనా కల్లోలం తో
రెక్కలు తెగిన పక్షులైనం
చేద్దామంటే పని లేక
చేతిలో పరక లేక
కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ
ఎర్రటెండలో పల్లె బాట పట్టినం
మీకు కనికరం లేదు
తొంగి కూడా చూడట్లే  తోపుగాళ్ళు
కన్నెత్తి చూడట్లే  కోట్లున్నోళ్ళు
పల్లెత్తి మాట్లాడట్లే పాలకులు
పాస్ పోర్ట్, వీసాల తో
పెద్దోళ్లు తెచ్చిన రోగానికి
పేదోళ్ళం బలైనం.
--------------------------------------‐-------
✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

23, మే 2020, శనివారం

ఆటవెలది పద్యం - 5 - రచన శ్రీమతి యం. రమ

ఆటవెలది పద్యం:

చెంతచేరనీకు చెడ్డయాలోచనా
చేరుగమ్యమందు చేటుచేయు
ఆకులలములన్ని యడ్డుగావచ్చినా
సవ్యమార్గమెంచి సాగునదులు.
 -యం. రమ


నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

💐 నాకొక పాట కావాలి  💐
*********

నేను పాడుకునేందుకు
ఒక పాటకావాలి!
ఆ పాటలో కథం తొక్కించే
భాష ఉండాలి!
ఆ పాటలో ఉత్తేజపరిచే
పదాలు ఉండాలి!
యుగళ గీతంలా కాదు
యువకుల నెత్తురు మండేలా ఉండాలి!

నేను పాడుకునేందుకు
 ఒక పాట కావాలి!
ఆ పాటలో ఉప్పెంగే
సముద్రముండాలి!
వసంత కాల మేఘగర్జన ఉండాలి!
పర్వత శిఖరాల్ని తాకే
జలపాతాలుండాలి!
నెలవంకను తెంపుకొచ్చే తెగువుండాలి!

నేను పాడే పాటలో చరణాలు
జనరక్తంలో తడిసిన ఎర్రగులాబీలు!
ప్రజాస్వామ్య ముసుగులో
భ్రమలకు గురిచేస్తున్న భావాలు!
.అసత్యాలతో పబ్బం గడుపుతున్న
పాలకుల నీతిబాహ్యా చర్యలు!
దోపిడీ జలతారు ముసుగులో
సామాన్యుల కన్నీళ్ళను తాగే చర్యలు!
ఇవి మాత్రమే ప్రస్ఫుటించాలి!

పాటతోపాటు ఒక
ఆయుధం కూడా కావాలి!
ఆయుధం తో పాటు
ఉక్కులాంటి గుండె కూడా కావాలి!
రాజ్యాధికార కుంభస్తలంపై కొట్టాలి!

కష్టాలు కడతేర్చి కన్నీళ్లు తుడిచేసి
బాటసారులకు నేను భరోసా నవ్వాలి!
నెత్తురోడుతున్న రోడ్ల పై నిలబడి
మృత్యువు దాడిచేయకుండా రక్షణైపోవాలి!

నేను పాడుకునేందుకు
ఒకపాటకావాలి!
పసిపాపల మోములో
మొగ్గనై విరియాలి!
వలస బ్రతుకులకు
నేను రాగమైపోవాలి!
అనురాగమై మురియాలి!!

డా.గూటం స్వామి.
(9441092870)
👍👍👍👍👍👍👍👍

22, మే 2020, శుక్రవారం

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴ఆమె  🌴
1.  మూడు ముళ్ళు, ఏడడుగుల
 బంధంతో ఒక్కటైన జంట
 పట్టుమని పది వసంతాలు గడవకుండానే
 మద్యం మహమ్మారి
  పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది
2.  ఇంటి పని ,వంట పనితో
నడుము వాల్చకుండా
రాత్రి దాకా మిషన్ లాగా
ఇకమత్ గా ఇంటినంత ఈడ్చు కొస్తుంటే
తాగొచ్చి తందనాలు ఆడుతుంటే
ఆమె ఆత్మాభిమానం ఆవిరై
కలలన్నీ కరిగి పోయి
దిగులు పక్షిలా దిగాలుగా చూస్తుంది
3.   సిక్స్ అయితే సీనే మారిపోయి
ఇరుకు ఇంట్లో వీరంగం మొదలెడితే
ఇంటి గుట్టు రట్టు కాకుండా
 పదిమందిలో పలచన కాకుండా
 కండ్లల్లో ఉబికి వచ్చిన ఊటను
 పైట కొంగుతో తూడ్చుకుంటూ
 పిల్లల కోసం బతుకుతుంది
4.  కాయకష్టం చేసుకొచ్చి
కంచం లోకి అందించి
ప్రేమనంతా గంపల కొద్దీ కుమ్మరించినా
సూటీ పోటి మాటలతో
శూలాలను మనసులో గుచ్చుతుంటే
ఆమే పస్తులున్న రాత్రులెన్నో
నిద్రపోని రోజులెన్నో
5. పని లేదని ఒకరు
ఊసుపోత లేదని మరొకరు
కాటన్ల కొద్దీ గుంజుతున్రు
సర్కారీ ఖజానా నింపుతున్రు
రాబడికి మరిగిన పాలకులు
ప్రజల పాణాలను గాలికొదిలిన్రు
6. చట్టాలెన్ని తెచ్చినా
హెల్ప్ లైన్లు ఎన్ని వచ్చినా
ఆమె రాత మారట్లేదు
ఆమెను కష్టపడితే కాళిమాతై
కన్నెర్ర జేస్తుంది
 లవ్ లీ గా చూసుకుంటే
లక్ష్మీ దేవతై వరములిస్తది
---‐-‐----------------------------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHSWARDHANNAPET.

21, మే 2020, గురువారం

ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ


ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ
ఆ.వె
మెచ్చలేనినెయ్య మేలనిల్వగలదు?
స్వార్ధగుణమెయున్న సాయమగున?
కార్యదోషమున్న కలుగునాఫలితమ్ము
సత్యమరసిమెరుగు నిత్యముగను!
                     యం.రమ🙏

20, మే 2020, బుధవారం

ఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమ



ఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమ
ఆటవెలది పద్యం
చదువునేర్చకూడా సంస్కారమును లేక
సార్థకంబుకాదు సాధనెపుడు
విద్యవినయమున్న విద్యార్థివిలసిల్లు
విజయపథమునందు వెలుగులీను.
     - రచన శ్రీమతి యం. రమ

19, మే 2020, మంగళవారం

ఆటవెలది పద్యం - 2 - రచన శ్రీమతి యం. రమ

ఆ.వె. పద్యం:
కల్మషమ్ములేక కమనీయమవు మాట
యెంతవారినైన శాంతపరచు
కఠినమాటలాడు కర్కశులమదికి
వందనములెవేయు బంధనములు
-శ్రీమతి ముంజ రమ.

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

శ్రీరామ భక్తాగ్రేసరా రామదూత హనుమా!!
మా ప్రార్థనలను ప్రీతితో స్వీకరించుమా!
మా మొరలను ముదముతో ఆలకింపుమా!
అంజనీపుత్ర అమేయ గుణసంపన్న హనుమా!!
మాకు సద్భుద్ధి సతతం ప్రసాదింపుమా!
మాకు సన్మార్గం సత్వరమే చూపుమా!
వాయునందనా మహాబలశాలీ హనుమా!!
మా ఆరోగ్యాలను సదా రక్షింపుమా!
మా భయక్రోధాలను నిత్యం నివారింపుమా!
సుగ్రీవమిత్ర వినయవిధేయ హనుమా!!
మా శోకకారకాలను శీఘ్రముగా నివారించుమా!
మా మనోవ్యాకులతను మమతతో మట్టుబెట్టుమా!
భక్త సులభానుగ్రహ భక్తశ్రేష్ఠ హనుమా!!
మాకు సద్గుణాలను సదా సిద్దింపజేయుమా!
మాకు లక్ష్యసాధనా మార్గమ్మును హితముతో బోధింపుమా!
లక్ష్మణ ప్రాణరక్షకా లంకపురి దహన హనుమా!!
మా విజయాతిశయములను  మమతతో త్రుంచుమా!
మాకు వినయ విధేయతలను విస్తృతంగా అందింపుమా!
రుద్రాంశ సంభూత భవిష్యత్తు బ్రహ్మా హనుమా!!
నీదు కీర్తనములే  మా సకల సంకట హరణం హరణం!!
నీదు నామమే అనవరతము మాకు శరణం శరణం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
(వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా)
17/05/2020, 13:20, ఆదివారం.

18, మే 2020, సోమవారం

కార్మికుడా ఓ కార్మికుడా - రచన షేక్ రంజాన్


కార్మికుడా  ఓ  కార్మికుడా - రచన  షేక్  రంజాన్
🚩కార్మికుడా  ఓ  కార్మికుడా🚩
................................

బ్రతుకు దెరువు కోసము
ఊరూరు  తిరుగుతావు
కాయ కష్టము చేసి
నాలుగు పైసలు సంపాదించి
పూట పూటను గడుపుతావు
               ~కార్మికుడా ఓ కార్మికుడా ..

పిల్ల పాపలను చంకనేసుకొని
పొట్ట కూటి కోసం  వలస వెళ్ళితివి
ప్యాక్టరీలు పరిశ్రములు నడిపించి
రైతన్నకు తోడైతరి
దేశాభిరుద్దిలో భాగమైతిరి
        ~ కార్మికుడా ఓ కార్మికుడా ..

విత్తు విత్తేది  పంటకోసేది
లోడు ఎత్తేది  లోడు దించేది
రోడ్లు వేసేది  బిల్డింగ్ కట్టేది
రాళ్లు కొట్టేది  శిల్పం చెక్కేది
ఇనుమును కరిగించేది  ఆయుధం తయారు చేసేది
ఐన నీవు పేదవాడివి
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

పని మనిషివి  తోటమాలివి
జీతగాడివి గుమస్తవి
పారిశుద్దివి  కాపలాదారుడివి
రోజు కూలివి  సహాయకారివి
ఇంటి నుండి గెంటివేసిరి
       ~కార్మికుడా ఓ కార్మికుడా..

ఉండటానికి ఇల్లు లేదు
తింటానికి  తిండిలేదు
త్రాగటానికి నీళ్లు లేవు
కట్టుకోవటానికి బట్ట లేదు
కాళ్లకు చెప్పులు లేవు
నిద్రవస్తే బండరాయినీకు పరుపు
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

యజమానులు  పెత్తందార్లు
కాంట్రాక్టర్లు  కమిషన్లదార్లు
MLA లు    MP లు
మంత్రులు , ముఖ్యమంత్రులు ,
ప్రధానమంత్రి ,రాష్ట్రపతి
మీదెగ్గరకు  రాకపాయ
మీ గోస వినరాయా చూడరాయ
        ~కార్మికుడా ఓ కార్మికుడా ...

నీ నడకకు  నీ కన్నీటికి
నీ దాహంకు  నీ ఆకలికి
నీ కష్టాలకు  నీ హింసకు
నీ చావుకు  కారకులెవరు
కారకులెవరు  కారకులెవరు
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

నీలో ఉన్నది   ఆయుధం 
ఆ ఆయుధమే   ఓటు
నీ ఓటే   నీ జీవితాన్ని మారుస్తుంది  మారుస్తుంది
మారుస్తుంది  మారుస్తుంది
       ~ కార్మికుడా ఓ కార్మికుడా ..
✊️✊️✊️✊️✊️✊️✊️    

రచయిత.....
     షేక్  రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

ఆటవెలది పద్యం- 1 - రచన శ్రీమతి యం. రమ

ఆ.వె
కాయకష్టమోర్చి కన్నబిడ్డలపెంచి
చదువుసంధ్యలందు చక్కదిద్ది
వెలుగునీడలయ్యి వెన్నంటిగెలిపించె
తల్లిదండ్రిమనకు దైవమిలన.🙏
                   శ్రీమతి   యం.రమ.

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

☺️ ఇక అదేగా మిగిలింది! ☺️
*********
ఇప్పుడు రాత్రి పగలు
ఒక్కలాగే కనిపిస్తున్నాయి!
జీవితంలో ఒక మెరుపూ లేదు!
భవిష్యత్తు ను గూర్చిన భరోసా లేదు!
ఆలోచనలు చుట్టుముడుతున్నవేళ
అనునిత్యం అన్వేషిస్తున్న సమయాన
విహ్వలత తప్ప విహారాలు కొరవడ్డాయి!

ఏభైమూడురోజులు
లాక్ డౌన్ నేర్పిన పాఠంలో
తిరిగి చూసుకుంటే సాదించిందేమి లేదు!
అన్నీ సాధించానని కాలరెగరేసిన మనిషి
కరోనా ముందు బోర్లపడ్డాడు!

ఈ సమస్యకు పరిష్కారం దొరకని పాలకులు
రాయితీల రొట్టెముక్కలు విసిరి
పంచుకోమంటూ తమాషా చూస్తున్నారు!

అవి తమవరకు రావని తెలిసినా ప్రజలు
గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారు!
చేవ చచ్చిన యువత
సెల్ ఫోన్, ల్యాప్ టేప్లతో
కాలక్షేపం చేసేస్తున్నారు!
రేపటికి ఉంటామో,లేమో తెలియని మనిషి
కలల లోకం లో విహరిస్తున్నాడు!

రాజకీయ ఆటలో జోకరౌతున్న మనిషి
కరోనా కాటుతోనైనా బుద్ధి తెచ్చుకుంటే సరి...!
లేకపోతే కాలమే సమాధానం చెబుతుంది!
ఇక అదేగా మిగిలింది!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️

17, మే 2020, ఆదివారం

మనిషి నువ్వు మారాలి - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

 మనిషి నువ్వు మారాలి - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
* మనిషి నువ్వు మారాలి*
ఆవు సాధుత్వం, పులి క్రూరత్వం!
నక్క కపటత్వం, కుక్క నమ్మకత్వం!
మరి మనిషి గుణం చెప్పగలమా!?
పుస్తకం మీద శీర్షికను చూస్తే జ్ఞానం వస్తుందా?
వండిన పాయసం చూస్తే రుచి తెలుస్తుందా?
అవసరం వచ్చినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు!
మనస్సు పొరల్లో దాగున్న రాక్షసత్వం,
లావా లాగా పైకి విరజిమ్ముతుంది!
నకారాత్మక భావాలు, వికృత ఆలోచనలు,
అణు విస్ఫోటనం లాగా ఎగిసిపడుతున్నాయి!!
బుద్ధి పెడదారి పట్టమని పదే పదే ప్రోత్సహిస్తుంటాయి!
ఫలితంగా నేరాలు, ఘోరాలు, దారుణాలు, అకృత్యాలు!
దోపిడీలు, దొంగతనాలు బలాత్కారాలు, తీవ్రవాదాలు!
మోసాలు, కుటిల రాజకీయ కుతంత్రాలు!
పైగా ప్రసార మాధ్యమాలలో చర్చలు!
విపరీత ధోరణులు! విశ్లేషణలు, విరుద్ధ భావాలు!
మనిషి దుర్భుద్ధి పై సిద్ధాంతాలు, సూత్రీకరణాలు!
 ఇవేవీ జరుగుతున్న దారుణాలను అడ్డుకోలేవు, ఆపలేవు!
సమాజంలో నిత్యకృత్యాలుగా, సెల్ఫీల సంబరంగా సాగుతున్నాయి!
సమసమాజ నిర్మాణానికి, శాంతిసమాజ స్థాపనకు!
మనిషిగా నువ్వు మారాలి, నీ ప్రతికూల భావాల్ని తుంచాలి!
నీ మదిలో అనుకూలభావాలకు అంకురార్పణ జరగాలి!
నువ్వు అమ్మలాగా మారాలి, అలా ఆలోచించాలి!
అందరినీ ఆదరించాలి, ప్రేమించాలి!
ప్రతివ్యక్తిని అమ్మ మనస్సుతో చూడాలి!
పలువిధాల దారుణాలకు ముగింపు పలకాలి!
అప్పుడే మనిషిలో ప్రశాంత చిత్తం!
అప్పుడే లోకంలో శాంతి సుస్థిరత్వం!!
అప్పుడే లోకంలో సమసమాజ స్థాపనం!
అప్పుడే సమస్త జగత్తు సుఖవంతం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
16/05/2020, 11:20, శనివారం.

15, మే 2020, శుక్రవారం

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

మాధవ, మధుసూధన, నారాయణ!
నీ దర్శన భాగ్యఫలం చేత,
నా అజ్ఞాన పొరలు అంతరించే.
నీదు నామజప మహిమ తోడ,
నా పాపములన్నీ పటాపంచలయ్యే.
అనవరతము నిను కొలుస్తూ,
నీ రూపమే అపురూపంగా హృదిలో నిలుపుతూ
నీ అర్చనే నా జీవనముగా భావిస్తూ,
నా జీవితానికి నీవే దిక్కని నమ్ముతూ,
సదా నీ నామ స్మరణే నాకు శరణం!
నన్ను సంస్కరింప రావా!
అచ్యుతా, కేశవా, జనర్ధన!!
(వైశాఖ మాసం సందర్భంగా)

-శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
25/04/2020, 19:25

ఉత్తరాల తీగ - రచన శ్రీ డా.గూటం స్వామి


ఉత్తరాల తీగ - శ్రీ డా.గూటం స్వామి
💐 ఉత్తరాల తీగ 💐
********

ఇది ఇనుప వస్తువు కాదు
అదొక జ్ఞాపకాల మాల!
తలపుల దొంతర్లను
తన గుండెల్లో గుచ్చుకునే
అపురూప చెలికాడు!

గతంలో ప్రతి ఇంట ఉత్తరాల తీగకు
ఉత్తరాలు గుత్తులుగా పూసేవి!
ఆప్యాయతా పరిమళాలు వెదజల్లేవి!
అందంగా పలకరించేవి!
బంధుత్వాలను పెంచేవి!
స్నేహితులను కలిపేవి!
ఓదార్పును కలిగించేవి!
గతాన్ని కళ్ళముందు పరిచేవి

ఉత్తరాల తీగ ఒక గ్రంథాలయమే!
తాత అమ్మకు రాసిన ఉత్తరం
నాన్న నాయనమ్మకు రాసిన ఉత్తరం
అమ్మ నాన్న ల పెళ్ళికార్డు
ఉత్తరాల తీగలో పదిలం!!

అదొక పురాతన ఆత్మీయ నిధి!
ఒంటరి జీవుల పాలిట పెన్నిధి!
గత చరిత్రకు సాక్షీభూతి!

నేడు ఉత్తరాలు లేవు
ఉత్తరాల తీగలు లేవు!
రాసే తీరుబడి లేదు
చదివే ఓపిక లేదు!
సెల్ ఫోన్ సవ్వడులమధ్య
ప్రాణం లేని పలకరింపుల మధ్య
ఉత్తరాల తీగకు చోటెక్కడిది?
సంబంధాలు వ్యాపారమైన రోజుల్లో
ఉత్తరాలు రాసే అలవాటు ఎక్కడిది!

ఎన్ని సమాచార విప్లవాలు వచ్చినా
సామాన్యుని సమాచార సౌకర్యం ఉత్తరమే కదా!

ఈసారి మా ఊరెళ్ళినప్పుడు
అటకమీద పాత మానుపెట్టెలో
మా తాత భద్రంగా దాచిపెట్టిన
ఉత్తరాలతీగను తెచ్చుకోవాలి!
నా మూలలను ఒకసారి తడుముకోవాలి!!

డా.గూటం స్వామి
(9441092870)
💐💐💐💐💐💐💐

14, మే 2020, గురువారం

కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్
🌴కష్టాల గుట్టలు 🌴
1. కరోనా  దెబ్బ
    బడుగు  బతుకుల మీద                                                
    పిడుగు దెబ్బ  
    ఉన్న ఉపాధి ఊడి
    చేద్దామంటే పని లేక
    చేతిలో కాని లేక
    వ్యవస్థ అవస్థ గా మారడంతో
    చేసేది  లేక ఉసురు పోసిన
    ఊరి వైపు కదులుతుండ్రు
2. చంకలో చంటి పిల్ల
    నెత్తి  మీద మూట ముల్లె
    సూర్యుడు నిప్పుల
    వర్షం  కురిపిస్తుంటే                 
    ధరణి నూనే కాగిన                            
    గంగాళంలా కాలుతుంటే                                       
    పాదాలకు పాదరక్షకాలు లేక
    కొందామంటే కొత్తలు లేక                    
    కాలిన బొబ్బలతో   
    పాదాలు అరిగే దాక 
    గమ్యం ముద్దాడే దాక
    మారథాన్ ను  సాగిస్తుండ్రు
    స్వేద  సముద్రంలో ఈదుతూ   
    అనుకోకుండా మార్గ మధ్యలోనే
    యముడి ఒడిలో  ఒరుగుతుండ్రు      
3. వాళ్లకు ఢాంబికాలు,                           
    దందాలు తెలియదు
    మాటల మధుర గుళికలు తెలుసు
    కడుపులో కల్మషాలు తెలియదు
    కాయకష్టం తెలుసు
    జేబులకు చిల్లులు పెట్టడం తెలియదు
    పెదవిపై చిరునవ్వు తెలుసు.
4.ఏడు దశాబ్దాల కాలంలో ఏలికలు
   పేదరికంపై ఎత్తిన కత్తి మొండిదైంది
   ఉపాధిపై గురి పెట్టిన                                
   బాణం ఉత్తదయింది
   బడుగుల రాత మారట్లేదు
   కష్టాల గుట్టలు కరగట్లేదు
   ఓట్లేసుకున్నోళ్ళు ఒడ్డెక్కుతుండ్రు          
   ఓట్లేసినోళ్ళు గడ్లెకలుస్తుండ్రు
   ఓటు ఆయుధం తియ్యాలి
   బడుగులను మరిచినోళ్ళకు
   వాత పెట్టాలి.
 ------------------------------‐---
 ✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

13, మే 2020, బుధవారం

ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి


ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
ఆధునిక తత్వవేత్తలకు ఆద్యులు!
జిడ్డు కృష్ణమూర్తి తత్వ ఆధ్యాత్మికవేత్తగా విఖ్యాతులు!!
దివ్యజ్ఞాన సమాజ జగద్గురువుగా ప్రఖ్యాతి!
పలు దేశాల్లో అధ్యాత్మిక ప్రసంగాలతో ప్రశస్తి!!
జగద్గురువుగా పొందిన గౌరవాలకు ముగింపు,
అసాధారణ రీతిలో సాధారణవ్యక్తిగా జీవితం కొనసాగింపు!!
హృదయంతరాళంలో విప్లవ మథనం,
మనిషిలో సంపూర్ణ పరివర్తనా సాధనం!!
రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలు!
మానవునిలో సమూల మార్పులు తేలేని ఉపకరణలు!!
సరికొత్త ఆదర్శాలు, మతాత్మక ఆశయాలు!
మనిషి మనస్సును సంపూర్తిగా మార్చని విషయాలు!!
ఇలా ఎన్నెన్నో తత్వాలు ఎన్నెన్నో తర్కాలు,
సమస్త మానవాళిని మార్చగలిగే బోధనలు!!

అనిబీసెంటు మార్గనిర్దేశంలో ఎదిగిన పరమ జ్ఞానులు!
ప్రసిద్ధ రిషి వ్యాలీ పాఠశాల వ్యవస్థాపకులు!
తెలుగునేలపై ఉద్భవించిన ఉషస్సు!
భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన తేజస్సు!!
ప్రపంచవ్యాప్తంగా తన తత్వాలలో చిరంజీవిగా యశస్సు!!!
(ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
12/05/2020, 18:30, మంగళవారం.